అందరూ సీరియస్ గా డిస్కషన్ లో ఉన్నారు. విషయం ఏమిటో అర్థం కాలేదు కానీ నేను కూడా వాళ్ళతో కూర్చున్నాను. కాసేపటి తరువాత…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (04-02-2018)

ఏక పాత్రాభినయంతో మన పేరు బాగా ఫేమస్ అయ్యింది. చిన్న చిన్న పార్టీలకు నన్నే పిలవడం స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ఒక ఆదివారం యదావిదిగా బాలవికాస్ క్లాస్ కి వెళ్లాం.
అందరూ సీరియస్ గా డిస్కషన్ లో ఉన్నారు. విషయం ఏమిటో అర్థం కాలేదు కానీ నేను కూడా వాళ్ళతో కూర్చున్నాను. కాసేపటి తరువాత విషయం అర్థం అయ్యింది.
త్వరలో సాయిబాబా బర్త్ డే వస్తోంది. అందరూ పుట్టపర్తి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా అన్ని బాలవికాస్ గ్రౌప్స్ కలిసి తిరుపతి నుండి బయలుదేరేవిధంగా ప్లాన్.
మా జూనియర్స్ కూడా రెడీ అయినట్టు ఉన్నారు. వాళ్ళ ఇంటిలో పర్మిషన్ ఇచ్చేశారు.
నేను సాదారణంగా తిరుపతి వదిలిపెట్టి వెళ్ళను. కారణం నాకు బస్సు ప్రయాణం అంటే అలెర్జీ..
ఈ విషయం మా ఇంట్లో కూడా తెలుసు కనుక నన్ను ఎక్కడకు పంపరు. స్కూల్ పిక్నిక్స్, ఎక్స్ కర్షన్స్ లాంటివి మన ఒంటికి పడవు.
మా క్లాస్ ఫ్రండ్స్ ఎవరైనా స్కూల్ ట్రిప్ కి వెళ్లి వస్తే వాళ్ళు చెప్పే విషయాలు విని ఆనందించడం తప్ప మనం ఎప్పుడూ చూసింది లేదు.
అటువంటిది ఆంటీ, మా జూనియర్స్ కూడా నన్ను రమ్మని మరీ మరీ అడుగుతుంటే నాకు కూడా వాళ్ళతో వెళ్ళాలనే అనిపించింది.
మరి ఇంట్లో అడిగితే ఏమంటారో… పైగా అంత దూరం…(అప్పటికి నాకు తిరుపతి అనంతపురం ఎంత దూరం ఉందో కూడా తెలియదు).. నా వల్ల అవుతుందా… పైగా అది 5 డేస్ ప్రోగ్రాం.
భోజనం, వసతి అంతా వాళ్ళదే…
వెళ్లాలని ఒక వైపు ఇంట్రెస్ట్… అసలు వెళ్ళగలనా అనే డౌట్ మరో వైపు…
జూనియర్స్ ఇంట్రెస్ట్ చూస్తంటే వెళితేనే బాగుంటుంది అని ఒక ఆశ…
ఇంట్లో అడిగి చూద్దామని డిసైడ్ అయ్యాను.
ఆ రోజు సాయంత్రం బాల వికాస్ క్లాస్ అయిన తరువాత ఇంటికి వచ్చాను.
అడగనా.. వద్దా… అన్న డైలమాలో ఏదో డిన్నర్ అయ్యిందనిపించి చల్లగాలి కోసం బయటకు వచ్చాను.
మా జూనియర్స్ ఉన్నది మా పక్క ఇళ్ళలోనే కావడంతో వాళ్ళు కూడా బయటకు వచ్చారు.
అందరం బయట మీటింగ్ పెట్టాం.
మా ఇంట్లో అడిగారా అని ప్రశ్నించారు.
నా అయోమయం వాళ్లకు చెప్పాను.
జూనియర్స్ అయినా నాకన్నా ధైర్యంగా మీకు ఏమీ కాదంటూ ధైర్యం చెప్పారు.
అయినా నేను డౌట్ గా చూస్తుంటే ఇక లాభం లేదని డిసైడ్ అయ్యారు…

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY