సృజనశీలి డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి” ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ అవార్డు ” … ఇది ప్రతిభకు దక్కిన పురస్కారం.. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పలువురు ప్రముఖుల అభినందనలు..( 04-02-2019)

హైద్రాబాద్,ఫిబ్రవరి 3 ( మేన్ రోబో బ్యూరో )
సృజనాత్మకతకు పట్టం కడుతూ ఇన్నోవేటివ్ పదానికి సరికొత్త అర్థం చెబుతూ విద్యార్థుల్లోని మేధాశక్తిని వెలికితీస్తూ సులభశైలిలో వినూత్న పద్దతిలో బోధనా కార్యక్రమాలు చేపట్టిన సృజనశీలి,విద్యారత్న డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి 2018 సంవత్సరానికి ” ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ అవార్డు ” లభించింది.
విద్యావిధానంపై నగరంలో జరిగిన జాతీయ సదస్సులో జేఎన్టీయూ డైరెక్టర్ ప్రొఫెసర్ అంజిరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
” విద్యతోనే వికాసం ,వికాసంతోనే విజయం..విజయంతోనే దేశభవిష్యత్తు పురోభివృద్ధి ” అన్నారు లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ ,డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.
“ఈ అవార్డు తన భాద్యతను మరింత పెంచిందని.మున్ముందు కూడా విద్యావ్యవస్థలో సృజనాత్మకతతో కూడిన మార్పుల కోసం కృషి చేస్తానని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ కృషిలో,భాగస్వాములు కావాలని “ఆకాంక్షించారు
లోటస్ ల్యాప్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పలువురు ప్రముఖులు తమ అభినందనలు తెలియజేసారు.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి మేన్ రోబో అభినందనలు తెలియజేస్తుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY