ఒక్కక్షణం భయంతో అతని ఒళ్ళు జలదరించింది.అతనిలా చేయడం మొదటిసారి కాదు….వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (22-01-2017)

                                             (13)
అనిరుద్ర ఎర్విక్ వైపు చూసాడు.ఆమె కళ్ళు అల్లరిగా అతడిని ఆట పట్టిస్తున్నాయి.”నిజం చెప్పమంటారా?స్వాప్నిక మీకు మంచి మ్యాచ్..నాకంటే అందంగా ఉంటుంది.అన్నయ్యంటే విపరీతమైన ప్రేమ…అన్నయ్యను ప్రేమించేవాళ్ళు భర్తను ఇంకా అధికంగా ప్రేమిస్తారు..అన్నట్టు నిన్న మాటల్లో చెప్పింది ఆ అమ్మాయిది హన్మకొండేనట…”అనిరుద్రను చూస్తూ చెప్పింది.
అనిరుద్రకు నవ్వొచ్చింది.అప్రయత్నంగా అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
“తనకు ఇలాంటి బంధాలు తెలియవు…డ్యూటీ మాత్రమే తెలుసు.
తను బుల్లెట్స్ తోనే మాట్లాడుతాడు.క్రిమినల్స్ ను పట్టుకోవడంలో మైండ్ గేమ్ మాత్రమే తెలుసు.మనసుతో మాట్లాడ్డం,హార్ట్ తో కబుర్లు చెప్పడం తెలియదు…”
“పాపం స్వాప్నిక చాలా మంచమ్మాయి”అన్నాడు అనిరుద్ర.
“అందుకే కదా…పాపం ఆ అమ్మాయిని కాస్త దగ్గరికి తీసుకోండి..మీ గుండెల్లో కాస్త ప్లేసును లైఫ్ టైం లీజుకు ఇవ్వండి”అంది పంటిబిగువున నవ్వునాపుకుంటూ…
అప్పుడే అక్కడికి అడుగుపెట్టిన స్వప్నిక ఈ మాటలు వింటూనే వుంది.
ఒక్కక్షణం ఏం చేయాలో అర్థం కాలేదు.కాసింత సిగ్గు,మరికాసింత బుగ్గల్లో ఎరుపు…నిన్నటివరకూ తను ద్వేషించి చంపాలని అనుకున్న వ్యక్తి…ఈరోజు…?
“రా స్వాప్నిక ..నీ గురించే మాట్లాడుకుంటున్నాం”అంది ఎర్విక్.
“నాగురించా?చాలా అమాయకమైన ఎక్స్ప్రెషన్ తో అంది.
“ఆస్కార్ కు ట్రై చేయొచ్చు’అంది ఎర్విక్
సిగ్గుతో తలొంచుకుంది స్వాప్నిక .అనిరుద్రకు ఆ సిట్యుయేషన్ గమ్మత్తుగా వుంది.
స్వాప్నిక చేతిలో క్యారియర్ వుంది.
“ఓహ్ క్యారియర్ తెచ్చావా?స్వాప్నిక ను దగ్గరికి తీసుకుంటూ అంది.ఒకరోజులోనే ఎర్విక్ స్వాప్నికకు దగ్గరైంది.
చాలాకాలం తర్వాత తృప్తిగా తిన్నట్టు అనిపించింది అనిరుద్రకు…స్వాప్నికకు కూడా….
అనిరుద్ర స్వాప్నిక ఎర్విక్ ల వైపు చూసి చెప్పాడు.”రేపే మన ప్రయాణం..మృత్యువు సరిహద్దుకు.”
“మీతో ఎక్కడివరకైనా రావడానికి సిద్ధం.మీరుండగా మిమ్మల్ని దాటి మృత్యువు మమ్మల్ని చేరే సాహసం చేయదు.మేము ఉన్నంతవరకూ మృత్యువును మీ దరికి రానివ్వం”స్థిరంగా చెప్పింది ఎర్విక్.
అనిరుద్ర లేచాడు.టీపాయ్ మీద వున్న ఫైల్ తీసుకున్నాడు.అందులో వున్న నార్త్ అవెన్యూ మ్యాప్ చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూసాడు.
అనిరుద్రలో చిన్నసందేహం పెరిగి పెద్దవ్వసాగింది.
నార్త్ అవెన్యూ రహస్యాన్ని బద్దలుకొట్టడానికి యుద్ధభేరి మోగించాడు.
                                           ***
రాత్రి పన్నెండు కావస్తుంది.
నిర్మానుష్యమైన ప్రాంతం.భీతికొలిపే వాతావరణం.చల్లగాలి శరీరాన్ని వణికించేస్తోంది.
నార్త్ అవెన్యూ కు కూతవేటుదూరంలో వున్నాడు డప్పుదాసు.”ఇందుమూలంగా నార్త్ అవెన్యూ దగ్గర తప్పిపోయి కనిపించకుండా పోయినవారికి తెలియజేయునది ఏమనగా,మీరెక్కడ వున్నా భయపడకండి.మిమ్మల్ని రక్షించాడనికి దేవుడు వస్తున్నాడహో…హో హో హో”డప్పు మీద చేతివేళ్ళతో వాయిస్తూ టముకు వేసాడు డప్పుదాసు.
తన టముకు తనకే వినిపిస్తోన్నట్టు అనిపించింది.ఒక్కక్షణం భయంతో అతని ఒళ్ళు జలదరించింది.అతనిలా చేయడం మొదటిసారి కాదు..కొన్నిసార్లు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.మొదటిసారి భయపడుతున్నాడు డప్పుదాసు.
ఓసారి నార్త్ అవెన్యూ ఇనుపకంచె దగ్గరికి వచ్చాడు.నార్త్ అవెన్యూ వైపు చూసాడు.ఒంట్లో వణుకు పుట్టింది.మళ్ళీ టముకు వేసాడు…
అప్పుడే నార్త్ అవెన్యూ ప్రాంతంలో నేలమీద పడివున్న ఎండుటాకుల మీద శబ్దం.ఎవరో పరుగెతుకు వస్తోన్న శబ్దం.
డప్పుదాసు వెనక్కి తిరిగాడు.భయంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి.
అతని గొంతులో నుంచి పెద్దకేక వినిపించింది.
***
ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది గోమతి.
ఎవరిదో గొంతు భయంతో అరిచిన అరుపు…అంతకు ముందే చెవులకు టముకు వినిపించింది.అంతలోనే అరుపు..చాలా దగ్గర నుంచి…
నార్త్ అవెన్యూ దగ్గరి నుంచేనా?ఆ ఆలోచన రాగానే గోమతిలో భయం మొదలైంది.
తమను బంధించి ఎన్ని రోజులు అయ్యిందో కూడా తెలియదు…తన పక్కన ఉన్న వృద్ధుడు ఎలా వున్నాడో..అని ఆలోచిస్తూ పక్కకు తలతిప్పి షాకయ్యింది.
పక్కన వృద్ధుడు లేడు…కుర్చీకి కట్టివున్న కట్లు ఊడిపోయి వున్నాయి.
అంటే  తప్పించుకున్నాడా?తనకు చెప్పకుండానే తప్పించుకున్నాడా?లేదంటే అతడిని ఎవరైనా….భయంతో అనే స్థాణువులా ఉండిపోయింది.అపుడే ఆమెలో ఏదో సందేహం.తన వెనుక ఎవరో వున్నారు.ఆ నీడ తన ముందు పడుతుంది.గట్టిగా కళ్ళుమూసుకుంది గోమతి.
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
నార్త్ అవెన్యూ నేపథ్యం,
ఇలాంటి సైకోలను ఏం చేద్దాం?
(పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా)
చెన్నైలో ఓ మెడికో స్టూడెంట్ కుక్కను పైనుంచి విసిరేసి, అదంతా వీడియో తీసి పైశాచిక ఆనందం పొందిన ఘటన గురించి వినే ఉంటారు. ఈ ఘటన మరువక ముందే వెల్లూరులోని క్రిష్టియన్ మెడికల్ కాలేజ్‌ హాస్టల్‌లో మెడిసిన్ చదువుతున్న నలుగురు స్టూడెంట్స్ ఓ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ కోతి పిల్లను కాళ్లు కట్టేసి, బెల్టుతో కొట్టి చిత్రవధకు గురిచేశారు. అంతటితో ఆగకుండా దాని చర్మం చీల్చేసి ఏదో గొప్ప పని చేసినట్లుగా గంతులేసి పైశాచికంగా ప్రవర్తించారు. ఇలా కొద్దిసేపు కోతికి నరకం చూపించి, చివరికి ఆ నోరులేని మూగజీవాన్ని కిరాతకంగా చంపేశారు. దాన్ని తీసుకెళ్లి హాస్టల్ సమీపంలోని రోడ్డు పక్కన పూడ్చి పెట్టారు.
ఈ ఘటన నెటిజన్లను కలచివేసింది. ఆ నలుగురు విద్యార్థుల చర్యను తీవ్రంగా ఖండించారు. కఠిన శిక్ష పడేలా చూడాలని సూచించారు. చెన్నైకి చెందిన శ్రవణ్ క్రిష్ణన్ అనే జంతు ప్రేమికుడు ఈ విషయాన్ని తెలుసుకుని తీవ్రంగా బాధపడ్డాడు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి కోతిని ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకుని అక్కడ తవ్వారు. గొయ్యిలో కాళ్లు కట్టేసి ఉన్న ఆ మూగజీవాన్ని చూసి ఆ కాలేజీకి చెందిన విద్యార్థులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై క్రిష్ణన్ కాలేజీ ప్రిన్సిపల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఆ నలుగురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

https://www.youtube.com/watch?v=VPMBMeyjZfU&t=31s

 

NO COMMENTS

LEAVE A REPLY