అంతర్ఘర్షణ …జాని.తక్కెడశిల (బెంగుళూర్),బాలకార్మికులు… …కుంచె చింతాలక్ష్మీనారాయణ

సుఖాల లోగిలి
దరిచేరనేలేదు
ఓ అఖిలం..!!
కష్టాల కౌగిలితో
కన్నీరే కడలైనది..!!
ఉపిరే మోయలేకున్నది
అంతరెంద్రియ మందిరం..!!
ఎద తామసిలో
విలపించుతున్నది
నా తురంగం..!!
నయనాలు
అన్యాయాలు
చూడలేకున్నాయి..!!
కరములు
కయ్యములు
చేయలేకున్నాయి..!!
నరములలో
రుధిరము కుళ్లినది !!
భవబంధాలను
భరించలేకున్నది
ఈ దేహం..!!
దేహంలోని
జీవమును
చితి చేర్చుము
ఓ అఖిలం..!!

బాలకార్మికులు
————————

బడిలో…పలక,బలపం పట్టి
అ,ఆ లు దిద్దాల్సిన బాల్యం
ఆట పాటలతో…
విద్యాబుద్ధులు నేర్వాల్సిన బాల్యం

అమ్మలేకనో.. నాన్నలేకనో..
నడివీడిదికెక్కిన బాల్యం
కందినచేతులతో..
అలసిన, మాసిన దేహంతో…
చెమటోడ్చే బాల్యం
ఎండలో..బ్రతుకునీడ్చుతున్న బాల్యం
పుస్తకం, కలం సంధించాల్సిన బాల్యం
జానెడు పొట్టకోసంకూటికోసం కోటివిద్యలులా..
బాల్యం కార్మికదారిన పడితే ఎలా…?

నేటి బాలలే రేపటి పౌరులు ఎలా అవుతారు?
బాల్యం భుజం బస్తాకి బానిసయ్యి
వెన్ను విరిచేస్తోంటే?
పెత్తనం చేతిలో మగ్గుతన్న బాల్యం
ఆదిలోనే అంతమౌతోంటే…

బాలకార్మిక చట్టాలున్నా…
బాలల అనాధాశ్రమాలున్నా…
విద్యాబుద్ధులు నేర్పుతున్నా…
ఏం లాభం?
ఇంకా ఎంతోమంది
బాలకార్మికులవుతూ నే ఉన్నారు!!

                                                  …కుంచె చింతాలక్ష్మీనారాయణ

 

ఈ కవితలను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

NO COMMENTS

LEAVE A REPLY