రైలులో తను మాత్రమే వున్నాడు..నిద్రలో నుంచి లేచి చూసేసరికి.. హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి …దెయ్యాల రైలు…(ఘోస్ట్ స్టోరీస్) 04-02-2018

                                                      (4)

కాటుక కారుచీకటి రంగు పులుముకుందా?? లేక కారుచీకటి కాటుకరంగు పులుముకుందా అన్నట్టుంది ఆ ప్రాంతం.. అదొక అటవీ ప్రాంతం..ఆ చిక్కటిచీకటిలో ఆ అటవీప్రాంతంలో అప్పటివరకూ స్పృహ లేకుండా పడిఉన్న మల్హోత్రా మెల్లిగా కళ్లు తెరిచాడు.. తలంతా భారంగా ఉంది. చుట్టూ చూడటానికి ప్రయత్నిస్తూ ఆ చీకటికి కళ్లు అలవాటు పడేవరకూ అలా ఉండిపోయాడు. తానక్కడికి ఎలా వచ్చాడో ఆలోచిస్తూ నడక మొదలుపెట్టాడు. తాను ఏ ప్రదేశంలో ఉన్నాడో సమయం ఎంతో ఏమీ తెలియడం లేదు. సెల్ ఫోన్ కోసం జేబులు తడుముకున్నాడు.
దారి తప్పి తిరుగుతున్న తనను కొందరు దుండగులు క్లోరోఫాం జల్లి అన్నీ దోచుకుని తనను ఆ ప్రాంతంలో వదిలి వెళ్లేటపుడు అన్ని వస్తువులతో పాటు తన గడియారం సెల్ ఫోన్ కూడా ఎత్తుకెళ్లారని అర్థమైంది!!
చేసేదేమీలేక అక్కడనుండి బైట పడాలని నడక మొదలుపెట్టాడు మల్హోత్రా. సుదూరంగా ఏదో వెలుతురు. ఆ వెలుతురు ఆధారంగా నడక సాగిస్తున్నాడు. ఆ వెలుతురు అక్కడున్న చిన్నపాటి రైల్వేస్టేషన్ లో ఉన్న లైట్ల తాలుకూ వెలుగు. అక్కడున్న ప్రదేశాన్నంతా పరికించి చూస్తే అక్కడెవరూ లేరు. ఒక గదిలో ఉన్న గడియారంలో టైం 12.30 చూపిస్తోంది. చుట్టూ అటవీప్రాంతం భీతి గొలుపుతోంది. అంతలో పట్టాల మీద ఒక రైలు ఆగకుండా మెల్లగా నడుస్తోంది. అది చూసిన మల్హోత్రా వెనుకముందూ ఆలోచించకుండా ఆ రైలు ఎక్కేశాడు.
మల్హోత్రా రైలు ఎక్కగానే ఆ రైలు హఠాత్తుగా వేగం పుంజుకుంది. అక్కడున్న బోగీ అంతా ఖాళీగా ఉంది. ఆ అటవీప్రాంతం నుండి బయట పడ్డానని అనుకుంటూ టికెట్ కోసం టి.సి వస్తే ఏదొకటి చెప్పాలనుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాడు మల్హోత్రా.
హఠాత్తుగా మెలకువ వచ్చింది మల్హోత్రాకి. తనమీద ఎవరో వంగి చూస్తున్నట్టు అనిపించింది. లేచి చూస్తే ఏదో ఆకారం. అదిరిపడి అక్కడున్న లైటు వేసి చూసి స్థాణువైపోయాడు.
ఆ ఖాళీ గా ఉన్న బోగీలో చాలామంది ఉన్నారు. కొందరు పడుకున్నారు కొందరు కూర్చుని ఉన్నారు. కొందరు కిటికీలకు ఫ్యాన్లకు వేలాడుతున్నారు. కొందరేమో తలక్రిందులుగా నడుస్తున్నారు. అది చూసిన మల్హోత్రాకు భయంతో వణుకు మొదలైంది. వారందరూ మనుష్యులు కాదని అర్థమైంది. అంతకంటే భీతి కలిగించే సంఘటన చూడనే చూశాడు మల్హోత్రా. ఆ నడుస్తున్న రైలు ఒక సొరంగపు గోడలలోనుండి వెళుతోంది. అక్కడున్న వారందరూ కలిసి మల్హోత్రాను తాకడానికి ఒక్కో అడుగూ వేస్తుంటే వారి నుండి తప్పించుకోవడానికి బోగీ తలుపు వద్దకు వచ్చిన మల్హోత్రా బయటి దృశ్యం చూసి నిశ్చేష్టుడై వేరే దారి లేక బయటకు దూకేశాడు.
అక్కడ ఆ బోగీ బైట భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. రైలు నల్లటిపొగ చీకటిలా కప్పేసింది. ఆ పొగ లోకి దూకిన మల్హోత్రా శక్తిని కూడదీసుకుంటూ లేచి నిలబడ్డాడు. ఆ పొగ లో ఆ రైలు కరిగిపోతూ చివరకు అదృశ్యమై మాయమైపోయింది. అక్కడ జరిగిన సంఘటనను తన సెల్ ఫోన్ లో బంధించాలనుకున్న మల్హోత్రాకు ఆ అవకాశం లేకపోయింది!!
***
నువ్వు చాలా అదృష్టవంతుడివి మిస్టర్ మల్హోత్రా”అన్నాడు డేవిడ్సన్ మల్హోత్రా వంకే చూస్తూ …
“ఎందుకు ?ఆశ్చర్యం,,అనుమానం కూడిన గొంతుతో అడిగాడు
” ఇంకా ఈ భయంకరమైన ఈ అనుభవాన్ని నేను మర్చిలేకపోతున్నాను”అన్నాడు మల్హోత్రా.అప్పటికే అతను ప్రమాదంలో నుంచి బయటపడో పన్నెండు గంటలు దాటింది.
“నిన్ను దోచుకున్న దొంగలు నీదగ్గర వున్న విలువైన వస్తువులు అన్నీ దోచుకున్నారు కానీ నీ దగ్గర వున్న క్రాస్ ను వదిలేశారు..”మల్హోత్రా మెడలో వున్న క్రాస్ వంక చూసి చెప్పాడు.
అర్థం కానట్టు చూసాడు మల్హోత్రా.
“నీ దగ్గర క్రాస్ ఉండడం వాళ్ళ నిన్ను ఆ దెయ్యాలు చేరలేకపోయాయి..లేకపోతే అవి నిన్ను తమలో కలుపుకునేవి..”చెప్పాడు డేవిడ్సన్
క్రాస్ ను కళ్ళకు అద్దుకున్నాడు మల్హోత్రా ….భయంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి .
***
మొత్తం ఏడుగురు..బలిష్టంగా వున్నారు.వాళ్ళ చేతుల్లో తోలుసంచీలు..వాటి నిండా వాళ్ళు దారికాచి దోచుకున్న సొమ్ము..పదిహేనురోజులకొకసారి ఇలా దారి దోపిడీకీ తెగబడుతారు..ఈసారి పోలిసుల నుంచి ప్రమాదం ఉండడంతో ఈ రూట్ లోకి వచ్చారు…
వెనక్కి తిరిగివెళ్తే ప్రమాదమని ముందుకు వెళ్లారు…
“దూరంగా వెలుతురు కనిపిస్తుంది..అక్కడి నుంచి దగ్గర్లో వున్న పట్టణానికి వెళ్లిపోదాం..ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం”ఆ ముఠా నాయకుడు చెప్పాడు.అందరూ తలలూపి ముందుకు నడిచారు.
ఏదో వెలుతురు. ఆ వెలుతురు ఆధారంగా నడక సాగిస్తున్నాడు. ఆ వెలుతురు అక్కడున్న చిన్నపాటి రైల్వేస్టేషన్ లో ఉన్న లైట్ల తాలుకూ వెలుగు. అక్కడున్న ప్రదేశాన్నంతా పరికించి చూస్తే అక్కడెవరూ లేరు. ఒక గదిలో ఉన్న గడియారంలో టైం 12.30 చూపిస్తోంది.
ఈలోగా ఒకర్తెలు ఆగకుండా నెమ్మదిగా వస్తోందో.స్టేషన్ మాస్టర్ లేదు..స్టేషన్ లో జనం లేరు.
“ఈరియాలు ఇక్కడ ఆగదనుకుంటా..అందరూ ఎక్కండి”ముఠా నాయకుడు తొందర చేసాడు.అందరూ రైలు ఎక్కారు.రైలు వేగాన్ని అందుకుంది.
వాళ్లలో ఒకడు ఎందుకో వెనక్కి చూస్తా అతడికి స్టేషన్ కనిపించలేదు…దట్టమైన .అడవి మాత్రమే కనిపిస్తోంది…అందరూ నిద్రలోకి జారుకున్నారు..రైలు విపరీతమైన వేగంతో వెళ్తుంది . .ఆ శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు.రైలు సొరంగంలోకి వెళ్ళింది…

***నో ఎండ్ ***

( “రోమ్ లోని క్రూయిజ్ రైల్వేస్టేషన్ లో దయ్యాల రైలు (Ghost train) తిరుగుతూ ఉంటుందనీ.. ఆ రైలును దయ్యాలు మాత్రమే నడుపుతాయనీ. అందులో ఎక్కినవారు ఆ రైలు నుండి వచ్చే పొగలో కలిసి అదృశ్యమైపోతారనీ” తెలిసిన సమాచారం ఆధారంగా..రచయిత్రి)

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY