మండే ఎండల్లో ట్రాఫిక్ పోలీసులకు చల్లని వార్త ” ఏసీ హెల్మెట్ “

( మేన్ రోబో )

ట్రాఫిక్ సిగ్నల్ పడకముందే పరుగులు తీసే వాహనదారులు
మండే ఎండల్లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ,వాహన రద్దీని క్రమబద్దీకరిస్తూ,నెత్తిమీద చుర్రున  మండే ఎండ,దానికి తోడు హెల్మెట్.ధరించి గంటల తరబడి నిలబడాలి.
ఈ సమస్యకు చెక్ పెడుతూ ..
ప్రధాన   రహదారుల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు  ఏసీ హెల్మెట్లు రాబోతున్నాయి.
రాచకొండ సీపీ ప్రయోగాత్మకంగా కొంతమంది సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందజేసినట్టు సమాచారం.
బ్యాటరీతో నడిచే ఈ హెల్మెట్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మూడుగంటల పాటు చల్లటిగాలిని అందిస్తుంది.
హెల్మెట్ లోపల మూడు వైపుల నుంచి ముఖానికి చల్లటి గాలి తగులుతుంది.
వీటి పనితీరు బాగుంటే మిగతా కానిస్టేబుల్స్ కు వీటిని అందించనున్నట్టు పోలీస్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులకు ఈ హెల్మెట్ ఉపశమనం కలిగిస్తుంది.
ఈ ప్రయోగం విజయవంతం కావాలి.
ఈ ఆలోచన చేసిన అధికారులకు హేట్సాఫ్ .

photo &news … courtesy ..eenadu

NO COMMENTS

LEAVE A REPLY