మైథిలి కవిత …తొలి ప్రేమ చిగురించినవేళ

నా జన్మకు కారకుడు నాన్న !
ఆ పిలుపు ఒక వేదం !!
నా అణువణువునా జీవననాదం
తనవారి ఆకలి కోసం
తనరెక్కల కష్టంతో పాటుపడే చల్లని తండ్రీ……
నాబుడి బుడి నడకలకాధారం!
నాన్న చిటికెనవేలని తెలుసుకున్న
నా అక్షర తపస్సు లో అహర్నిశం శ్రమించి ,
నాభవితకై నిరంతరం
తపించే మహనీయుడు !
తన అనుభవాలను … జీవనసూక్తులుగా భోధించి…
జీవన పరమార్థం తెల్పిన విధాత!
ఆకలి వేళ అమ్మ గా , …
ఆడేవేళ బొమ్మ గా. …
నన్ను గెలిపించిన ప్రతీసారి ….
తను ఓడిపోతూ…నా గెలుపే …
తన గెలుపనుకునే మిత్రుడు !!
నాన్నంటే జీవితాంతం కొండంత… అండగా ,
నడతలో లోపాలు దిద్ది
నన్ను నలుగురిలో ఒకరిగా నిలిపి
తన కష్టాలు కన్నీళ్ళు దాచి….
సుఖాలతీరం చేర్చిన దైవం !
మానవత్వవిలువలు నేర్పిన… గురువు , స్ఫూర్తి ప్రదాత!
కాలచక్రంలో తను నలిగి పోతూ
నన్ను పూలతేరు పై నడిపిన …
జీవనసూక్తులుగా సారధి నాన్న !!
నా కలలకు సాకారమిచ్చేందుకు
జీవనసమరంలో అనునిత్యం
పోరాడే యోధుడు నాన్న !
బంధాలను , భాధ్యత లను
భుజాల పై వేసుకుని….
బరువెక్కిన గుండె తో….
శాశ్వత నిద్ర పోతున్నా…
నా యోగ క్షేమాన్నీ కలలో అడిగి
తెలుసుకునే నాన్న కు….
ఏమిచ్చినా రుణం తీరదు….
‘ నాన్న ‘ అనే తీయని స్మృతిని
కానుక గా ఇచ్చిన…మనసు న్న
మహారాజు….మా నాన్న కు …
కన్నీటి కైమోడ్పుతో…

ఈ కవితను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

NO COMMENTS

LEAVE A REPLY