ఫ్యాక్టరీలో అడుగు పెట్టగానే సెక్యూరిటీ చక్రపాణిని గుర్తుపట్టి లోపలి వదిలాడు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (28-05-2017)

(గత సంచిక తరువాయి)
మేం వెళ్లేసరికి అంకుల్ కూడా ఆఫీస్ నుండి వచ్చి ఉన్నారు. కుశలప్రశ్నల తరువాత ఆంటీ డిన్నర్ కి పిలిచారు.
ఒక చక్కని ఫ్యామిలీతో కలవడం చాలా ఆనందం కలిగించింది.
డిన్నర్ సూపర్ గా ఉంది. మంచి వెరైటీలతో చక్కని భోజనం. మొహమాటపడుతూనే మామూలు కన్నా కాస్త ఎక్కువే లాగించాను.
డిన్నర్ తరువాత స్వీట్ తీసుకుని ఆంటీ మా రూమ్ లోకి వచ్చింది. పిచ్చాపాటి మాట్లాడుతూ స్వీట్ తింటూ ఆ నైట్ ఆహ్లాదకరంగా సాగిపోయింది.
మరుసటి రోజు అలవాటు ప్రకారం 6 గంటలకే నిద్ర లేచాను. అప్పటికే ఆంటీ అంకుల్ లేచినట్టు ఉన్నారు. మా చక్రపాణిగాడు మంచం మీద అడ్డంగా పడి నిద్రపోతున్నాడు.
బ్రష్ చేసుకున్నాక బయటకు వచ్చాను. చల్లని గాలి … చుట్టూ చెట్లు నడుమ కాలనీ…
ఎర్లీ మార్నింగ్ టైం స్పెండ్ చెయ్యడానికి చాలా మంచి ప్లేస్ అనిపించింది.
సూర్యుడు అప్పుడే బయటకు వస్తున్నాడు.
ఇంతలో అంకుల్ పేపర్ తీసుకుని బయటకు వచ్చారు. ఆంటీ టీ తీసుకుని అంకుల్ తో కూడా వచ్చారు.
నా గురించి, మా ఫ్యామిలీ గురించి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండగా చక్రపాణిగాడు నిద్ర లేచాడు.
షుగర్ ఫ్యాక్టరీ 8 కే స్టార్ట్ కావడంతో అంకుల్ ఆఫీస్ కి రెడీ కావాలంటూ లోపలి వెళ్ళారు.
చక్రపాణి గాడితో మాటల్లో పడ్డాను. అతని ప్లాన్ ప్రకారం ఆ రోజు ఉదయమే చక్కర తయారు చేసే ప్రొసీజర్ చూడడానికి అంకుల్ మమ్మల్ని 11 గంటలకు రమ్మని చెప్పారట. వాడు ఆల్రెడీ చూసినా నా కోసం మళ్ళీ ఫ్యాక్టరీకి వస్తాను అనడం హ్యాపీగా అనిపించింది.
అనుకున్న ప్రకారం 11 గంటలకు రెడీ అయ్యి ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాం.
ఫ్యాక్టరీ ఇంటికి కూతవేటు దూరంలో ఉంది.
ఫ్యాక్టరీలో అడుగు పెట్టగానే సెక్యూరిటీ చక్రపాణిని గుర్తుపట్టి లోపలి వదిలాడు. చక్రపాణి నన్ను డైరెక్ట్ గా చెరుకు లోడ్ చేసే ప్లేస్ కి తీసుకువెళ్ళాడు. అతని వాలకం చూస్తుంటే వాడికికి షుగర్ తయారుచేసే విధానం బాగా తెలుసు అనిపించింది.
చెరుకు బండ్లు వరసగా నిలబెట్టి ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ నుండి ఆర్డర్ తెచ్చుకునే వరకు రైతులు చేరుకును పొలం నుండి కోయరు. చెరుకు పంటను కోసి స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అది త్వరగా ఎండిపోతుంది.
చెరుకు ఎండిపోతే అందులోని రసం చాలా తక్కువ వస్తుంది అది రైతుకు, ఫ్యాక్టరీకి నష్టం. చెరుకు తూకం కూడా తగ్గిపోతుంది. రైతుకు చాలా లాస్ వస్తుంది. అందుకే చెరుకు పంటను కోసిన వెంటనే ఫ్యాక్టరీకి తీసుకువచ్చేస్తారు.
చెరుకు బండ్లను తూచే యంత్రం చూశాం. అక్కడనుండి చెరుకును డైరెక్ట్ గా క్రేన్ సహాయంతో షుగర్ ప్రొడక్షన్ యూనిట్ లో వేస్తున్నారు. అక్కడ నుండి రకరకాల ప్రాసెస్ ద్వారా షుగర్ ను తయారు చేస్తారు.
చక్రపాణి ఓపికగా నాకు అన్నీ చూపించాడు. నేను షుగర్ ను రకరకాల స్టేజెస్ లో టేస్ట్ చేశాను.
మొత్తానికి షుగర్ ఫ్యాక్టరీ అనుభవం భలేగా అనిపించింది కాని షుగర్ ఎక్కువ తినడం వల్ల విసుగు పుట్టి షుగర్ అంటేనే విరక్తి కలిగింది.
రెండు రోజులు వాళ్ళ ఇంటిలో గడిపి షుగర్ ఫ్యాక్టరీ వాన్ లో ఆదివారం సాయంత్రం తిరుపతి చేరాను.
***
ఆ సంవత్సరం హాలిడేస్ లో మా నేటివ్ పాపానాయుడు పేట చేరాను. మా రిలేటివ్ మోహన్ గాడు, గౌరి గాడు స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఖాళీగా ఉన్నారు. అందరం కలిసి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లాలని నిర్ణయించుకుని ఒక సైకిల్ తీసుకుని బయలుదేరాం. మా ఊరు నుండి షుగర్ ఫ్యాక్టరీ 3 మైళ్ళు మాత్రమే.
హాయిగా నడుచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ గంటలో అక్కడకు చేరాం. చక్రపాణి ఇంటిని గుర్తుపట్టి ఆ ఇంటి తలుపు తట్టాను. అంకుల్ వచ్చి తలుపు తీశాడు.
ఎండలో నడిచి పిచ్చివాడిలా ఉన్న నన్ను చూసి ఎవరో తెలియనట్టు పేస్ పెట్టాడు. చక్రపాణి హాలిడేస్ లో వాళ్ళ సొంత ఊరు వెళ్లినట్టు చెప్పాడు. ఇక అక్కడ ఉంటే లాభం లేదని తిరుగు ప్రయాణం అయ్యాం.
మేము అంకుల్ ఇంటి నుండి బయటకు వచ్చాం. కాస్త దూరం పోగానే ఎందుకో వెనక్కు తిరిగి చూశాను. అంకుల్ ఇంటి బయటకు వచ్చి నన్నే చూస్తున్నాడు. గుర్తు పట్టి ఉంటాడేమో అనిపించింది.
ఇక అక్కడ ఆగకుండా షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాం.
నేను మా ఫ్రండ్ ఉంటాడని మా కజిన్స్ దగ్గర గొప్పలు చెప్పి తీసుకువచ్చాను. ఇప్పుడు ఏమీ చూడకుండా తిరిగి వెళితే ఎలా అనుకుంటూ ఉండగా, మా అదృష్టం బాగుండి తెలిసిన వ్యక్తి షుగర్ ఫ్యాక్టరీలో కనిపించాడు.
నన్ను గుర్తుపట్టి లోపలకు తీసుకువెళ్ళాడు. ఇక నాకు ఏనుగు ఎక్కినంత సంబరం కలిగింది. ఆయనతో పాటు లోనికి వెళ్లి షుగర్ తయారి విధానం మా కజిన్స్ కు చూపించాను. మొత్తానికి ట్రిప్ సక్సెస్ అయ్యి సాయత్రంగా పాపానాయుడు పేట చేరాం…
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY