విద్యారంగంలో చేసిన విశేష వినూత్న కృషికి ప్రతిష్టాత్మక పురస్కారం…లోటస్ ల్యాప్ కు అరుదైన గౌరవం.డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి సాధించిన విజయం

హైద్రాబాద్ ( మేన్ రోబో న్యూస్ బ్యూరో )
కృషికి రుషి అతను.పట్టుదలకు ముందు నిలిచే సారథి అతను .
విద్యారంగంలో నిరంతరం నూతనత్వాన్ని,చేతనాన్ని కోరుకునే నిరంతర అన్వేషి అతను.
విద్యావేత్తగా,ఒక తండ్రిగా,సామాజికసేవాదృక్పథానికి చిరునామాగా,కాలమిస్ట్ గా,రచయితగా..
భిన్నరూపాల వైవిధ్యం…విద్యార్థులు బంగారు భవిష్యత్తు అతని సంకల్పం.
అతడు ఒక్కడే..వేనవేల సైన్యం…అతడే విద్యారంగానికి నూతన ఒరవడిని తీర్చిదిద్దిన ఆదర్శం .
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి మేన్ రోబో అభినందనలు
దేశవ్యాప్తంగా 2500 బడ్జెట్ పాఠశాలలపై ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ చేపట్టిన సర్వేలో లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ దిల్ షుఖ్ నగర్ బ్రాంచి హైద్రాబాద్ లో 3వ ర్యాంక్ , తెలంగాణాలో 6వ ర్యాంక్ భారతదేశంలో 23వ స్థానం దక్కించుకుని నూతన ఉన్నత విద్యాప్రమాణలకు సాక్షిసంతకంగా నిలిచింది.
ముంబై కేంద్రంగా పనిచేసే ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ పాఠశాలలో విద్యాప్రమాణాలు, నాణ్యత,భద్రత,సాంకేతిక వినియోగం క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించినట్టు లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తెలిపారు.
ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో టాటా కన్సల్టేన్సీ సర్వీసెస్ వ్యవస్థాపక సీఈఓ లలిత్ కె కోనోదయా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY