ఒట్టు బాస్ ఒక్క కుక్క రెండు కుక్కలయ్యింది…పళ్ళు కత్తుల్లా వున్నాయి..కళ్ళు ఎర్రగా వున్నాయి….అప్పుడే మిస్టర్ డి వాట్సాప్ నంబర్ కు ఓ ఇమేజ్ వచ్చింది….ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (17-06-2018)

                                          (13)
మిస్టర్ డి అసహనంగా మాటిమాటికి తన మొబైల్ వంక చూసుకుంటున్నాడు.” సిద్దార్థ రాకతో తనకు సమస్యలు మొదలయ్యాయి ” అన్న బలమైన ఫీలింగ్ ఉంది అతనికి.పైగా మిస్టర్ డి తనను తానూ కూడా నమ్మడు. ఎప్పుడైతే తనవాళ్లలోనే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ వున్నాడని తెలిసిందో..అప్పుడే అసహనంగా ఫీలయ్యాడు.దానికి తగ్గట్టు తన డెన్ కు సిద్దార్థ రావడం..,డేవిడ్ గురించి సిద్దార్థకు తెలియడం..అంతా తన అనుమానాన్ని నిజం చేసేలా అనిపిస్తుంది.
( పెంపుడు కుక్క దయ్యం రూపంలో వచ్చింది! ఈ వార్త …ఈ చాప్టర్ లోనే చదవండి)
ఈపాటికి డేవిడ్ ఇంటిదగ్గరికి పంపించిన తన మనుష్యులనుంచి కబురురావాలి.
అలా అనుకుంటున్నా సమయంలోనే అతని మొబైల్ రింగ్ అయ్యింది.
” బాస్ డేవిడ్ ఇంటి ముందు డిటెక్టివ్ సిద్ధార్థను ఎటాక్ చేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకుందామని అనుకున్నాం..కానీ ఒక దెయ్యం కుక్క మమ్మల్ని తీవ్రంగా  గాయపరిచింది ” తను పంపిన అనుచరుల్లో ఒకడు చెప్పాడు
” దెయ్యం కుక్కలేమిట్రా  ? అయినా కుక్కలకు భయపడడం ఏమిట్రా ఫూల్స్..అయినా మీ  దగ్గర ఆయుధాలున్నాయిగా ” కోపంగా అన్నాడు మిస్టర్ డి.
” మేము ఆయుధాలు బయటకు తీసే సమయం కూడా ఇవ్వకుండా మా మీద విరుచుకుపడ్డాయి,.ఒక్కోసారి ఒక్కో కుక్క రెండు కుక్కలయ్యింది ” అవతల వాడు చెబుతున్నాడు
” ఒరే నా ముందుకు వస్తే నేనే మిమ్మల్ని కాల్చి  చంపుతాను.నా డాబర్ మెన్ కుక్కలకు ఆహారంగా వేస్తాను..బాగా తాగి వేషాలేస్తున్నారా?  కోపంగా ఆ గది అదిరేలా పిచ్చిపట్టినట్టు అరిచాడు మిస్టర్ డి.
” ఒట్టు బాస్ ఒక్క కుక్క రెండు కుక్కలయ్యింది…పళ్ళు కత్తుల్లా   వున్నాయి..కళ్ళు ఎర్రగా వున్నాయి “
” ఒరే అపరా..ముందు మీరు రండి …మీ పని చెబుతా? హిస్టీరియా వచ్చినట్టు వూగిపోతూ అన్నాడు కోపంగా మిస్టర్ డి
అప్పుడే మిస్టర్ డి వాట్సాప్ నంబర్ కు ఓ ఇమేజ్ వచ్చింది.
                                          ***
ఆ ఇమేజ్ వంక చూసి షాకయ్యాడు.అది కరీం ఇమేజ్…మిస్టర్ డి కరీం వంక చూసాడు.వాట్సాప్ లో వచ్చిన ఇమేజ్ లోని చొక్కానే వేసుకున్నాడు…ఆ ఇమేజ్ లో మూడవ బటన్ ( గుండీ) దగ్గర రౌండప్ చేసి ఉంది.పరీక్షగా చూస్తే తెలుస్తుంది…అదొక బటన్ కెమెరా..అని
మిస్టర్ డి కరీం వంక అతని చొక్కా వంకే చూస్తున్నాడు.బాస్ తన వంక చూడడం ఎందుకో అర్థం కాలేదు. తమవాళ్లలోనే వున్న పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరో తెలుసుకోవడంలో తన హెల్ప్ అడుగుతున్నాడా ? తాను తన బాస్ కోసం ఏదైనా చేస్తాడు…
మిస్టర్ డి మిగితా ఆరుగురిని బయటకు పంపించాడు.
ఆ గదిలో కరీం ,మిస్టర్ డి మాత్రమే వున్నారు.
” చెప్పండి బాస్…మీకోసమే నన్నేం చేయమంటారు..మీకు వ్యతిరేకంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆ నీచ్ కమీనే ఎవరో తెలుసుకుని సీక్రెట్ గా లేపేయమంటారా ? అడిగాడు కరీం
మిస్టర్ డి కరీం వంకే చూస్తూ  ” నీ షర్ట్  బావుంది..కొత్తగా..ఎప్పుడూ వేసుకోలేదనుకుంటాను  ..” పరీక్షగా కరీం వైపే చూస్తూ అన్నాడు
వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు.ఎందుకంటే ” రెండురోజుల క్రితం ఒకమ్మాయి పరిచయం అయ్యింది.తనంటే ఇష్టం అంది.ఆమె పుట్టినరోజుకు తనకు షర్ట్ కొనిచ్చింది.అది వేసుకోకపోతే ఒట్టు  అంది…” కరీం కు అమ్మాయిల పిచ్చి.బాస్ కు అనుమానం ఎక్కువ.అందులోనూ తనదగ్గర పనిచేసేవాళ్ళు అమ్మాయిలకు దూరంగా ఉండాలంటారు.కావాలంటే అనుభవించి చంపెయ్..అంటాడు..అలాంటిది ఒకమ్మాయి గిఫ్ట్ గా ఇచ్చిందని చెబితే…
అందుకే వెంటనే ఓ అబద్దం చెప్పాడు..” ఈరోజు నా బర్త్ డే బాస్” సిగ్గుపడుతూ చెప్పాడు
మిస్టర్ డి మాట్లాడలేదు..కరీం వైపు చూసి ” వెరీ గుడ్..హ్యాపీ బర్త్ డే”  అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ…
” థాంక్యూ బాస్..ఇంతకూ ఆ ఇన్ఫార్మర్ ..?
“ఆ విషయం నేను చూసుకుంటాను….”అన్నాడు మిస్టర్ డి
కరీం వెళ్తుంటే ” మనసులో అనుకున్నాడు..బర్త్ డే లు రెండుసార్లు చేసుకుంటున్నావ్..ఒకే ఒక డెత్ డే నీకు ఫిక్స్ అయ్యింది…
ఎందుకంటే కరీం బర్త్ డే ఎప్పుడో మిస్టర్ డి కి తెలుసు.
                   ***
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)  
డిటెక్టివ్ సిద్దార్థ నేపథ్యం
( పెంపుడు కుక్క దయ్యం రూపంలో వచ్చింది! ఈ వార్త …ఈ చాప్టర్ లోనే చదవండి )కెనడాలోని మనిటోబోకు చెందిన మిషెల్లీ క్రెయిగ్‌టన్ (44)కి ఓ నీడ కనిపించింది. అప్పటి వరకు బంధుమిత్రులు ఎంత ఓదార్చినా ఆమె మనసు శాంతించలేదు. తెరల మాటున కనిపించిన నీడ ఆమెకు సాంత్వన ఇచ్చింది.
మిషెల్లీ ఆత్మీయంగా పెంచిన కుక్క ఓక్లీ ఏప్రిల్‌లో ప్రాణాలు విడవటంతో ఆమె తట్టుకోలేకపోయారు. క్షణక్షణం ఓక్లీనే గుర్తు చేసుకుంటూ రోదించారు. అయితే ఇటీవల ఓ రోజు ఆమెకు తన లివింగ్ రూమ్‌లో కర్టెన్స్ వెనుక ఓక్లీ లీలగా కనిపించింది. దీంతో ఓక్లీ తనకు దూరంగా లేదని, ఆత్మ రూపంలో తనకు దగ్గరగానే ఉందని చాలా సంతోషించారు. బంధుమిత్రుల రూపంలోని ఆత్మీయులు ఎంతగా ఓదార్చినా ఆమె మనసు కుదుట పడలేదు కానీ, దయ్యం రూపంలో తన పెంపుడు కుక్క కనిపించేసరికి ఆమె గొప్ప శాంతి పొందారు.
మిషెల్లీ మాట్లాడుతూ తాను మొదటిసారి ఓక్లీ నీడను చూసినపుడు తన కళ్ళు తనను మోసం చేస్తున్నాయని భావించానన్నారు. కానీ తదేకంగా చూసినపుడు ఆ నీడ తన ఓక్లీలాగానే కనిపించిందని చెప్పారు. ఆ నీడను తాను ఫొటోలు తీశానని చెప్పారు. అది కచ్చితంగా ఓక్లీయేనని ఆ ఫొటోల్లో నీడ స్పష్టం చేస్తోందన్నారు. తాను చెబితే ఎవరైనా నమ్ముతారో లేదోనని, ఫొటోలు తీసినట్లు తెలిపారు. తాను పడకపై నుంచి లేచి తెరలను తొలగించి చూశానని, ఆ నీడ మాయమైపోయిందని చెప్పారు. ఈ సంఘటనతో తన మనసు ప్రశాంతంగా మారిందన్నారు. తన ఓక్లీకి ఏమీ కాలేదని నమ్ముతున్నానన్నారు. ఓక్లీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. అంటే తన ఇంట్లోనే, తనతోనే ఉన్నట్లు నమ్ముతున్నానని చెప్పారు.(ఆంధ్రజ్యోతి సౌజన్యం 15-06-2018 )
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్) 
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY