వీరజవానులకు అమర జవానులకు సెల్యూట్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి (18-02-2019)

చలిలో దుప్పటి ముసుగేసి జనాలు ..
వర్షంలో గొడుగు పట్టుకునే జనాలు
ఎండలో నీడపట్టున వుండే జనాలు…
చీకటిపడితే ఇళ్లకు చేరే జనాలు …
కానీ మాకోసం ..దేశంకోసం 
మా అందరిని కాపు కాసే దేవుళ్ళు …జవానులు 
కంటిని  కత్తిగా మార్చి
చెవులను వింటిగా సంధించి
శ్వాసను అస్త్రంగా ఎక్కుపెట్టి.
ప్రాణాన్ని తృణప్రాయంగా
మాకోసం ధారపోసి వీరజవానులు …
మా అశ్రువులతో మీకు అశ్రునివాళి
మా బరువెక్కిన గుండెలతో వీడ్కోలు
మళ్ళీ మీరు మాకోసం…ఈదేశం కోసం 
భరతమాత పుత్రులై జన్మిస్తారు 
ఉగ్రవాద ముష్కరులను 
కొదమసింహాలై వేటాడుతారు 
వీరజవానులకు అమర జవానులకు సెల్యూట్
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY