మొత్తమ్మీద ఆ కుక్కకు ఇంకా భూమ్మీద నూకలున్నాయి.కార్ల రేసులో తనూ పరుగెత్తి ప్రాణాలతో ఫీట్ చేసింది.తర్వాతేమైందో ఈ వీడియో చూడండి.

బొలీవియాలో “కొడాసర్-20162 కార్ రేస్”
ఈ కారు రేస్ చూడ్డానికి జనం క్రిక్కిరిసిపోయారు.సినిమాలో యాక్షన్ సీన్ చూస్తున్నట్టుగా వుంది.కార్లు దుమ్మురేపుకుంటూ వెళ్తున్నాయి.మట్టిరోడ్లు ఎత్తుపల్లాలు…రేస్ ఉత్కంఠ భరితంగా వుంది.ఇంతలో ఊహించని సంఘటన.కార్ల శబ్దానికి ఓ కుక్క ఆ రోడ్డుమీదికి వచ్చింది.
ఊహించని ఈ పరిణామానికి జనం షాకయ్యారు.రోడ్డుమీద కుక్క పరుగెడుతోంది.ఆ వెనుకే రేస్ కారు వేగంగా వస్తుంది.కుక్క కూడా రేసులో పాల్గొందా..?అన్నట్టు వుంది.
అంతకు మించి నరాలు తెగే ఉత్కంఠ …కుక్కకు చావుతప్పదని డిసైడ్ అయి ఆ దారుణాన్ని చూడలేక జనం కళ్ళు మూసుకున్నారు.
కానీ సినిమాను తలపించేలా యాక్షన్ సీన్ మొదలైంది.కారు కుక్క దగ్గరికి వస్తూనే కారు గాల్లోకి ఎగిరింది.కుక్కమీది నుంచి పైకి ముందుకు దూకి…తాపీగా వెళ్లిపోయింది.
ఆ శునకం కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు తనూ పరుగెత్తి బ్రతికిపోయింది.
కార్ల రేసులో కుక్క కూడా పార్టిసిపేట్ చేసినట్లయింది.
ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

coutesy …Isaías Moisés Escobar

NO COMMENTS

LEAVE A REPLY