ఆంటీ నన్ను తెగ మెచ్చుకుంటారు అనుకున్న నాకు ఒక రకంగా డిజప్పాయింట్ లా అయ్యింది. ..స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (22-10-2017)

(గత సంచిక తరువాయి)
ప్రదీపన్న వంక కాస్త టెన్షన్ గా చూశాను. వస్తూనే నన్ను ఎత్తి గిరగిరా తిప్పి కిందకు దించాడు.
ఒక్కసారిగా ఆ రియాక్షన్ చూసి నాకు మతిపోయింది…
ఇంతకూ మన పెర్ఫార్మన్స్ నచ్చందా లేదా అన్న డౌట్. డౌట్ గానే ఉండిపోయింది.
కాసేపటి తరువాత ఆంటీ కూడా లోనికి వచ్చారు. నా స్టేజ్ షో పై ఆంటీ రియాక్షన్ ఎలా ఉందో అన్న ఫీలింగ్ నన్ను టెన్షన్ కి గురి చేసింది.
“మొత్తానికి బాగానే చేశావు. ఇంకా కొన్ని చేంజెస్ చెయ్యాలి. కొన్ని ఏరియాస్ లో ఇంప్రూమెంట్ రావాలి” అంటూ సలహాలు ఇచ్చి వెళ్ళిపోయారు.
ఆంటీ నన్ను తెగ మెచ్చుకుంటారు అనుకున్న నాకు ఒక రకంగా డిజప్పాయింట్ లా అయ్యింది.
నా ఫీలింగ్ చూసి ప్రదీపన్నకు బాధ కలిగినట్టుంది. వెంటనే ఆంటీ వెనుకనే కిచన్
వైపు వెళ్ళాడు
కాసేపటి తరువాత హాల్ లో ఉన్న వాళ్ళు వెళుతున్నట్టు చప్పుడు వినిపించింది. మా జూనియర్ బ్యాచ్ కూడా బాల వికాస్ జరిగే ముందు రూమ్ లోకి వెళ్ళిపోయారు.
నేను రూమ్ నుండి బయటకు రాగానే కిచన్ లో ప్రదీపన్న మాటలు వినపడుతున్నాయి.
“మా… సురేంద్రను ఎందుకు డిజపాయింట్ చేశావు. చాలా చక్కగా చేశాడు. నువ్వు ఎంకరేజ్ చేస్తావని చాలా ఆశగా ఎదురుచూశాడు” అంటూ అడిగాడు
“ప్రదీపా… వాడి టాలెంట్ గురించి నాకు డౌట్ లేదు. లేకపోతే అంత కష్టమైన మోనో యాక్షన్ వాడికి ఎందుకు ఇస్తాను.” అని ఆంటీ సమాధానం చెప్పింది
“మరైతే నువ్వు అతనితో అలా ఎందుకు అన్నావు?” అనుమానం తీరక అడిగాడు ప్రదీపన్న
“పొగడ్త.. ఎదుగుదలకు ప్రధాన శత్రువు. నేను ఇప్పుడే అతణ్ణి పొగిడితే అతని ప్రయత్నం ఇంతటితో ఆగిపోతుంది. ఇంకా బాగా చెయ్యాలన్న కోరిక నశించిపోతుంది. చూస్తూ ఉండు… అతని పెర్ఫార్మన్స్ స్టేజ్ పైన ఎలా ఉండబోతుందో…” అంటూ ముగించారు.
ఆ మాటలతో నాలో ఉన్న అనుమానం పటాపంచలైపోయింది.
ఇక మన యాక్షన్ లో మరింత రాటుదేలితే మంచిది అనుకుంటూ నేను కూడా బాల వికాస్ జరిగే రూమ్ లోనికి వెళ్లాను
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY