మార్పు మనతోనే మొదలు పెడదాం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్ ( 08 -07 -2020 )

మనం ముసుగేసుకుని బ్రతుకుతున్నాం
ముఖానికి మాస్కు వేసుకోవాలంటే నిర్లక్ష్యం..వేసీ వేసుకోనట్టు వేసుకుంటాం.
సామాజిక దూరం పాటించాలంటే అలక్ష్యం ..పాటించీ పాటించనట్టు పాటిస్తాం.
పని వున్నా లేకపోయినా రోడ్డు మీదికి వస్తాం.పనిలేకపోయినా పని ఉన్నట్టు హడావుడి పడతాం.
కనిపించని క్రిమి శత్రువుగా మారి మన జీవితాల మీద దాడి చేస్తున్నా ,పట్టీపట్టనట్టు ఉంటున్నాం.
ప్రభుత్వమే అన్నీ చేయాలనీ,
వైద్యులే కరోనాను తరిమేయాలని,
పారిశుధ్య కార్మికులే నడుం కట్టాలని,
అనుకుని మనకు మనం నిర్లప్తంగా ఉంటున్నాం…అని అనిపించేలా ప్రవర్తిస్తున్నాం .
ఈ నిష్ఠురసత్యం కాదనగలమా?
ఒక్కసారి మనం వేసుకున్న నిర్లక్ష్యం ముసుగు తీసేసి ఆలోచిద్దాం.
పనివుంటే తప్ప బయటకు అడుగుపెట్టకుండా ఉందాం.
మనకు మనమే సామాజికదూరం పాటిద్దాం.
కొన్నాళ్ళు దూరంగా ఉంటే శాశ్వతంగా కరోనా మనకు దూరం అవుతుంది.
లేకపోతె భవిష్యత్తు అంతా ముఖానికి మాస్కులు వేసుకుని,ఆర్థికవ్యవస్థ చితికి, మరణాలు పెరిగి,బంధాలు బందీగా మరి,మనకు మనమే ఒక జైలును సృష్టించుకుని యావజ్జీవ కారాగారశిక్ష అనుభవించే దుస్థితి వస్తుంది.
ఆలోచించండి.కరోనాను తరిమికొట్టే స్వీయ నియంత్రణతో ముందుకు అడుగేద్దాం రండి.

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY