ప్రాణాన్ని కాపాడే అత్యాధునిక స్కానింగ్ పరీక్షలు తమ ప్రాణాలు కబళించే మారణాయుధాలు …అమ్మా…నన్ను చంపొద్దు..శ్రీసుధామయి…అక్షరాలతో నేను(15-10-2017)

2
ఆపరేషన్ థియేటర్ లో స్ట్రెచర్ మీద పడుకున్న ఆ తల్లికి అర్థమవుతోంది..తన కడుపులో ఊపిరిపోసుకున్న మాంసపుముద్ద..అప్పుడప్పుడే ఓ ప్రాణిగా చిన్నిచేతులు,బోసినవ్వుతో తనను అమ్మా అని పిలవాలని తన ద్వారా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తోన్న,ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని పసికూన…అత్తామామల దాష్టీకానికి,మొగుడి శాడిజానికి భయపడి తను తనబిడ్డను చంపుకోవాలా?కనుకొలకుల చివర్ల నుంచి రాలిపడే ఆ కన్నీటిచుక్కలు ప్రతీ ఒక్కరినీ ప్రశ్నిస్తున్నాయి.భ్రూణహత్యలను నిరసిస్తున్నాయి…
అనుబంధం అనే బంధం గాలిలో దీపమే అయ్యింది.. అమ్మతనపు ఔన్నత్యం భ్రూణహత్యల రూపంలో మసకబారింది…
తాను మోస్తున్నది ఆడపిల్ల అని తెలియగానే మనసు లేని మానవత్వం మరణించింది..? నిర్దాక్షిణ్యంగా ఆత్మీయ ఆత్మస్పర్శను అంతమొందించింది.
మరో ఊపిరికి రూపాన్నిచ్చే క్రమంలో కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ప్రాణాన్ని ఫణంగా పెట్టే అసమాన అమృతమూర్తి అయిన మాతృమూర్తి ఆడపిల్ల అని తెలియగానే సమాజపు అసహజరాగాలకు .భర్త అత్తమామల అరాచకవాదాలకు తన మాతృత్వాన్ని ఫణంగా పెట్టి…
తన మమకారాన్ని మాయం చేసుకుంది..చేసుకునే పరిస్థితిలోకి నెట్టివేయబడుతుంది.
పుట్టగానే అమ్మ ఒడిలో కాకుండా చెత్తకుప్పలలో పడుకున్న/ పడిఉన్న ఆడశిశువులు.. ఈ లోకంలో అడుగు పెట్టకముందే ఆ (పై)లోకంలో సేద తీరుతున్న పసికూనలు..
ప్రాణాన్ని కాపాడే అత్యాధునిక స్కానింగ్ పరీక్షలు తమ ప్రాణాలు కబళించే మారణాయుధాలు అని తెలుసుకోలేని చిన్నారులు
“ఈ సమాజంలో ఆడపిల్ల అనునదే అత్యంత పాపమా” అని ప్రశ్నార్థకంగా ఉన్నాయి పాలుగారే పసిమోములు!!
భ్రూణహత్యల పైశాచిక సంస్కృతిని పెంచిపోషించేవారి ఆలోచనలకు ఉరిశిక్ష వేద్దాం.
ప్రకృతికి మారుపేరై ,సృష్టికే సృష్టిని అందించే ఆడపిల్లను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిద్దాం.

అక్షరాలతో ఈ ప్రయాణం కొనసాగుతుంది

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY