మానవత్వం కనబడుటలేదు
చేవచచ్చి జాలి చచ్చి ఆలోచనను చచ్చి
ఆచేతనం చేతనమైన సభ్యసమాజం నివ్వెరపోయి …
రాక్షసత్వం కర్కశత్వానికి తోడై మానవతా స్పృహ కోమాలోకి వెళ్ళింది….
మానవత్వం వెంటిలేటర్ మీద బ్రతుకుతుంది…
కాదంటారా?జనం చూస్తుండగానే మగమృగత్వం కొనసాగించిన అత్యాచారం …ఆటవికసమాజం కూడా సిగ్గుపడే పాశవిక దారుణం
నడిరోడ్డు మీద కత్తులతో దాడులు
యాసిడ్ తో బెదిరింపులు
రోడ్డుపక్కన చెత్తకుప్పల్లో శిశువుల మృతదేహాలు…
కొనఊపిరితో వున్న పసికూనల రుధిరగాయాలు…..
మానవత్వం తన ఉనికిని కోల్పోయి దానవత్వం అనే రూపాన్ని సంతరించుకుంటోంది..
మార్పు మృగ్యమైన సమాజంలో మానవత్వం ఏ మారుమూలనో తలదాచుకుంది. మానవసంబంధాలు పలుచబడుతున్న వేళ సాటిమనుష్యులకు జరుగుతున్న అన్యాయాలను చూసీ చూడనట్టు మిన్నకుంటున్నారు తప్ప తోటివారికి సాయం చేయాలనే తలంపు ఎవరికీ ఉండటం లేదు..
వేదనాభరితమైన సంఘటనలు మానవత్వాన్ని అంతం చేయడమే అంతిమలక్ష్యంగా సాగుతున్నాయి..
మనసులను వేలం వేస్తున్న మనుషుల మధ్య మానవత్వపు అలికిడి మాయమైపోయి మనిషితత్వం కదలిక కనిపించడం లేదు..
మానవత్వానికి మనిషితత్వానికి నీళ్లొదిలి మానవాళి సర్వనాశనానికై కంకణం ధరించిన మనిషే కదా మానవత్వభస్మాసురుడు!!
ఒక్కక్షణం ఆలోచిద్దాం
ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం
దారుణం జరుగుతున్నప్పుడు ఆ దారుణాన్ని ప్రపంచానికి చూపించే ఉత్సాహం కన్నా అక్కడే అప్పుడే ఆ దారుణాన్ని ఆపుదాం..దునుమాడుదాం …దాష్టీకానికి పాల్పడే మానవత్వం చచ్చి రాక్షసత్వంతో చెలరేగే క్రూరప్రమాదకర మానవ మృగాలను ఒక్కటై వేటాడుదాం.
ఎప్పుడైతే మనకళ్ల ముందు దారుణం జరుగుతుందో..అప్పుడే ఆ దారుణాన్ని ప్రశ్నిద్దాం…ఎదురిద్దాం…నిలదీసి నిగ్గదీసి యాసిడ్ తో కడిగేద్దాం.
అక్షరాలతో ఈ ప్రయాణం కొనసాగుతుంది
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్