ఇంతలో ఒక్కసారిగా మా డ్రామా సర్ రూమ్ లోకి వచ్చాడు…స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (15-01-2017)

సంక్రాంతి శుభాకాంక్షలు
(గత సంచిక తరువాయి)
డ్రామా ప్రాక్టీస్ వేగం పుంజుకుంది. డైలాగ్స్ అన్నీ బాగా బట్టీ పట్టేసాం. ఎవరి పాత్ర వచ్చినప్పుడు వారి డైలాగ్ వచ్చి చెప్పేస్తున్నాం… అదే యాక్టింగ్ అని తెగ ఫీల్ ఐపోతున్నాం..
ఇదిలా ఉండగా ఒక రోజు ప్రాక్టీస్ కు డ్రామా రూమ్ లో చేరాం. సర్ ఇంకా రాలేదు.
ఇంతలో మా క్లాస్ మెట్ రాజకీయనాయకుడి రోల్ వేసే అతను నన్ను ఆటపట్టించడం స్టార్ట్ చేశాడు. నా పక్కన చేరి గిలిగింతలు పెడుతూ బాగా అల్లరి చేస్తున్నాడు.
నేను వద్దని వారిస్తున్నా వినకుండా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు.
ఇంతలో ఒక్కసారిగా మా డ్రామా సర్ రూమ్ లోకి వచ్చాడు.
ఇంకేముంది… మా ఫ్రండ్ చేసే అల్లరి అతని కంటపడింది…
ఇద్దరినీ పిలిచాడు… నేను ఏమి జరిగిందో చెప్పేదానికి ట్రై చేశాను.
నేను చెప్పేది వినిపించుకోకుండా ఒక్కసారి చెంప మీద చెళ్ళున కొట్టాడు…
నాకు 5 నిముషాల వరకు ఏమి జరిగిందో అర్థం కాలేదు…
నా తప్పు లేకపోయినా నన్ను కొట్టడం ఏమిటి?
అవతలి వారు చెప్పేది వినడం అన్నది టీచర్స్ లో ఉండదా?
తప్పు ఒకరు చేస్తే శిక్ష మరోకరికా… గురువు అన్న పదం మీద విలువ ఒక్కసారి తగ్గినట్టు అనిపించింది.
టీచర్స్ కు ఆవేశాన్ని కాంట్ర్రోల్ చేసుకునే విధానం తెలియదా…
ఆ రోజంతా ముభావంగా ఉన్నాను. ఇచ్చిన డయలాగ్స్ అప్పజెప్పి ఏదోలా డ్రామా ముగిసేలా చూశాను…
ఎందుకో అక్కడకు మరోసారి రాకూడదు అనిపించింది… ఇంత అవమానం జరిగాక ఇక ఎలా రావడం…
మనసు చంపుకుని డ్రామా ఎలా కంటిన్యూ చెయ్యడం…
మనం వదిలేస్తే మరొకరిని తీసుకుంటారు. వందల మంది ఉన్న స్కూల్ లో ఒక్కసారి స్టేజి పైకి ఎక్కితే అందరి చూపు మన పైనే…
మన స్టేటస్ పెరుగుతుంది…
ఏదీ డిసైడ్ చెయ్యలేక చాలా రోజులు మధనపడ్డాను…
ఒక రోజు…చివరకు ఏదైతే అది అయ్యిందని కంటిన్యూ కావాలని డిసైడ్ అయ్యాను.
***
ఇలా ఉండగా ఒక రోజు…
డ్రామా ప్రాక్టీస్ జరుగుతుంటే ఒక పెద్దాయన మా రూమ్ లోకి వచ్చాడు.
స్పురద్రూపి… ఆజానుభాహువు… తల నున్నగా అప్పుడే కడిగిన వెండి చెంబులా ఉంది.
మా డ్రామా సర్ ఆయనను తీసుకువచ్చాడు… ఆయనను చూస్తే ఎవరో పేరెంట్ లా ఉన్నాడు.
మా ప్రాక్టీస్ ఆపేసి ఆయనను చూడడం స్టార్ట్ చేశాం…
“మీరు కంటిన్యూ చెయ్యండి” అన్న మా సర్ మాటలు విని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం.
ఆయన ఎవరు అన్న సంశయం ఒకప్రక్క మదిని తొలిచేస్తున్నా దాన్ని పక్కనకు నెట్టేసి కంటిన్యూ చేశాం.
డ్రామా రిహార్సల్ అయ్యింది…
మా సర్ ఆయన వైపు తిరిగి “ఎలా ఉంది సర్” అని అడిగారు
ఆయన చిరునవ్వు నవ్వి మా డ్రామా స్క్రిప్ట్ చేతిలోకి తీసుకున్నారు.
5 నిముషాలు ఎవరితో మాట్లాడకుండా స్క్రిప్ట్ మొత్తం చదివారు.
అతను ఏమి చెప్తాడో అనుకుంటూ ఇంట్రెస్ట్ గా ఆయన వైపే చూస్తున్నాం.
ఇంతలో ఆయన లేచి నిలుచున్నాడు.
డ్రామా స్టేజి అనుకుంటూ మేము ప్రాక్టీస్ చేసే ప్లేస్ కి వచ్చి నిలుచున్నాడు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY