ఓపిక నశించిపోతుండగా మొత్తానికి నా వంతు వచ్చింది….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (01-04-2018)

సాయిబాబా ఆశ్రమంలో క్రమశిక్షణ బాగానే ఉంది.
అందరూ క్యూ పద్దతి బాగా పాటిస్తున్నారు. ఆ పద్దతి నచ్చడంతో ఆకలి నన్ను దహించివేస్తున్నా సహించి ఓపికగా లైన్ లోనే కదులుతున్నాను.
అందరూ చిరునవ్వుతో సాయిరాం అని అవతలివారిని సంభోదిస్తున్నారు..
సాయిరాం అంటే మన బాషలో హలో లాంటి పదం అనుకున్నాను…
ప్రతి మాటకు ముందు దేవుణ్ణి తలచుకున్నట్టు, ప్రతి మాటకు ముందు ఆశ్రమంలో సాయిరాం అని సాయిబాబాను తలచుకోవడం ఆనవాయితీలా ఉంది..
ఇక నాకు తప్పేట్టు లేదని నేను కూడా ఆ పదం పలకడం ప్రారంభించాను. లేదంటే ఈ విషయం తెలిసిందంటే ఆంటీ నాకు క్లాస్ పీకడం ఖాయం అని బాగానే అర్థం అయ్యింది.
ఓపిక నశించిపోతుండగా మొత్తానికి నా వంతు వచ్చింది… అక్కడ ఉన్న ప్లేట్ తీసుకుని టోకెన్ ఇవ్వగానే నా ఎదురుగా ఉన్న వ్యక్తి సాయిరాం అని అన్నాడు…
ఆకలితో ఇక్కడ చచ్చిపోతుంటే ముందు అడిగింది ఇవ్వకుండా సాయిరాం అనడంతో అప్పటిదాకా అణిచిపెట్టుకున్న కోపం ఒక్కసారి సర్రున రైజ్ అయ్యింది.
అవకాశం ఉంటే వాణ్ని ఈడ్చి నాలుగు తన్నాలి అనిపించింది… అయితే అది మన ప్లేస్ కాదు పైగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆంటీకి చెడ్డపేరు వస్తుంది…
నా కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని వెధవ నవ్వు ఒకటి వాడి మొహాన పారేసాను..
నేను తిరిగి సాయిరాం అంటానేమో అని వాడు కాసేపు వెయిట్ చేసాడు.
నాకు తిక్క ఎక్కువే… వాడి వెయిటింగ్ నాకు ఒక రకమైన శాడిస్టిక్ ఫీల్ వచ్చింది.
సాయిరాం అనకుండానే… బ్రదర్ కాస్త తొందరగా వడ్డిస్తే నా వెనుక వెయిట్ చేస్తున్నవారికి హ్యాపీగా ఉంటుంది. దాని వల్ల నీకు ఖచ్చితంగా పుణ్యమే… పైగా సాయిబాబా కరుణ నీపై అమాంతం పెరిగిపోతుంది అనగానే వాడి మొహం ఫ్యూజ్ పోయిన బల్బ్ లా ఒక్కసారి వెలిగి ఆరిపోయింది…
మారు మాటాడకుండా గబగబా నా ప్లేట్ లో నేను ఆర్డర్ చేసినవి వడ్డించాడు…
గబగబా ప్లేట్ తీసుకుని నీళ్ళ గ్లాస్ అందుకుని దగ్గరలో ఖాళీగా ఉన్న చైర్ లో కూర్చున్నాను.
ముందు ఆత్మారాముణ్ని తృప్తి పరచి తరువాత తీరికగా ఆలోచిద్దామని డిసైడ్ అయ్యాను
రెండు ముద్దలు నోటిలో పడగానే కాస్త ఉపశమనం కలిగినట్టు అయ్యింది..
ఇక తాపీగా తింటూ కాంటీన్ మొత్తం కలయజూశాను…
జనం పలచగా ఉన్నారు… అప్పటికే క్యూ ఖాళీ అయ్యింది.
నాకు సర్వ్ చేసిన మానవుణ్ణి ఒక్కసారి చూశాను.
చూడడానికి యంగ్ గా ఉన్నాడు. అక్కడే చాడువుకుంటున్నట్టు ఉన్నాడు.
సాయిబాబా మీద భక్తి చాలా ఉన్నట్టు ఉంది…
చేస్తున్న పని మీద శ్రద్దకన్నా సాయిబాబా మీద భక్తి చాలా ఉన్నట్టు ఉంది.

చూడడానికి యంగ్ గా ఉన్నాడు. అక్కడే చదువుకుంటున్నట్టు ఉన్నాడు.
సాయిబాబా మీద భక్తి చాలా ఉన్నట్టు ఉంది…
చేస్తున్న పని మీద శ్రద్దకన్నా సాయిబాబా మీద భక్తి చాలా ఉన్నట్టు ఉంది.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY