“నన్ను అట్టిపెట్టుకోండి తంబీ “అనాలన్నంత ఉక్రోషాన్ని గ్రైండర్ లో రుబ్బి మరీ సమాధానం చెప్పాలనుకున్నాడు. వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ&శ్రీమతి (15 -04 -2017)

(2)
అతని వంకే చూస్తోంది.అతని మోహంలో ఫీలింగ్స్ గ్రాఫిక్స్ లా మారిపోతున్నాయి.
కమాన్ మేన్…కక్కు వామ్ట్ …అంది అతని మొహంలో ఫీలింగ్స్ ని రోబో లా చకచకా చదివేస్తూ….
” నువ్వు ” కసిగా అన్నాడు.
”నేనా ?” పెదవుల మీద చేయి పెట్టుకుని అంది.
“నువ్వు కాకపోతే సన్నీ లియోనా? అంతా నీ వల్లే .నన్ను హాయిగా నిద్ర పోనివ్వకుండా మార్కింగ్ వాక్ లు , జాగింగ్ లు ,స్కిప్పింగ్ లు చేయిస్తున్నావు..నా స్వచ్ఛా స్వాతంత్ర్యాలను హరించివేస్తున్నావు..నీ దౌర్జన్యం డౌన్ డౌన్ ….
చేస్తే నువ్వు చేసావు .నాకీ లంపటం ఎందుకు ? ఉక్రోషంగా అడిగాడు చరణ్ .
”ఆరోగ్యం కోసం ..హెల్త్ ఈజ్ వెల్త్ “నవ్వుతూ అంది.
”ఛా … నిజమా?” అంటూ ”నేను ఈ లుంగీ బనియన్ మీద జాగింగ్ చేస్తుంటే ఊరకుక్కలు గుర్రు మంటూ నా వెంట పడుతున్నాయి తెలుసా ”మరింత ఉక్రోషంగా ఆనాడు .
”పోనీ ట్రాక్ సూట్ వేసుకొని రావొచ్చుగా ”
ఒళ్ళు మండింది చరణ్ కి .”రోజూ రాత్రి ప్యాంటు; షర్టు పిండి ఆరేసుకొని ఉదయాన్నే చెంబు ఇస్త్రీ చేసుకొని వెళ్తుంటే నీకు నవ్వులాటగా ఉందా ?
”సారీ ”అంది నొచ్చుకుంటూ-
”అది సరే కానీ , రేపటినుంచి నాకీ జాగింగ్ నుండి విముక్తి ప్రసాదించు .అన్నట్టు ఇవాళ పది గంటలకు ‘తళతళ ‘ వాషింగ్
పౌడర్ కంపెనీ లో ఇంటర్వు వుంది ఈవెనింగ్ కలుద్దాం , గుడ్ న్యూస్ తో …అన్నాడు చరణ్.
”ఇంకా ఆరు కూడా కాలేదు , కాసేపాగు చరణ్ ”అంది పక్కనే వున్న సిమెంటు బెంచీ మీద కూర్చుంటూ.
”ఆరే …హమ్మా బాబోయి నేను వెళ్ళాలి ”అన్నాడు కంగారుగా చరణ్ .
” అదేంటీ …?ఆరుకి …నువ్వు వెళ్ళడానికి సంబంధం ఏమిటి ?”
”ఆరున్నరకు ప్రసాద్ గాడి గర్ల్ ఫ్రెండ్ ఊరెళ్తుందట ”
”వెళ్తే …’
”వెళ్తే ఏంటి… నాకొంప కొల్లేరవుతుంది.ఆ ప్రసాద్ గాడు నా ప్యాంటు వేసుకెళ్తాడు”అన్నాడు కంగారుగా .
”సర్లే ఇవిగో కజ్జికాయలు తింటూ రూంకెళ్ళు … సాయంత్రం ఆరుగంటలకే ఆఫీస్ నుండి సరాసరి పార్కు కు వచ్చేస్తా ”అంటూ అప్పటివరకు పిడికిట్లో దాచిన కజ్జికాయలు కవర్ ఇచ్చింది .
”పార్కుకు వద్దు …ఇవాల్టీకి బస్టాప్ లోనే కళ్లుదాం ”
”అదేంటి ?;;
”వారం రోజుల క్రితం నీకోసం మధ్యాహ్నం పార్కులో వెయిట్ చేస్తే నువ్వు రాలేదు .
ఆకలి దంచేస్తోంది .జేబులో చిల్లర కూడా లేదు .ఆపద్భాంధవుడిలా బఠాణీలు అమ్మేకుర్రాడు వచ్చి ఇవాళ అమ్మ గారు రాలేదా?అంటూ మొదలెట్టి వేడివేడి బఠాణీలు తీసుకోండి సర్ అన్నాడు .”చిల్లర లేదన్నాను” పర్లేదుడు రేపివ్వండి అన్నాడు .పది రూపాయల బఠాణీలు పళ్ళు నొప్పెట్టేవరకు నమిలి నీళ్లు తాగాను .అంతే మళ్ళీ వాడికిస్తే వొట్టు .అందుకే వెరైటీగా బస్టాప్లో కలుసుకుందాం .
”వాడికి మొన్ననే డబ్బులిచ్చేశాను ”అంది చందన.
”ఈ విషయం నిన్ననే చెప్పాల్సింది .వాడిని చూసి తలా తిప్పుకొని చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది .సర్లే పార్కులో కలుద్దాం ”అంటూ తన రూమ్ వైపుకి నడిచాడు చరణ్ .
***
చరణ్ ఊహించినంత డామేజ్ జరిగిపోయింది .రూంకి వెళ్ళగానే చిన్న స్లిప్ కనిపించింది .
”ఒరేయి చరణ్ …ఏమనుకోకురా …నా ప్యాంటు బ్యాక్ సైడ్ పంక్చరైంది .అసలే గర్ల్ ఫ్రెండ్ కు సెండాఫ్ ఇవ్వాలి .ఈ ఒక్కసారి అడ్జెస్ట్ అయిపో, నేను తొందరగానే వచ్చేస్తాను – ప్రసాద్”.
ఒళ్ళు మండినా చేసేది లేక తమాయిన్చుకున్నాడు,ఇంటర్ వ్యూ కి ఎలా వెళ్ళాలి ?సీరియస్ గా ఆలోచిస్తూ వుండి పోయాడు .
చాలా సేపటికి ఓ ఐడియా ప్లాష్ లా తటింది .
అందరు చరణ్ ని వింతగా చూడసాగారు,
తళతళ వాషింగ్ పౌడర్ కంపెనీలో ఇంటర్ వ్యూ కి సుమారు వందమంది వరకు వచ్చారు .
అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు చరణ్ . లుంగీ ,షర్ట్ తో వచ్చాడు .
కాలు మీద కాలు వేసుకొని చేతులు వెనక్కి పెట్టుకొని ఆలోచిస్తున్నాడు చరణ్ .
”చరణ్ …” బాయ్ గట్టిగా అరిచాడు ,కోర్ట్ లో సాక్షిని బోనులోకి పిలిచినట్లు .
ఈ లోకంలోకి వచ్చి ఫైల్ పట్టుకొని ఇంటర్ వ్యూ జరిగే గదిలోకి అడుగు పెట్టాడు .
***
నీ పేరు ? ఇంటర్ వ్యూ బోర్డు మెంబెర్ అడిగాడు
”చరణ్ ”
”కాలిఫికేషన్స్?”సర్టిఫికెట్స్ చూస్తూ అడిగాడు .
”అందులో వుంది ”అని చెప్పాలని వున్నా నిగ్రహించుకొని చెప్పాడు .
”బి .కామ్”
నువ్వు తమిళియన్ వా ?”చరణ్ వంక చూసి అడిగాడు .
ఏం చెప్పాలోచెప్పాలో తోచలేదు , వెంటనే సర్దుకొని ” అవును నేనుదా తమిళియన్ని , నువ్వుదా
తెలిగియన్ వా .నేనుదా ఇరవై ఏళ్ళు మద్రాస్ లో వుంది పుడిస్తిని .అందుకూడా ఈ లుంగీ అలవాటు అయింది”తనకిష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు .
ఆ ఇంటర్ వ్యూ బోర్డ్ మెంబెర్ తలతిరిగిపోయింది.. అతని పేరు నటేశన్ ,తమిళియన్.
”సరే …మేము ఇంటర్ వ్యూ లో తలతిక్క ప్రశ్నలు ఆడగము.ఒకటే కండీషన్ ,
రెండువందల రూపాయలు డిపాజిట్ గా కడితే వాటికి సరిపడా డిటర్జెంట్ బిళ్ళలు ,పౌడర్ పాకెట్లు ఇస్తాం మీరు వాటిని సేల్ చేసుకొని అందులో పాతిక శాతం కమీషన్ .అంటే నెలకు పదిహేను వందల జీతం అన్నమాట ,ఏమి డిపాజిట్ కట్టి పూడుస్తావా?వెటకారంగా అన్నాడు నటేశన్ .
‘పూడ్చడానికేముంది నీ బొంద’ మనసులో అనుకోని ”డిపాజిట్ కట్టడానికి డబ్బులు లేవు అన్నాడు
“డబ్బుల్లేవంటే ఎట్టా అబ్బి ?నటేశన్ కాస్త వెటకారాన్ని మిక్సీలో వేసి అన్నాడు.
“నన్ను అట్టిపెట్టుకోండి తంబీ “అనాలన్నంత ఉక్రోషాన్ని గ్రైండర్ లో రుబ్బి మరీ సమాధానం చెప్పాలనుకున్నాడు.
అలా అంటే మొదటికే మోసం వస్తుందని..ఓ జాలి ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టాడు…
బోర్డు మెంబర్లు ఒకరి మొహం ఒకరు చూసుకొని ”నువ్వు చూస్తే మంచి పిల్లకాయలా వున్నావ్…
నీమీద నమ్మకంతో డిపాజిట్ లేకుండా ఇస్తాము” అన్నాడు ఇంటర్ వ్యూ బోర్డ్ చైర్మెన్
ఎందుకంటే వాళ్ళ బిజినెస్ దివాళా రూట్ లో వుంది .
***
(మిగితా వచ్చేవారం)

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY