నాకు ఊహ వచ్చేసరికి అమ్మ చనిపోయింది.అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో సుగాత్రి పాత్ర ద్వారా చూపించిన …ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (02 -07 -2017 )

ఫీడ్ బ్యాక్

గుప్పెడంత ఆకాశం మొదటివారమే మా గుప్పెడంత మనసును ఆకట్టుకుంది.ఈరోజుల్లో కూడా తెలుగును ఇంత అద్భుతంగా రాయగలరా అనిపిస్తుంది.రచయిత్రి శ్రీసుధామయికి,ప్రచురిస్తోన్న మేన్ రోబో కు ధన్యవాదాలు….శ్రీనివాసరాజు (చెన్నై)
తెలుగు పత్రికలు దొరకడం కష్టమైనా మాకు మనసును కుదిపేసే ధారావాహిక శ్రీసుధమయి గారి గుప్పెడంత ఆకాశం…థాంక్యూ మేన్ రోబో….కెయస్ మూర్తి (అబుదాబి)
తల్లీకూతుళ్ల అన్యోన్యత ఇంత మధురంగా ఉంటుందా…నాకు ఊహ వచ్చేసరికి అమ్మ చనిపోయింది.అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో సుగాత్రి పాత్ర ద్వారా చూపించిన శ్రీసుధామయి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను..కృష్ణకుమారి(ముంబై)

3

ఇందాక సుగాత్రిని కామెంట్ చేసిన కుర్రాళ్ళు మరెవరినో కామెంట్ చేస్తున్నారు.సడెన్ గా తమ ఎదురుగా కనిపించిన ఆమెను చూసి వారిలో ఒకడు భయపడ్డాడు.మరొకడు కాస్త రెక్ లెస్ గా వున్నాడు.
“ఏంటి?వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా?అడిగాడు
సుగాత్రి నవ్వింది.ఆ నవ్వులో మీనింగ్ వాళ్లకు అర్ధమయ్యేసరికి ఒక్కడి ముక్కులో నుంచి మరొకడి నోరులో నుంచి బ్లడ్ బయటకు వచ్చింది
“కామెంట్ చేస్తే కాంప్లిమెంట్ లా ఉండాలి…బర్నింగ్ లా ఉండకూడదు…ఇంకోసారి ఇలాంటి కామెంట్ చేసే ముందు నీ బ్లడ్ గ్రూప్ ఏమిటో కనుక్కో ” అంటూ తాపీగా వెనక్కి తిరిగింది

***
“ఇదమ్మా జరిగింది..యామై కరెక్ట్ “అంది తల్లి భుజాల చుట్టూ చేతులు వేస్తూ
“ఇంత కరెక్ట్ గా ఎలా చెబుతున్నావు తల్లీ…?కూతురి బుగ్గలు పట్టుకుని అడిగింది
“చిన్నప్పుడు డాక్టర్ నాకు సూది చేస్తే నేను ఏడ్చానని,నన్ను డాక్టర్ ఏడిపించాడని, డాక్టర్ స్టెతస్కోప్ ఇంటికి తీసుకువచ్చి ఏడిపించావు..అలాంటిది ఇపుడు నన్ను కామెంట్ చేస్తే వూర్కుంటావా రౌడీ మమ్మీ “ముద్దుగా అంది ప్రతిమ
కూతురి వంక అలానే చూస్తూ ఉండిపోయింది.
ఇంకా తన పొత్తిళ్ళలో పడుకున్న పాపాయిలానే వుంది.తన గుండెల్లో తలపెట్టి నిద్రపోతున్న చిట్టితల్లిలానే వుంది.
“మమ్మీ నువ్వు నా పక్కనుంటే ఆకాశం నా పక్కన వున్నట్టే ఉంటుంది “చెమ్మగిల్లిన కళ్ళు ఆమె ముందు మోకరిల్లాయి.

***

“మమ్మీ నేను రెడీ…అమ్మా నేను రెడీ..మా …జీ నేను రెడీ..”డైనింగ్ టేబుల్ దగ్గర కూచోని బెడ్ రూమ్ లో తయారవుతోన్న తల్లినికేకేస్తుంది ప్రతిమ.
ఆ మాటలకు అక్కడికి వచ్చింది అమ్మమ్మ “నీకు అల్లరెక్కువ అవుతుంది.అమ్మతో పరిహాసాలేమిటి?గారాబం ఎక్కువండి”అమ్మమ్మ చిన్నగా మందలించింది.
“హలో సుగాత్రి మేడం…ఇక్కడ మీ అమ్మ నన్ను తిడుతోంది…బెదిరిస్తోంది…”అమ్మమ్మ వంక చూసి అవ్వుతూ అంది తల్లికి వినిపించేలా
తన గదిలో నుంచి బయటకు వచ్చింది సుగాత్రి తల్లి వంక చూసి తర్వాత కూతురి వైపు తిరిగి”ఏంటీ మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తున్నావు?నవ్వుతూ అంది.
“మా అమ్మతో మాట్లాడుతుంటే,మీ అమ్మ మందలిస్తుంది” తల్లి వెనగ్గా చేరి అంది.
“అల్లరి తర్వాత..ముందు ఇడ్లీ తిను” ఇడ్లీ ప్లేట్ చేతిలోకి తీసుకుని అంది
“అబ్బా రోజూ ఇడ్లీనేనా?డెడ్లీగా ?
“బుద్ధిగా తిను..లేదంటే రేపటి నుంచి నేనే మీ కాలేజ్ కి వచ్చి తినిపిస్తాను “కూతురిని ముద్దుగా హెచ్చరించింది.
సీన్ అర్థమై బుద్ధిగా ఇడ్లీ తింది ప్రతిమ….
ఒక్కక్షణం ప్రతిమ తల్లివైపు చూసింది.చీరలో తల్లి చాలా అందంగా వుంది.నిండుగా వుంది.”ఏంటే నా కూతురిని తినేసేలా చూస్తున్నావు?దిష్టి తగులుతుంది”అమ్మ అంది
“ఓల్డ్ అమ్మమ్మా …ఇది మా తల్లీకూతుళ్ల మేటర్..ఇంటర్ ఫియర్ అయితే నేనూరుకోను ..అంటూ తల్లిదగ్గరికి వచ్చి…ఇందాక గ్రౌండ్స్ లో రఫ్ఫాడించిన మమ్మీ ఈ మమ్మీ ఒక్కరేనా? సీత ఔర్ గీత లా వున్నావు..లుకింగ్ ప్రీతీ మమ్మీ…అంది తలి ను ముద్దు పెట్టుకుంటూ
“ఐస్ క్రీం వద్దు..నువ్వు కాలేజీ కి నడిస్తే ముద్దు “అంది.
ఇద్దరూ బయటకు వచ్చారు.
హొండా యాక్టీవా ముందుకు కదిలింది.
తల్లి వెనుక బుద్ధిగా కూచుంది.ఇద్దరూ అలా వెళ్తుంటే ఫ్రెండ్..సిస్టర్స్ కాలేజీకి వెళ్తున్నట్టుంది.

***
కాలేజీ ముందు యాక్టీవా ఆపింది
“మమ్మీ ఇక నువ్వెళ్లు లేదంటే నిన్ను కూడా స్టూడెంట్ అనుకుంటారు లేదా నాకు సిస్టర్ వి అనుకుంటారు..నా గ్లామర్ దెబ్బ తింటుంది”అంది ప్రతిమ..,
యాక్టీవా దిగి కూతురి వైపు చూసింది.
ఒక్కక్షణం ప్రతిమకు కురుక్షేత్రం సీన్ కనిపించింది.కృష్ణుడి గీతోపదేశం వినిపించింది.తల్లి ఆకాశం వైపు పెరిగిపోతున్నట్టు .అనిపించింది.
“బుద్దిగా తల దించుకుని వేళ్ళు…నేనంటూ వెళ్ళగానే గెంతులేయాకు..కాంటీన్ల వెంబడి తిరుక్కు…అబ్బాయిలతో ఎక్కువ ఇంటిమసీ వద్దు..నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు “అనే విషయం గుర్తుంచుకో
నాన్ స్టాప్ గా తలను ఊపుతూనే వుంది కీ ఇచ్చినట్టు
“ఏంటీ తింగరిగా ఆ తలూపడం..మమ్మీ డమ్మీలా అలానే చెబుతుందనా?కోపం నటిస్తూ అంది సుగాత్రి
“చచ ఛీఛీ చూచే కాదు మమ్మీ ..అని తల్లి వైపు అమాయకంగా చూసి”చూసినట్టు నటించి”మమ్మీ ఇక్కడ బోధివృక్షం ఏమైనా ఉందా?అని అడిగింది
వెంటనే అర్థం కాలేదు..అర్థమయ్యాక నవ్వూ కోపమూ రెండూ వచ్చాయి.
“అట్టా చూడకు మమ్మీ ..అసలే నీ కళ్ళు ఆల్చిప్పల్లా ఉంటాయి…మా ప్రొఫెసర్స్ చుస్తే ఎవరీ అమ్మాయి అని ఫ్లాటైపోతారు “తల్లి కోపాన్ని డైవర్ట్ చేస్తూ అంది.
నవ్వుకుంటూ వెనుతిరిగింది సుగాత్రి
ఇది రోజూ జరిగే డైలీ సీరియల్ ఎపిసోడే…
తల్లిగా సుగాత్రి భయం..కూతురిగా ప్రతిమ అల్లరి

గుప్పెడంత ఆకాశంలో చిరువిరామం
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY