మూడేళ్ళ వ్యవధిలో కేసు అనేక మలుపులు తిరిగింది. సుమన్ పై ప్రహారం జరిగినట్టుగా బ్లూఫిలింస్ కేసు సుమన్ పై బుక్ చేయబడలేదు….ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్

సెన్సేషనల్ స్టార్ సుమన్…

ఎన్నో విజయవంతమైన చిత్రాల హీరో, లక్షలాది అభిమానుల కథానాయకుడు.
ఒకానొక దురదృష్టకరమైన క్షణాన ఒక నిందను భరించాల్సి వచ్చింది.జైలుగోడల మధ్య ఒక నిర్దోషి గడపవలిసిన పరిస్థితి ఏర్పడింది.
నిశ్శబ్ధం ఒక్కోసారి చాలా భయంకరంగా ఉంటుంది.
ఆ నిశ్శబ్దాన్ని పరామర్శిస్తే….
ఎన్నో విషయాలు.
ఎన్నెన్నో విషయాలు, అతని మనసుకు తప్ప, మరో మనిషికి తెలియని విషయాలు….
ఆంధ్రభూమి పాఠకులకోసం, లక్షలాది తన అభిమానుల కోసం మనసు విప్పి చెప్పిన అనుభూతుల అక్షరాలు.
అది 1991…
నిశ్శబ్దంలో సుమన్ ని స్పృశిస్తే…
ఆ రోజు ఏప్రిల్ 15
సమయం పన్నెండు కావడానికి ఒక్క నిమిషం వ్యవధి వుంది.అదే సమయంలో రెడ్ కలర్ మారుతీకారు ఆంధ్రభూమి కార్యాలయంలోకి ప్రవేశించింది.
మామూలుగా వుండే రీడర్స్ గ్లామర్ కు, ఆ నిమిషం సినిమా గ్లామర్ తోడయింది.
అప్పటికే క్లాక్ టవర్ దగ్గర హడావుడి.
అదిగో మారుతీ సుమన్, ఎవరో అరిచారు.
అంతే,
ఆ కారును ఫాలో అయ్యారు అభిమానులు,
సెక్యూరిటీని దాటి లోపలికొచ్చింది మారుతీ.
అప్పటికే అభిమానులు ‘సుమన్…సుమన్’ అంటూ ఉత్సవాహంగా అరుస్తున్నారు.
ఆంధ్రభూమి ఆహ్వానాన్ని అందుకుని, చెప్పిన టైంకన్నా ఒక్క నిమిషం ముందే వచ్చిన సమం ని సాదరంగా ఆహ్వానించారు దక్కన్ క్రానికల్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ ఎంప్లాయిస్!
* * *
థర్డ్ ఫ్లోర్
ఆంధ్రభూమి వీక్లీ కార్యాలయం,
ఎడిటర్ క్యాబిన్.
ఆంధ్రభూమి వీక్లీ ఎడిటర్ సి.కనకాంబరరాజు సెన్సేషనల్ స్టార్ సుమన్ ను సాదరంగా ఆహ్వానించారు.
ఎడిటర్ గారి ఎ.సి ఛాంబర్ లో పలకరింపులు, కాఫీలు ….కూల్ డ్రింక్స్ అయ్యాయి.
దక్కన్ క్రానికల్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ కు సంబంధించిన డిపార్ట్ మెంట్ హెడ్స్ ఎడిటర్ ఛాంబర్ లో వున్నారు. అందరి పరిచయాలు అయ్యాయి.
ఎన్నో విషయాలు…..ఎన్నెబ్బో విషయాలు.
సినిమాలు గూర్చి,జీవితం గురించి, సుమన్ వివాహం గురించి ఎన్నో ముచ్చట్లు, క్షణాలు, నిమిషాలు, గంటలు చాలా ఈజీగా గడిచిపోతున్నాయి.
సుమన్ మొట్టమొదటిసారిగా మనసు విప్పి మాట్లాడుతున్న సమయం.
వాతావరణం చల్లగా వుంది. ఎయిర్ కండిషనర్ చప్పుడు తప్ప మరే శబ్దం రావడం లేదు.
తన కెరీర్ గూర్చి మాట్లాడుతూ, తన లైఫ్ లో జరిగిన విషాద సంఘటన గూర్చి డీప్ గా చర్చ…
సుమన్ ముఖంలో ఒక్క కిషణం విషాదం, జరగకూడనిది, జరగరానిది జరిగింది.
ఒక నింద అతని కెరీర్ ని కొంతకాలం అడ్డుకుంది. దోషి, నిర్దోషి మధ్య ఉన్న సన్నని సరిహద్దు రేఖ అతని గ్లామర్ ని అవతలివైపుకి కొద్దికాలం నెట్టివేసింది.
అప్పుడు జరిగిన సంఘటనను మనసు చెప్పారు. తన మనసుకు తప్ప, మరే మనిషికి తెలియని తన అంతరంగంలో ఆవేదన బయటకు వచ్చింది.
అప్పటి సంఘటనలు చెబుతుంటే కళ్ళముందు జరిగినట్టు, ఆ సంఘటనలను మనంకూడా అనుభవించిన ఫీలింగ్.
తననెలా అరెస్టు చేసింది ఆ తర్వాతేం జరిగింది, మద్రాస్ సెంట్రల్ జైలులో తనెలా గడిపింది, ప్రతి విషయాన్ని ఓ దృశ్యంలా ముందుంచాడు సుమన్.
నిజంగా ఇంతటి విషాదాన్ని, మరొకరైతే ఎలా తట్టుకునేవాళ్ళు?
ఇరుకు గదిలో నిందితులతో సహవాసం….
కింద నేలమీద నిద్ర…
టీకోసం, బీడీల మార్పు…
ఇవన్నీ త్తన అభిమానులకు తనెందుకు చెప్పకూడదు. తనం అభిమానించే వాళ్ళతో తన అనుభూతులను ఎందుకు పంచుకోకూడదు.
ఏడీటర్ గారి ఆలోచన అతన్ని ‘సరే’ అనిపించింది.
ఆ క్షణమే రాజుగారి ఆలోచనలు ఓ రూపుదిద్దుకున్నాయి. బాధ్యతను నాకప్పగించారు.
ప్రతిరోజూ షూటింగ్ గ్యాప్ లో తన ఫీలింగ్స్ ను, జరిగిన విషయాలను చెబుతుండేవారు.
ఒక్కోసారి తీరిగ్గా వుంటే ఫోన్ చేసి ఇంటికి పిలిపించి మాట్లాడేవారు.
సుమన్ చెప్పే ప్రతి అక్షరం, ప్రతి విషయం జాగ్రత్తగా నోట్ చేయడం జరిగింది.

ప్రారంభానికి ముందు
సుమన్ బ్లూఫిలిం కేసులో ఇరుక్కున్నాడు. బ్లూఫిలింస్ లో నటించాడు.
సుమన్ పై దృష్ప్రచారం…
ఒక విధంగా ఇది సెంటిమెంట్ పై కొట్టే దెబ్బ. ఒక హత్య చేసినా అసహ్యం కలగదు. కానీ ఓ అమ్మాయిపై అత్యాచారం జరిపినా, ప్రయత్నం చేసినా అసహ్యం వేస్తుంది. అందుకేనేమో!
సుమన్ పై ఈ విధమైన ప్రచారం జరిగిందొకటి.
అసలు వాస్తవం ఇంకొకటి….
అదే జడ్జిమెంట్!
మూడేళ్ళ వ్యవధిలో కేసు అనేక మలుపులు తిరిగింది.
సుమన్ పై ప్రహారం జరిగినట్టుగా బ్లూఫిలింస్ కేసు సుమన్ పై బుక్ చేయబడలేదు.
అసలు జరిగిందేమిటో తెలుసుకోవాలంటే…

మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ
జైలు గోడల మధ్య హీరో సుమన్…ఫ్లాష్ బాక్ 1991
వచ్చేవారమే ప్రారంభం
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 )ప్రాంతంలో ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.
ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి

http://preview.kinige.com/previews/7800/PreviewJailuGodalaMadhyaHeroSuman36533.pdf

NO COMMENTS

LEAVE A REPLY