“దేవుడిని నమ్మినప్పుడు దెయ్యాలను కూడా నమ్మాలికదా?చిరునవ్వుతో అన్నాడు…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (18-12-2016)

                                              (8)
భయం ఆశ్చర్యం ఏకకాలంలో కలిగాయి.ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.ఒక్కసారిగా ఆమె ఆలోచనాప్రపంచం తలక్రిందులైంది.భయం రెట్టింపు అయ్యింది.అప్పటివరకూ ఆ వృద్ధుడి మీద వున్న అనుమానం స్థానంలో భయం మొదలైంది.
నువ్వు..మీరు?మెల్లిగా గొంతు పెగుల్చుకుని అడిగింది.
“మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో నేను ఇరుక్కున్నాను”చెప్పాడా వృద్ధుడు.
“ఎలా..?అన్నట్టు చూసింది గోమతి.
“మిమ్మల్ని వదిలేసి నేను వెనక్కి తిరిగాను.కానీ కొద్దీ దూరం వెళ్ళాక నాకు పాపం అనిపించింది.మీకు ఆపద కలుగవచ్చు అనే భయం కలిగింది.వెనక్కి తిరిగి వచ్చేసరికి మీ స్నేహితులు రక్తపుమడుగులో వున్నారు..వెంటనే నా జీపులో వున్న జాకీ తీసుకుని వచ్చాను.అప్పటికే నువ్వొక్కదానివి భయంతో పారిపోవడం చూసాను.నిన్నెవరో గాయపర్చారు.నిను కాపాడుదామనుకున్నాను .కానీ ఎవరో నా తలమీద బలంగా కొట్టారు.కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఇలా వున్నాను’చెప్పాడు
“నా స్నేహితులు అందరూ చచ్చిపోయారా?భయం అనుమానం బాధ అన్నీ కలిసిన స్వరంతో అడిగింది.
“నాకు తెలిసి నీ స్నేహితులు బ్రతికే అవకాశం లేదు.మనం తప్పించుకుంటే తప్ప బ్రతకం…”వృద్ధుడు చెప్పాడు.
“ఎలా ఎలా తప్పించుకుంటాం?నలుగురు యువకులు చనిపోయారు.నేను ఆడపిల్లను..మీరు వృద్దులు..ఎలా పోరాడగలం?బేలగా అంది గోమతి.
“చూద్దాం మనల్ని కాపాడ్డానికి ఏ ఆడపిల్లో పులిపిల్లలా సివంగిలా వస్తుందేమో…ఏ దేవుడో దిగివస్తాడేమో…మనకు దారిచూపే శక్తి ఎక్కడో వుండే ఉంటుంది”చిన్న ఆశతో అన్నాడు వృద్ధుడు.
ఆ శక్తి ఎవరో?
***
స్వాప్నిక కళ్ళు తుడుచుకుంది.అద్దంలో తన మొహాన్ని మరోసారి చూసుకుంది.ఇరవై ఆరేళ్ళ స్వాప్నిక కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్.గా చేస్తుంది.గతవారం రోజులుగా ఆమె హాస్పిటల్ కు వెళ్లడం లేదు.గోడమీద ముప్పయేళ్ల యువకుడి ఫోటో.ఫోటోకు దండవేసి వుంది.ఆ ఫోటో వంక చూస్తుంటే ఫొటోలో తానే కనిపిస్తోంది.వారం రోజులుగా ఆమె తిరుగుతూనే వుంది.వారం రోజుల తర్వాత ఆమె అన్వేషణ ఫలించింది.హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది.
ఆటోను పిలిచి అందులో కూచోని అడ్రెస్ చెప్పింది .సరిగ్గా పదినిమిషాల తర్వాత ఆటో పోలీసుస్టేషన్ ముందాగింది.ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్ లోపలి నడిచింది.
అప్పుడే బయటకు వెళ్ళబోతున్న ఇన్స్పెక్టర్ ఆగి స్వాప్నిక వంక చూసాడు.
““నా పేరు స్వాప్నిక …ఈ రోజు ఉదయం వంశీకృష్ణ అనే వ్యక్తి నన్ను చంపడానికి మాఇంటికి వచ్చాడు”ఫోటో ఇన్స్పెక్టర్ చేతికి ఇచ్చి చెప్పిందామె.
ఇన్స్పెక్టర్ ఆ ఫోటో వంక చూసాడు.తర్వాత ఆమె వంక చూసాడు.
“ఈ వ్యక్తి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడా?ఎవరితను…ప్రేమించానని మీ వెంట పడుతున్నాడా?
లేదు అన్నట్టు తలూపింది.
“మరి మీకు ఇతనికి ఏమిటి గొడవ?ఇన్స్పెక్టర్ అడిగాడు
“నాకూ తెలియదు.రెండురోజుల క్రితం నేను హాస్పిటల్ నుంచి వస్తుంటే నా వెహికల్ ని ఆక్సిడెంట్ చేయాలని ప్రయత్నించాడు.నిన్న సాయంత్రం ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్తే అక్కడికి వచ్చాడు.ఈ రోజు ఉదయం డైరెక్ట్ గా ఇంటికే వచ్చాడు.నేను కేకలు వేస్తె పారిపోయాడు.అతడు పారిపోతుంటే నా సెల్ తో ఫోటో తీసాను.”చెప్పింది
“ఓకే అని ఆ ఇన్స్పెక్టర్ తన సెల్ నుంచి ఓ నెంబర్ కు డయల్ చేసాడు”సర్ నేను ఇన్స్పెక్టర్ జేమ్స్ ని…వంశీకృష్ణ అనే వ్యక్తి డాక్టర్ స్వాప్నిక ను చంపడానికి ఉదయం ఆవిడ ఇంటికి వెళ్లారట…”
అవతలి వైపు నుంచి మాట్లాడింది విని”ఓకే సర్ అలాగే సర్”అంటూ స్వాప్నిక వైపు తిరిగి మీరు నాతో రండి అన్నాడు.
                                                        ***
అనిరుద్ర ఎర్విక్ ఎదురెదురుగా కూచున్నారు.అనిరుద్రతో పాటు అతను ఉంటోన్న క్వార్టర్స్ కు వచ్చింది.
“మనం అలర్ట్ గా ఉండాలి ఎర్విక్.ఎందుకంటే ఏ కేసులో అయినా ఆ కేసు వెనుక వున్న క్రిమినల్ తెలుస్తాడు..లేదా సస్పెక్టు చేస్తాం..ఈ నార్త్ అవెన్యూ కేసులో క్రిమినల్ ఎవరో తెలియడం లేదు…అసలు ఈ నార్త్ అవెన్యూ మిస్టరీ లో వున్నది మనుష్యులేనా ?లేదా ఆత్మలా”అన్నది కూడా అనుమానమే.
“సర్ మీరు ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడుతున్నారా? ఆశ్చర్యంగా అడిగింది ఎర్విక్.
“దేవుడిని నమ్మినప్పుడు దెయ్యాలను కూడా నమ్మాలికదా?చిరునవ్వుతో అన్నాడు.
అప్పుడే అతని సెల్ రింగ్ అయ్యింది.
అవతలివైపు వ్యక్తి చెప్పేది విన్నాక..సెల్ డిస్ కనెక్ట్ చేసి”ఎర్విక్ మనం అర్జెంటు గా హాస్పిటల్ కు వెళ్ళాలి”అన్నాడు.
“ఎందుకు ?అడిగింది ఎర్విక్
“ఎందుకంటే నేను నిన్ననే కోమాలోకి వెళ్ళిపోయాను.నార్త్ అవెన్యూ దగ్గర ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది..”చెప్పాడు అనిరుద్ర.
***
అసలు అక్కడ ఏం జరుగుతుంది? వంశికృష్ణకు అనిరుద్రకుఏమిటి సంబంధం? వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
నార్త్ అవెన్యూ నేపథ్యంలో…

8

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY