శిక్షణ .. క్రమశిక్షణతోనే విద్యార్థుల భవిష్యత్తు స్వర్ణమయం వ్యక్తిత్వం కూడా పాఠ్యాంశం కావాలి …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి …బోడుప్పల్ “లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ “వార్షికోత్సవ సంబరాలు

హైద్రాబాద్ ( మేన్ రోబో న్యూస్ బ్యూరో )
బోడుప్పల్ త్రిబులెస్ గార్డెన్
లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ సంబరాలు
విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పురప్రముఖులు …
సాక్షాత్తు సరస్వతీదేవి కొలువుదీరినట్టు ..రేపటిపౌరులను తీర్చిదిద్దే విద్యాలయం వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి.
వినయంతో విద్య,శిక్షణతో క్రమశిక్షణ వ్యక్తిత్వంతో భవిష్యత్తు రాణిస్తుందని త్రికరశుద్ధిగా నమ్మే లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ ,విద్యావేత్త రచయిత లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం ఉత్తమ విద్యావిధానాన్ని ,విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలిచింది.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ప్రసంగం
” నేను ఒక ఉపాధ్యాయుడిని మాత్రమే కాదు నా బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశించే తండ్రిని,
విద్యార్థులకు ఉత్తమ శిక్షణ మాత్రమే కాదు అత్యుత్తమ క్రమశిక్షణ అవసరం అని నమ్మే ఒక పౌరుడిని
వ్యక్తిత్వం కూడా ఒక పాఠ్యాంశం కావాలని ఆకాంక్షించే ఒక రచయితని .
తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య మాత్రమే నేర్పిస్తే  సరిపోదు..రేపటి భవిష్యత్తుకు విజ్ఞానాన్ని క్రమశిక్షణను వ్యక్తిత్వాన్ని నేర్పించాలి.
రేపటి సమాజంలో దేశాన్ని  ముందుకు నడిపించే రైతులు ఉపాధ్యాయులు న్యాయవాదులు ఐఏఎస్ లు ఐపీఎస్ లు శాస్త్రవేత్తలు ఆదర్శభావాలు కలిగిన వ్యక్తులు తయారుకావాలంటే ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వాలి.తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి.ఇంట్లోనే మానవత్వాన్ని వ్యక్తిత్వాన్ని భోదించాలి.
మనం మన పిల్లలకు ఖరీదైన కానుకల కన్నా విలువైన వ్యక్తిత్వాన్ని అందించాలి “
విద్యారంగంలో వినూత్నమైన మార్పులు సృజనాత్మకత కోరుకునే డాక్టర్ కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి ప్రసంగం ఆచరణీయం…అభినందనీయం
ఈ వార్షికోత్సవ వేడుకల్లో విశ్రాంత ఆచార్యులు ఉపేందర్ రెడ్డి,పాఠశాల డైరెక్టర్ మంజులా రెడ్డి ,ప్రిన్సిపాల్ షహనాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY