సాహు షూట్ చేసిన మైక్రో రాకెట్ లాంచర్ తక్కువ శబ్దం చేస్తూ దూసుకు వచ్చి గ్లాస్ వాల్ ను బ్రద్దలు కొట్టింది….స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (16-10-2016)

భూపతి అగస్త్య రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాడు.
గ్లాస్ ఫ్లోర్ డిజైన్ వల్ల విదిశకు అగస్త్య కనపడ్డంలేదు
చాలా నీరసించిపోయి ఉంది.
ఎంతగా హింసించారో దుర్మార్గులు…
అగస్త్య మనసు తట్టుకోలేకపోతోంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా మనసు మాట వినడంలేదు.
తనను తాను మరచిపోతున్నాడు.. ఆవేశం హద్దులు దాటిపోతోంది
“భూపతీ! ఆ బుక్ ను తెప్పించు… విదిశ మాత్రమే ఆ బుక్ ని ఓపెన్ చెయ్యాలి” ప్రతిమాట వత్తి పలుకుతూ అన్నాడు.
భూపతి తన మనుషులకు సైగ చేశాడు.
భూపతికి రైట్ హాండ్ బుక్ తేవడానికి లోనికి వెళ్ళాడు.
“అగస్త్యా… నీకు ఇన్ని వివరాలు ఎలా తెలిశాయి?” ఉండబట్టలేక అడిగాడు భూపతి
“నాగవల్లి శివాలయంలో…”
“గ్రేట్… నీ షార్ప్ నెస్ ఇస్ రియల్లీ సూపర్బ్” శత్రువైనా అగస్త్యను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు భూపతి
ఆ గ్యాప్ లో అగస్త్య క్యాజువల్ గా పాకెట్ లో చెయ్యి పెట్టుకున్నాడు.
బయట నుండి చూసే వారికి అది ఏదో సరదాగా పెట్టుకున్నట్టు ఉంది.
పాకెట్ లో ఉన్న సెన్సర్ ను ఎవరికీ అనుమానం రాకుండా నొక్కాడు.
సెన్సర్ సిగ్నల్స్ ను అక్కడ దగ్గరలో ఉన్న నందనవర్మ గారికి చేరింది.
సిగ్నల్ హై అలెర్ట్ మోడ్ లో పంపడం వల్ల టీం వెంటనే రియాక్ట్ అయ్యారు.
భూపతి అనుచరుడు బుక్ ఉన్న పెట్టెను బద్రంగా అగస్త్య ముందు పెట్టాడు
“భూపతీ… స్వచ్చమైన తేనెను తెప్పించు” అడిగాడు అగస్త్య
“ఎందుకు?” అనుమానంగా అడిగాడు
“బుక్ ను తేనెలో తడపాలి… అప్పుడే దానికి చైతన్యం వస్తుంది. అంతవరకూ ఏం చేసినా ప్రయోజనం లేదు”
గల్ఫ్ దేశాలు స్వచ్చమైన తేనెకు ప్రసిద్ది…
భూపతి కనుసైగతో రెండు డ్రమ్ముల తేనెను తీసుకువచ్చి అగస్త్య ముందు పెట్టాడు అతని అనుచరుడు.
అగస్త్య సిగ్నల్ అందుకున్న నందనవర్మగారు టీంను తీసుకుని ఆ ప్లేస్ చుట్టుముట్టారు
నందనవర్మ సిగ్నల్స్ అందుకున్న అగస్త్య ఆలస్యం చెయ్యలేదు.
తాను కూర్చున్న చైర్ నుండి చెంగున లేచాడు
అనుకోని రియాక్షన్ కు భూపతి ఒక్కసారి షాక్ అయ్యాడు
అగస్త్య లేస్తూనే కుడి చేత్తో బుక్ ను అందుకుంటూ ఎడం చేత్తో తాను కూర్చున్న చైర్ ను ముందుకు లాగాడు.
భూపతి అనుచరులు ఒక్క క్షణం ఆలస్యంగా జరుగుతున్న సంఘటనలకు రియాక్ట్ అయ్యారు
అంతలోనే ఆలస్యం జరిగిపోయింది.
అగస్త్య కాలితో ఎదురుగా ఉన్న టేబుల్ ను ఫోర్సు గా తన్నాడు
టేబుల్ గింగరాలు తిరుగుతూ వెళ్లి భూపతి మొహం పగులకొట్టింది
భావురుమంటూ రెండు చేతులతో మొహం కప్పుకుంటూ వెనక్కు విరుచుకుపడ్డాడు భూపతి
నందనవర్మ గారి టీం యాక్షన్ లోకి దిగిపోయారు.
సాహు షూట్ చేసిన మైక్రో రాకెట్ లాంచర్ తక్కువ శబ్దం చేస్తూ దూసుకు వచ్చి గ్లాస్ వాల్ ను బ్రద్దలు కొట్టింది.
హిమాంషు స్పీడ్ బోట్ లో నుండి షూట్ చేస్తూ మరోవైపు దూసుకు వచ్చాడు
హిమాంషు ఎటాక్ తో అగస్త్య నిలబడి ఉన్న గ్లాస్ ఫ్లోర్ పెద్దగా రంద్రం పడింది
అగస్త్య ఆలస్యం చెయ్యకుండా విదిశ ఉన్న బోటు లోకి దూకాడు
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ))

NO COMMENTS

LEAVE A REPLY