అర్థగంట తరువాత శక్తి పూర్తిగా నశించిపోయింది. చెయ్యి నొప్పి పెట్టడం స్టార్ట్ అయ్యింది….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (21-05-2017)

(గత సంచిక తరువాయి)
గాజులమండ్యo షుగర్ ఫ్యాక్టరీ…
చుట్టుప్రక్కల ఏ చెట్టుచేమ లేకుండా ఒంటరిగా, గంభీరంగా, చాలా పెద్దగా ఉంది.
ఫ్యాక్టరీకి దూరంగా విసిరేసినట్టు కాలనీ. పది పదిహేను ఇళ్ళు ఉన్నాయి. వ్యాన్ ఫ్యాక్టరీ దగ్గరలోని సెక్యూరిటీ వద్ద ఆగింది. చక్రపాణి నా గురించి చెప్పగానే లోనికి వదిలారు. నా బ్యాగ్ తీసుకుని అతని వెంట నడిచాను.
సాయంత్రం ఐదు గంటల సమయం. సమ్మర్ కావడంతో సూర్యుడు ప్రచండంగా ఉన్నాడు. చక్రపాణి వాళ్ళ మదర్ ఈవెనింగ్ స్నాక్స్ రెడీ చేయడంతో వాటిని ఒక పట్టుపట్టాం…
“టెన్నిస్ ఆడతావా?” స్నాక్స్ తిని రిలాక్స్ గా ఇంటి బయట కూర్చుని ఉండగా అడిగాడు.
టెన్నిస్.. టీవీలో చూడడం తప్ప టెన్నిస్ రాకెట్ తాకి కూడా ఎరుగను.
స్కూల్ డేస్ లో క్రికెట్ తప్ప మరో ఆట తెలియని నాకు టెన్నిస్ అనగానే ఒక రకమైన ఇంట్రెస్ట్ కలిగింది.
సరే అని బయలుదేరాం. ఫ్యాక్టరీ స్పోర్ట్స్ క్లబ్ లో బాట్స్ బాల్స్ తీసుకుని టెన్నిస్ కోర్ట్ లోకి వచ్చాం. అక్కడ మేము తప్ప ఎవరు లేరు.
టీవీలో వింబుల్డన్ టెన్నిస్ చూడడంతో ఆట రూల్స్ అండ్ రెగులేషన్స్ బాగా తెలుసు.
ఆట ఆడడం స్టార్ట్ చేశాం. చక్రపాణికి ఆటపై పట్టు బాగా ఉన్నట్టు ఉంది. చక్కగా ఆడుతున్నాడు.
నేను ఇష్టం వచ్చినట్టు బాల్ ను బాదేస్తున్నాను. నేను షాట్స్ కొడుతుంటే కోర్ట్ లో తప్ప అన్ని చోట్ల పడుతోంది. కోర్ట్ చుట్టూ రేకులతో కవర్ చేయడం వల్ల మేము కొట్టిన బాల్ కోర్ట్ దాటి బయటపడడం లేదు.
టెన్నిస్ ఆడడం ఎంత కష్టమో ఆడుతుంటే తెలిసింది. కోర్ట్ మొత్తం పరిగెడుతూ ఆ ఏజ్ కి చాలా బరువు అనిపిస్తున్న బ్యాట్ ను సింగల్ చేత్తో పట్టుకుని బాల్ ని కొట్టడం అంటే చాలా కష్టం.
టీవీలో చూస్తున్నంతసేపూ టెన్నిస్ అంటే ఇంత ఈజీనా అన్నంతగా ఆడేవారు. చూసే మాకు కష్టం అనిపించేది కాదు.
అర్థగంట తరువాత శక్తి పూర్తిగా నశించిపోయింది. చెయ్యి నొప్పి పెట్టడం స్టార్ట్ అయ్యింది.
అటూ ఇటూ కొడుతున్న చక్రపాణిని చూసి నేను కూడా రెచ్చిపోయి వచ్చిన బాల్స్ ను బలంగా బాదేశాను.
రెండు టెన్నిస్ బాల్స్ రేకుల కవర్ ను దాటి బయట ఓపెన్ ఫీల్డ్ లో పడ్డాయి. టెన్నిస్ రాకెట్స్ , టెన్నిస్ బాల్స్ స్పోర్ట్స్ క్లబ్ లో రిటర్న్ చేయవలసి ఉండడంతో ఇక బాల్స్ కోసం వెదకడం స్టార్ట్ చెశాం.
సాయంత్రం కావడంతో ఫ్యాక్టరీలో వర్క్ జరగడంలేదు. చుట్టుప్రక్కల ఎవరూ లేరు.
సూర్యుడు పశ్చిమాన కుంగడానికి పరిగెడుతున్నాడు.
టెన్నిస్ కోర్ట్ బయట ఎండిన పొలాలతో వందలకొద్దీ ఎకరాలు. ఓపెన్ ప్లేస్.
ఎండుగడ్డితో ఎల్లో కలర్ మొత్తం కవర్ చేయడంతో అదే కలర్ లో ఉన్న టెన్నిస్ బాల్స్ ఎక్కడ పడ్డాయో అర్థం కాలేదు.
టెన్నిస్ బాల్స్ కోసం వెదకడం స్టార్ట్ చేశాం. చుట్టూ ముళ్ళకంపలతో వెదకడానికి చాలా కష్టం అనిపించింది.
వెదకగా మొత్తానికి ఒక బాల్ దొరికింది. మరో బాల్ కోసం తీవ్రంగా వెదకడం స్టార్ట్ చేశాం. ఇంతలో చీకటి పడింది.
ఇక రెండో బాల్ పై ఆశను వదిలేసుకుని టెన్నిస్ బ్యాట్స్, బాల్ ను స్పోర్ట్స్ క్లబ్ లో ఇచ్చేసి చక్రపాణి ఇంటికి వెళ్లాం
***
(వచ్చే వారం మరో జ్ఞాపకం)

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY