ఇంతకన్నా నా జీవితానికి ఇంకేం కావాలి…డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి అక్షర కథనంతో(16-10-2016)

9
ఉపసంహారం
కోరికలు
కోరికలు అనర్థాలకు మూలం అని నా ఉద్దేశం.అంటే అతి కోరికలు,మన సామర్థ్యానికి మించిన కోరికలు…
నాకుపెద్దగా కోరికలు అంటూ లేవు…చిన్నప్పుడు స్కూల్లో ..నేను ఎక్స్ట్రార్డినరీ అనుకోలేదు.ఉన్నదాంట్లో సంతృప్తి పొందాను.
కోరిక అనేది ఆత్మసంతృప్తిని ఇవ్వాలి. అసంతృప్తికి ఆజ్యం పోయకూడదు.
కోరికలను హద్దులో పెట్టుకుని ముందుకు సాగితే విజయం వరిస్తుందని నమ్మినవాడిని.
భగవంతుడు ఇంతవరకు ఇచ్చాడు..ఇంకా ఏమీలేని వాళ్ళు వున్నారు.అందుకే నాకెలాంటి అసంతృప్తి లేదు.
బ్రతికినంతవరకు సాయం చేస్తాను.
ఆశ దుఃఖానికి హేతువు…
అందుకే అత్యాశ వద్దు..
సమాజాన్ని చూస్తుంటే…బాధేస్తుంది.కులమతాల మధ్య అంతరాలు గొడవలు బాధిస్తాయి,
కులం జాతి మతం అంటూ గొడవలు..ఇవి గుర్తుకొస్తే బాదేస్తాయి.
సంతృప్తిగా బ్రతకాలంటే ఏం చేయాలి?
మనిషికి తృప్తి లేదు..మనకు ఉన్నంత వరకు తృప్తిగా ఉండాలి.
నాకు కారు వుంది.ఇంత కన్నా పెద్ద కారు కావాలి అనేది వద్దు.
పిండికొద్దీ రొట్టె..
ఆశ ఓకే
నిరాశ..అత్యాశ.దురాశ వద్దు…
ఆశ శ్వాసలా మన ఎదుగుదలకు ఉపయోగపడాలి.
ఆశ ఈర్షకు దారి తీయొద్దు.
నాకు అన్ని కంఫర్ట్స్ దేవుడు ఇచ్చాడు.రెండు పూటల తిండి..బట్టలు..ఉండడానికి ఇల్లు..కారు..జీవితానికి సరిపడా భరోసా…
ఇంతకన్నా నా జీవితానికి ఇంకేం కావాలి.ప్రశాంతమైన ఈ జీవితం కడవరకూ ఇలాగే ఉండాలి.
నావల్ల సమాజానికి మేలు జరగాలి,ఈ పుస్తకం ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్టే.మీ అభిమాన మీ ఆశీస్సులు మీ ఆదరణ ఇలానే ఉండాలి.
తన అక్షరకథనంతో ఈ పుస్తకానికి వన్నె తెచ్చిన రచయిత్రి తేజారాణిగారికి కృతఙ్ఞతలు.
ఈ సీరియల్ ను ప్రచురించి పాఠకులకు నన్ను దగ్గర చేసిన మేన్ రోబో కు ధన్యవాదాలు.
సదా మీ అభిమానాన్ని కోరుకుంటూ..మీ కృష్ణ పుట్టపర్తి
ఎడిటర్ వాయిస్
దాదాపు పదివారాలపాటు మేన్ రోబో పాఠకులను అక్షరాలతో పలకరించిన డాక్టర్ కృష్ణ పుట్టపర్తి సీరియల్ ఈ వారంతో ముగిసిపోతుంది.ఒక ఎన్నారై సక్సెస్ స్టోరీ ,ఒక ఎన్నారై ఫీలింగ్స్,ఇతరులకు స్ఫూర్తిని కలిగించే విషయాలు ఒక ఆటో బయోగ్రఫీలా కాకుండా,ఒక వ్యక్తిత్వ వికాస ధారావాహికతో కలిసి కొనసాగిన ఈ సీరియల్ చాలా మంది పాఠకులతో కనెక్ట్ అయ్యింది.ఇప్పటితరం సైతం ఈ సీరియల్ తమకు మరింత స్ఫూర్తిని ఇచ్చిందని స్పందించింది.వయోభేదం లేకుండా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకున్న సీరియల్.
విదేశాల్లో వున్నవారిని పరిచయం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ సీరియల్ విజయవంతంగా ముగిసింది.
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారు వృత్తిరీత్యా బిజీ…అయినా సొసైటీ కి ఏదో చేయాలన్న తపన…సామాజికసేవ పట్ల విపరీతమైన కాంక్ష.
చిన్నారులకు చదువు చెప్పాలి.పేదపిల్లను ఆదుకోవాలి.విశ్రాంతజీవితాన్ని వీలైతే పసివారిని విద్యావంతులుగా తీర్చిదిద్దే యజ్ఞంలో తానూ భాగస్వామిని కావాలన్న ప్రగాఢవాంఛ.
మనం మనకోసమే కాదు ..మనతో ఈ సమాజంలో బ్రతికే నిస్సహాయులకోసం కూడా కాసింత సమయాన్ని వెచ్చించాలన్న ఆలోచన…
డల్లాస్ లో వున్నా హైద్రాబాద్ లో వున్న స్పర్శ సంస్థకు తన సమయాన్ని కేటాయిస్తారు.తనకు చేతనైన సాయం మాత్రమే కాదు..అంతకు మించి తాపత్రయపడతారు.కాన్సర్ తో బాధపడుతోన్న రోగులకు ,వారి చివరి క్షణాల్లో ఆర్థికంగా లేక బాధపడే వారి కోసం.స్పర్శ చేస్తోన్న దాతృత్వానికి డాక్టర్ కృష్ణ పుట్టపర్తి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు.
డల్లాస్ లో అడుగుపెట్టే ప్రముఖులు ..వారు ఏ రంగంలో వున్నవారైనా డాక్టర్ కృష్ణ పుట్టపర్తి స్నేహపూర్వక ఆతిథ్యము స్వీకరించే వెళ్తారు.
హైద్రాబాద్ లో కాన్సర్ తో బాధపడుతోన్న రోగులకు ,వారి చివరి క్షణాల్లో ఆర్థికంగా లేక బాధపడే వారి కోసం.స్పర్శ చేస్తోన్న దాతృత్వానికి డాక్టర్ కృష్ణ పుట్టపర్తి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు.
కాన్సర్ తో పోరాడి గెలిచిన తేజారాణి తిరునగరి ఈ సీరియల్ కి అక్షర కథనాన్ని అందించి పాఠకుల అభిమానాన్ని స్వంతం చేసుకుని వండర్ ఫుల్ రైటర్ అనే పేరును సార్థకం చేసుకున్నారు.
డల్లాస్ లో వున్న డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారు…ఈ సీరియల్ కు సంబంధిన విషయాలను ఎప్పటికప్పుడు అందజేశారు.వృత్తిపరమైన బిజీలో కూడా తన సమయాన్ని వెచ్చించారు.
థాంక్యూ కృష్ణ పుట్టపర్తి గారు.
“నేను సామాన్యుడిని…నా గురించి నేను రాసుకునే ఈ సీరియల్ ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా నేను ధన్యుడిని “అన్న గొప్ప సంస్కారం తనది.మేన్ రోబో తో మాట్లాడుతూ తనకృతజ్ఞతలు తెలియజేయడం..ఆయనలోని గొప్ప సంస్కారవంతుడిని పరిచయం చేస్తుంది.
ఎంత ఎదిగినా తన మూలాలు మర్చిపోని వ్యక్తి.
తన ఊరి మట్టివాసనను మర్చిపోని కృతజ్ఞత ఆయన స్వంతం
వీలయితే తన విశ్రాంతజీవితాన్ని తాను పుట్టిపెరిగిన పుట్టపర్తిలో .పేదపిల్లలకు చెరువు చెబుతూ గడపాలన్న ఆయన ఆకాంక్ష మనసుపొరలను స్పృశిస్తుంది..
ఈ సీరియల్ ను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతఙ్ఞతలు.
ఈ సీరియల్ మేన్ రోబో పబ్లికేషన్స్ ద్వారా ఆన్ లైన్ లో ఇ బుక్ గా విడుదలైంది.
మీ కోసం ఆ లింక్ …
ఈ పుస్తకం మీద మీ స్పందన మాకు పంపించవచ్చు.
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి ఇ బుక్ లింక్…ప్రివ్యూ

http://preview.kinige.com/previews/7500/PreviewDoctorKrishnaPuttaparti36453.pdf

 

NO COMMENTS

LEAVE A REPLY