సరదాగా నవ్వుకుంటూనే ఆలోచిస్తున్నాం.గిల్లికజ్జాలు శృతి మించితే ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది.వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (02 -07 -2017)

ఫీడ్ బ్యాక్
శ్రీ&శ్రీమతి చదువుకుంటూ సరదాగా నవ్వుకుంటూనే ఆలోచిస్తున్నాం.గిల్లికజ్జాలు శృతి మించితే ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది.థాంక్యూ తేజారాణి తిరునగరి గారూ…వసంత కుమార(బెంగుళూర్)
*మీ డెత్ సెంటెన్స్ ,శ్రీ&శ్రీమతి రెండూ డిఫెరెంట్ గా వున్నాయి.ఈసారి థ్రిల్లర్ నవల అందిస్తారని ఆశిస్తున్నాం…రాజ్ కుమార్(హైద్రాబాద్ )
తికేశ్వర్రావు కు గడ్డం అప్పుకన్నా వడ్డీ ముద్దన్నట్టు పెరిగింది.కనపడిన ప్రతీవారిని అడుగుతున్నాడు.ఈ శాల్తీ ఎక్కడైనా కనిపించిందా?అని…
అంతా అతడిని వింతగా చూస్తున్నారు.సరిగా అప్పుడే ఓ కుర్రాడు బుద్ధిగా పుస్తకం చదువుకుంటున్నాడు.
“బాబూ ఈ శాల్తీని నువ్వు చూసావా?అడిగాడు ముందు ఆ కుర్రాడిని గుర్తు పట్టక
ఆ కుర్రాడు ఆ ఫోటోని చూసి శ్రీ లక్ష్మి అక్కయ్యా?అన్నాడు
తిక్కేశ్వర్రావు ఆ కుర్రాడి వంక చూసి..”నువ్వా.నువ్వు మా ఆవిడ్ని లేపుకుపోలేదా?అడిగాడు పిచ్చిగా.
అంతే అతడి చెంప చెల్లుమనిపించి”పిచ్చెక్కిందా?అక్కయ్యతో అక్రమ సంబంధం ఏమిట్రా అంట్లవెధవ…అయినా భార్యను అనుమానించే బుద్దేమిట్రా అక్కుపక్షి ..”తన నవలలు చదివిన భాషా పరిజ్ఞానంతో తిట్టేస్తున్నాడు.
తిక్కేశ్వర్రావు కు బుర్ర తిరిగిపోయింది.ఒక్కోసారి మెదడు పనిచేయదు..చేసినా వక్రంగా ఆలోచిస్తుంది..అని ఓ సారి చిన్నప్పుడు తాగిన మత్తులో తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగెత్తాడు.మంచం మీద బోర్లా పడుకుని ఏడవడం మొదలెట్టాడు.
“అబ్బా ఆ పని భార్యలు చేస్తే బావుంటుంది..మీరు చేస్తే అసయ్యంగా కామెడీ సినిమాలో సీన్ లా ఉంటుంది”అన్న మాటలు వినిపించి గబుక్కున లేచాడు.
ఎదురుగా శ్రీ మహాలక్ష్మిలా తన శ్రీ లక్ష్మి…
గట్టిగా పట్టేసుకుని ఆ తర్వాత కాళ్ళ దగ్గర సెటిలై సారీ చెప్పుకున్నాడు.
మనసులో ఐడియా చెప్పిన లాయర్ పారంకుశానికి,సహకరించిన కుర్రాడికి థాంక్స్ చెప్పుకుంది శ్రీ లక్ష్మి
***
చందనకు చిక్కగా వుంది.కోపంగా వుంది.ఇరిటేషన్ గా వుంది.చరణ్ ప్రవర్తన దీనికంతటికీ కారణం అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ లో వుంది.
కోపం మనిషిని ఆలోచించే సమయాన్ని ఇవ్వదు.
ఆవేశం అర్థం చేసుకునే అవకాశం ఇవ్వదు.
అందుకే చరణ్ ను అర్థం చేసుకోవద్దని బదులు అపార్థం చేసుకుంటుంది.
ఒక్కసారిగా ఈ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది?అన్న ఆలోచన వచ్చింది.అదెంత పూలిష్ గా గా ఉంటుందో అర్థం కాక
ఇదిలా ఉంటే అక్కడ చరణ్ పరిస్థితి మరోలా ఉంది.రోజురోజుకు పెద్ద సమస్యగా మారుతున్నకంపెనీ నష్టాలను ఎలా పూడ్చుకోవాలో అర్థం కాలేదు.
..
మనసులో ఐడియా చెప్పిన లాయర్ పారంకుశానికి,సహకరించిన కుర్రాడికి థాంక్స్ చెప్పుకుంది శ్రీ లక్ష్మి
***
చందనకు చిక్కగా వుంది.కోపంగా వుంది.ఇరిటేషన్ గా వుంది.చరణ్ ప్రవర్తన దీనికంతటికీ కారణం అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ లో వుంది.
కోపం మనిషిని ఆలోచించే సమయాన్ని ఇవ్వదు.
ఆవేశం అర్థం చేసుకునే అవకాశం ఇవ్వదు.
అందుకే చరణ్ ను అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటుంది.
ఒక్కసారిగా ఈ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది?అన్న ఆలోచన వచ్చింది.అదెంత పూలిష్ గా గా ఉంటుందో అర్థం కాక
ఇదిలా ఉంటే అక్కడ చరణ్ పరిస్థితి మరోలా ఉంది.రోజురోజుకు పెద్ద సమస్యగా మారుతున్నకంపెనీ నష్టాలను ఎలా పూడ్చుకోవాలో అర్థం కాలేదు.

మిగితా వచ్చేవారం  

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

.

NO COMMENTS

LEAVE A REPLY