ఏ ఫలితాన్ని ఆశించి గాలి వీస్తుంది…భూమి మనల్ని మోస్తుంది..నీరు మన దాహార్తిని తీరుస్తుంది …ప్రకృతిని పరిచయం చేద్దాం…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్ (16-12-2018)

ఏ ఫలితాన్ని ఆశించి గాలి వీస్తుంది…భూమి మనల్ని మోస్తుంది..నీరు మన దాహార్తిని తీరుస్తుంది ..అగ్ని మనకు ఉపయోగపడుతుంది ?
ఏ ఫలితాన్ని కోరి పళ్ళు పూలు కాయగూరలు మనకోసం ఆత్మార్పణ చేసుకుంటున్నాయి ?
ఏ ఫలితాన్ని ఆశించి చెట్లు నీడను ఇస్తున్నాయి ?
ఏ ఫలితాన్ని కోరి సమస్త ప్రకృతి మనకు సమస్తాన్ని అనిస్తున్నాయి ?
ఏ ఫలితాన్ని ఆశించి సమస్తప్రాణులు జంతుజాలం మనకు చేదోడై నిలుస్తుంది. ?వాటికీ డబ్బు మీద వ్యామోహం లేదు ద్వేషం లేదు అధికారవ్యామోహం లేదు…తమ బాధను చెప్పుకునే స్వరమూ లేదు…
అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నాం ?
మనకు మాత్రమే మాట్లాడే గొప్ప వరాన్ని ఇచ్చాడు భగవంతుడు.
మనకు మాత్రమే అనుబంధాలను ,భావోద్వేగాలను ప్రదర్శనంచే అవకాశం ఇచ్చాడు.
కానీ మనం కఠినమైన పరుషపదజాలంతో దూషిస్తున్నాం..ద్వేషిస్తున్నాం.
అనుబంధాలను మానవ సంబంధాలను కాలరాస్తున్నాం.
రాతియుగానికి ప్రయాణిస్తున్నాం...
కన్నతల్లిని ఇనుపసంకెళ్ళతో బంధించిన సు..పుత్రుల దాష్టీకం
ఆస్తికోసం అన్నదమ్ముల వైరం…రక్తపాతం …
అధికారదాహం, స్వార్థం…విధ్వంసం…దోపిడీలు ఫ్యాక్షన్ గొడవలు హత్యారాజకీయాలు…
మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తునాం ? రేపటితరానికి ఎవరిని పరిచయం చేస్తున్నాం ?
కనీసం రాబోయే తరానికి అయినా ప్రకృతిని పరిచయం చేద్దాం…
వాటి గొప్పతనాన్ని చాటి చెబుదాం..ప్రకృతిని కాపాడుకుందాం..ప్రకృతిలోని సుగుణాలను అలవర్చుకుందాం.
మనష్యుల్లా మానవత్వమే మన తత్వంగా బ్రతుకుదాం.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY