ఈరోజు నిర్భయ నిందితులు హంతకులు సంఘ విద్రోహ శక్తులు ఎవరు? ఒకప్పటి పిల్లలే కదా..దండన అంటే ” శిక్ష” కాదు కాదు..క్రమశిక్షణ …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ( 07-02-2020)

తల్లిదండ్రుల గుండె చెమర్చే వ్యథ…
తల్లిదండ్రులను ఆలోచించమనిచెప్పే కథ
” ఆ పిల్లాడి వయస్సు నిండా పదేళ్లు కూడా లేవు.చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ ..ప్రవర్తనలో నిర్లక్ష్యం .స్కూల్ లో మాస్టారు పాఠం చెబుతుంటే పిల్లడు ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్నాడు.
ఆ ఉపాథ్యాయుడు ” పిల్లల్లకు చదువు సంస్కారం క్రమశిక్షణ ” ఉండాలని భావించే ఉత్తముడు.
పిల్లాడి నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు….మందలించాడు.
అయినా పిల్లాడి ప్రవర్తనలో మార్పులేదు
హెచ్చరించాడు ..ఫలితం శూన్యం.
అనివార్యమై బెత్తంతో రెండు దెబ్బలు వేసాడు.
మరుసటిరోజు బడిలో గొడవ.
పిల్లాడి తల్లిదండ్రులు తప్పు తమ బిడ్డడే అయినా నింద మాస్టారు మీద వేశారు.
కొన్ని పత్రికలు మరింత మసాలా దట్టించి ” మాస్టారి అమానుషత్వం..ఘోరం…” అంటూ వార్తలు అల్లారు.
ఫలితంగా చేయని తప్పుకు ఆ ఉత్తమ ఉపాథ్యాయుడు పదవి వదులుకున్నాడు.
తన ఇంట్లోనే పిల్లలకు పాఠాలు చెప్పుకున్నాడు.క్రమశిక్షణతో చదివే పిల్లలకే పాఠాలు చెప్పాడు
కాలం పరుగులు తీసింది.పదేళ్లు గడిచాయి.
ఒకరోజు మాస్టారు వీధి అరుగు మీద పాఠం చెబుతుంటే ఒక వ్యక్తి వచ్చాడు.మాసిన గడ్డం..మొహంలో దైన్యం మాస్టారి రెండుకాళ్ళ మీద పడ్డాడు
“నన్ను క్షమించండి మాస్టారు.నేను మీకు గుర్తున్నానా? పదేళ్ల క్రితం నా బిడ్డ తప్పు చేస్తే మందలించారని మిమ్మల్ని అవమానించాను.ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను.నా కొడుకు చెడువ్యసనాలకు బానిస అయ్యాడు.చివరికి నేరస్తుడిగా జైలు పాలయ్యాడు ? అంటూ కంటతడి పెట్టాడు.
” ఆ రోజే మీరు మీ బిడ్డను మందలించి ఉంటే,” ఉపాథ్యాయుడు అంటే తండ్రిలాంటివాడని.తన బిడ్డల బాగుకోసమే దండిస్తాడని ,మీరు గ్రహించి ఉంటే ఈ ఉపద్రవం వచ్చేది కాదు ” బాధగా చెప్పాడు ఉపాథ్యాయుడు.
అవును నిజమే
పూర్వంరోజుల్లో ఉపాద్యాయుడు చదువుకన్నా ముందు క్రమశిక్షణకు విలువ ఇచ్చేవారు.పిల్లలు తప్పుచేస్తే దండించేవారు.ఇక్కడ దండన అంటే ” మరోసారి ఆ తప్పు చేయకుండా గుర్తుచేసే కౌన్సిలింగ్ …
గురువులు అంటే భయభక్తులు లేని విద్య రాణించదు.ఎక్కడో ఎవరో ఒకరు అమానుషంగా ప్రవర్తించారని ఉపాథ్యాయలోకాన్నే నిందిస్తే…రేపటి భావితరాన్ని తీర్చిదిద్దేది ఎవరు?
ఈరోజు నిర్భయ నిందితులు హంతకులు సంఘ విద్రోహ శక్తులు ఎవరు? ఒకప్పటి పిల్లలే కదా..
ఆరోజే వారిని సన్మార్గంలో పెడితే ఈరోజు వాళ్ళు ఆలా తయారవుతారా?
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం పిల్లలను తీర్చిద్దడంలో కీలక పాత్ర పోషించాలి.
లేదంటే మరోతరంలో కూడా భారీ మూల్యం చెల్లించుకోవలిసి వస్తుంది.
ఇంట్లో తల్లిదండ్రులు
బడిలో గురువులు
సమాజంలో ప్రతిఒక్కరు పిల్లల భవిష్యత్తు కోసం కఠినంగా ఉంటూ,వారికీ క్రమశిక్షణ నేర్పించడంలో అందరూ చేతులు కలపాలి.
మేరా భారత్ మహాన్

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY