మా సెల్ దగ్గరగా కాళీ అనే గూండా ఉండేవాడు….అతను రెచ్చిపోయాడు. నాలో సహనం నశించింది…. విజయార్కె సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్21-05-2017 )

9

”అమెరికా అల్లుడు’ రిలీజ్ అయింది.
ఆ చిత్రం రిలీజవుతుందంటే ఆత్రుతే- ఆదుర్దా! ఒక అనీజీ ఫీలింగ్.
ఆ చిత్రం రిలీజ్ రోజున థియేటర్ లో అభిమాన ప్రేక్షకుల మధ్య కూర్చోవాలనుకున్నాడు. ఆడియన్స్ చప్పట్లతో, అభిమానుల అల్లర్ల మధ్య ఆనందాన్ని, అనుభూతిని పంచుకోవాలనుకున్నాడు.
మామూలుగా అయితే రిలీజ్ అయిన సెంటర్లనుండి వచ్చే ప్రోగ్రెస్ ను వింటూ కూర్చునేవాడు.
ఇప్పుడా…అవకాశం లేదు!
జైలు గది గోడల మధ్య వున్నప్పుడు రిలీజైన మొదటి పిక్చర్ అది!
ఓ ప్రక్క ఆందోళన. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో? తను జైలుకు రావడం, తన మీద పత్రికల్లో వార్తలు రావడం, దీని ప్రభావం సినిమా మీద ఎంతవరకు పడుతుందో?
ఆరోజు ప్రతీ క్షణాన్ని లెక్కిస్తూ గడిపాడు. ‘అమెరికా అల్లుడు’ బాగానే పోతుందని తెలిసింది.
”చాలు….ఆ మాత్రం చాలు… ఒక నటుడికి తను నటించిన చిత్రం బాగాపోవడం నిర్మాత ‘సేఫ్’ అవ్వడం కన్నా కావలసిందేముంటుంది- తృప్తిపడ్డాడు.
* * *
సుమన్ తల్లి కొడుక్కి బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. తమిళనాడులో ప్రముఖ లాయర్ జి.ఆర్ కేసు టేకప్ చేయడానికి అంగీకరించారు.
జి.ఆర్ (జి.రామస్వామి) గారు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జైలులో వారానికో సినిమా వేస్తారు(మధ్యలో సుమన్ సినిమా ఉన్నప్పటికీనీ వేయలేదని తెలిసింది(?)
* * *
సుమన్ ను ఇంటర్వ్యూలో సినిమా ట్రిక్ లా జరిగిన ఓ సంఘటన చెప్పారు.
”మా సెల్ దగ్గరగా కాళీ అనే గూండా ఉండేవాడు. అతను అప్పుడప్పుడు ఫుడ్ గూర్చి గొడవ చేసేవాడు. అతనికి పెట్టిన కోటా సరిపోయి కాదు. అందరి దగ్గరా అడ్డుక్కునేవాడు. బెదిరింపుతో, దౌర్జన్యంతో ఓసారి నన్ను అడిగాడు. అతను అడిగిన పద్ధతి నచ్చలేదు.
అతను రెచ్చిపోయాడు. నాలో సహనం నశించింది.

(మిగితా వచ్చేవారం)
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.మేన్ రోబో లో ప్రచురణ నిమిత్తం పంపించవచ్చు.

manrobocreations@gmail.com
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ

ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
http://kinige.com/book/Jailu+Godala+Madhya+Hero+Suman

NO COMMENTS

LEAVE A REPLY