మనం మర్చిపోతున్న జ్ఞాపకాల గుండెసవ్వడిని తన అక్షరాలతో అందిస్తున్నారు కృష్ణ స్వప్న…కాలాన్ని వెనక్కి తిప్పేద్దాం..ఆ గతంలోకి ఒక్కసారి వెళ్ళొద్దాం …కృష్ణ స్వప్న…తరాల సేతు బంధనాలు

తులసి మాటున చిక్కగా పరుచుకున్న చింత ఆకుల నీడల్లో…
మమతానురాగాలని పంచి పెట్టిన ఆ పెంకుటింటిలో…
తాతయ్య ప్రేమలో, అమ్మమ్మ చేతి వంటలో …
వెన్నెల రాత్రుల్లో రెక్కలు విప్పిన తూనీగల్లె తీసిన పరుగుల్లో …
అక్కా చెల్లెళ్ళతో, నేస్తాలతో ఆడిన చిలిపి ఆటల్లో ..
కట్టెల పొయ్యి వేడి సెగలలో ,అలికిన నేల సుగంధం లో ,
రాత్రి కట్టిన నక్షత్రాల లెక్కల్లో ..తాతయ్య చెప్పిన నీతి కధల్లో
అలకల సాదింపు లలో, మారాం కోసం తీసిన రాగాలలో ….
అమ్మ కసిరితే అక్కున చేర్చుకున్న నాయనమ్మ అనురాగం లో
బాల్యం లో అమ్మమ్మ ఇంట్లో సాగిన ఆటలలో ..
సాగనంపే వేళ అమ్మమ కళ్ళల్లో మెరిసిన తడిలో ..
సుఖ దుఖాలతో సాగిన నిండిన జీవన యానం లో
అలిసిన ఆ వదనాల పైన నిండిన అనుభవాల ముడతల లో
జీవితపు ప్రతి కోణాన్ని దర్శింప చేసే తాతయ్య కళ్ళజోడు లో
అర్ధ శతకం పైగా సాగిన ప్రవాసం లో ఊతమిచ్చిన చేతి కర్రలో
కష్టించి అలిసిన సంధ్య వేళ విశ్రాంతి నందించిన వాలు కుర్చీలో
పని అనబడే పరుగు పందెంలో పడి ముంగిట వాలే పక్షుల కోసం
ఆ వృద్దుల కన్నుల్లో సాగే నిరీక్షణ మాపలేని నా అశక్తత లో ..
మనవలు మనవరాళ్ళ ఆట పాటలలో ..
ఆనందాల హరివిల్లై మురిసిపోయిన ఆ అంతరంగాలను
తరతరాల వారసత్వ సాంప్రదాయాలకి నెలవులను
ఆదర్శాలను సంస్కారాలను నేర్పించిన గురువులను
నా తరానికి సర్వవిషయ సంశోబిత పెద్దబాల శిక్షలను
మూడు తరాలను ప్రేమతో బందించిన సేతువులను
అస్పష్టంగా గుర్తు చేసుకుంటూ ఉంటాను.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ శీర్షికను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY