భార్యాభర్తల దాంపత్య జీవితానికి అర్థాన్ని,పరమార్థాన్ని చెప్పనట్టు వుంది.థాంక్యూ …వండర్ ఫుల్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (30 -07-2017)

ఫీడ్ బ్యాక్
భార్యాభర్తల దాంపత్య జీవితానికి అర్థాన్ని,పరమార్థాన్ని చెప్పనట్టు వుంది.థాంక్యూ తేజారాణి తిరునగరి గారూ..మీ సీరియల్ చదువుతుంటే మనసుకు కంటికి ఆహ్లాదంగా వుంది..రాజారామ్ (విజయవాడ)

(గత సంచిక తరువాయి)

పాత ఏజెంట్లను, డీలర్లను తొలిగించాడు. దానికి సంభందించిన అన్ని పేపర్లను కార్తిక్ కు ఇచ్చాడు నటేశన్. నిరుద్యగులైన విద్యాధికులను ఇంటర్వ్యూకు పిలిచాడు.
”మీకు జీతమే కాకుండా లాభాలలో బోనస్ రూపంలో వస్తుంది. మీరు చేయాల్సింది ఈ సంస్థ అభివృద్ధి మాత్రమే.
ఈ కంపెనీ మీదే అనుకోవాలి…నిరుదోగ్యంతో మీరు కృంగిపోకూడదనుకుంటే ఇదో మంచి మార్గం. కంపెనీ పెరిగేకొద్దీ మీలాంటి నిరుద్యోగులు ఉద్యోగస్థులవుతారు” అంటూ ఎంకరేజ్ చేశాడు.
తనూ రాత్రీ పగలూ తేడా లేకుండా కంపెనీ కోసం కష్టపడుతూనే వున్నాడు.
* * *
చందనకు పని ఒత్తిడి ఎక్కువయింది. దానికి తోడు ఆర్ధిక సమస్యలు. చరణ్ డబ్బు ఇచ్చినా తీసుకోలేదు. మెడికల్ చెకప్ కు, వాటికి డబ్బు ఖర్చవుతుంది.
రాత్రిళ్లు ఓ.టి. చేసినా ఫలితం ఉండడంలేదు. ఆ చికాకు ఇంట్లో చూపిస్తుంది. ఏమాత్రం ఇంట్లో చిన్న తప్పు జరిగినా అందరి మీదా కస్సుమంటుంది.
మళ్లీ వెంటనే తేరుకుని తన సమస్యలను అర్ధం చేసుకుంటుంది.
చరణ్ దగ్గర వున్నప్పుడు. ఈ సమస్య కనిపించలేదు. పెద్ద గీత చిన్నగీతగా కనిపించాలంటే ఆ పెద్దగీతముందు ఇంకాస్త పెద్దగీత గీయాలి. ఇక్కడ చందన సమస్య అలాగే వుంది.
ఒకప్పుడు చరణ్ జాగింగ్ కు రావడంలేదని అన్న హారిక జాగింగ్ మానేసింది. ఏ రాత్రికో ఆఫీసు పనిచేసి ఇంటికి రావడం వల్ల అలసటతో నిద్ర ముంచుకు వస్తుంది.
ఇంట్లో వాళ్ళని పలకరించకుండానే నిద్రలోకి జారుకుంటుంది. తెల్లవారకుండానే మళ్లీ ఆఫీసు పనులు.
కాలం ఎవరికోసమో ఆగిపోదు. ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. . ప్రసాద్ ట్రైనింగ్ పూర్తయింది.
చరణ్ చందన విడిగా వుండడం చూసి చాలా బాధపడ్డారా దంపతులు.
ఈ ఆరు నెలల్లో నటేశన్ ఆర్ధికంగా కోలుకున్నాడు. కార్తీకి వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. సేల్స్ విపరీతంగా అవుతున్నాయి. లాభాల దిశలో పయనిస్తోంది తళ తళ డిటర్జెంట్ కంపెనీ.
చందనను రోజు కలుస్తూనే వున్నాడు. ఆ కుటుంబానికి పరోక్షంగా హెల్ప్ చేస్తూనే వున్నాడు చరణ్ . ‘యశోద’ తో వివరంగా మాట్లాడాడు. ఇంట్లోకి అయ్యే ఖర్చులు కొంత తానూ భరిస్తానని చెప్పాడు.
ఈ విషయం భార్యకు తెలియకూడదని కూడా చెప్పాడు. యశోద అంగీకరించింది.
* * *
ఆరోజు ఆదివారం. అయినా ఆఫీసుపనివుంది. పైగా ఏడోనెల దాటింది. నీరసంగావుంది.
ఉదయమే వచ్చాడు లాయర్ అంకుల్.
ఈవినింగ్ లోగా ఫైల్స్ అన్ని పూర్తిచేయాలి. అందుకే సండే రోజుకూడా ఇంట్లోనే కూచుంది.
”అంకుల్..మీరేమి అనుకోవద్దు. ఈ ఫైల్స్ పూర్తి…” ఆ తర్వాత మాట పూర్తిచేయలేకపోయింది.
”అవునులే మీ నాన్న పోయాక మా మీద అభిమానం కూడా తగ్గింది” అన్నాడు హారికవైపు చూస్తూ.
”ఛ…ఛ…అవేం మాటలు అంకుల్…మీరుకూడా నన్ను అపార్ధం చేసుకుంటే ఎలా? మీరు దగ్గరివారని చెప్పాను ఆఫీసులో పని ఒత్తిడిగా వుంది. మనసంతా చికాగ్గా వుంది. ఈ ఫైల్స్ అన్ని అర్జంట్ గా పూర్తిచేయాలి. అందుకు…” నొచ్చుకుంటూ అంది.

మిగితా వచ్చేవారం  

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY