వేసవి కాలంలో కూడా కోనేటిలో నీరు ఎండిపోకుండా ఎలా ఉందో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (04-06-2017)

(గత సంచిక తరువాయి)
చంద్రగిరి – ఎక్స్ కర్షన్
నేను 7 క్లాస్ చదివే రోజులు.
ఒక రోజు క్లాస్ లో ఉండగా ప్యూన్ సర్కులర్ తీసుకుని వచ్చాడు.
చంద్రగిరి ఎక్స్ కర్షన్ తీసుకు వెళ్ళడానికి సంబందించిన సర్కులర్
సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అన్ని సెక్షన్స్ స్టూడెంట్స్ ను ఎక్స్ కర్షన్ తీసుకువెళ్ళడానికి స్కూల్ నిర్ణయించింది.
ఫ్రండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే స్కూల్ చేరాక అదే ఫస్ట్ ఎక్స్ కర్షన్ మరి.
ఆదివారం… అందరూ స్కూల్ యూనిఫారంలో పొద్దున్న ఏడు గంటలకు స్కూల్ లో ఉండాలని ఆర్డర్ వేశారు.
ఇక మాకు పట్టాపగ్గాలు లేకుండా పోయాయి…
ఆదివారం కోసం ఎదురుచూడడం… ఎక్స్ కర్షన్ లో ఎలా ఉండాలో ఏమి గేమ్స్ ఆడాలో అన్న డిస్కషన్ తోనే గడిచిపోయింది…
మనం ఎదురుచూసే రైలు ఒక జీవితకాలం లేటు ఎవరు అన్నారో కాని మాకు మాత్రం ఎదురుచూసే ఆదివారం చాలా తొందరగా వచ్చేసినట్టు అనిపించింది.
పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్ యునిఫారంలో ముందుగా స్కూల్ లోకి అడుగుపెట్టాను.
అప్పటికే మా క్లాస్ మేట్స్ ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు. నేనే తొందరగా వచ్చానని హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చిన నేను కాస్త అప్సెట్ అయ్యాను. అయినా ఫ్రండ్స్ ను చూడగానే ఉన్న ఫీల్ అంతా ఎగిరిపోయింది.
అనుకున్న టైం ప్రకారం స్కూల్ కి అందరు వచ్చారు. ప్రతి క్లాస్ కి క్లాస్ టీచర్ ఆర్గనైజర్ గా పెట్టారు.
క్లాసుకి నలబై స్టూడెంట్స్ తో దాదాపు ఐదు వందల మంది స్టూడెంట్స్ పది బస్సుల్లో బయలుదేరాం.
అల్లరి అంతా మాదే అన్నట్టు బస్ లో గోల గోల చేస్తూ ట్రిప్ అంతా మాదే అన్నట్టు ఎంజాయ్ చెయ్యడం స్టార్ట్ చేశాం.
తిరుపతి నుండి చంద్రగిరి దాదాపు 14 కిలోమీటర్లు. రోడ్స్ సరిగ్గా లేకుండా ఉండడంతో బస్ మెల్లగానే పోతోంది. మా అల్లరి ఏ మాత్రం తగ్గడం లేదు.
క్లాస్ టీచర్ స్కూల్ లో ఉండగా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా బస్సులో మాత్రం మమ్మల్ని పెద్దగా కంట్రోల్ చెయ్యలేదు. దాంతో మా అల్లరి బస్ టాప్ లేచిపోయింది.
ఒక గంటకు బస్సులు చంద్రగిరి కోటను చేరాయి.
శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలించిన చంద్రగిరి నగరం.
అలనాటి వైభవానికి ప్రతీకగా నిలిచి ఉంది.
పచ్చని తివాచి పరిచినట్టు ఉన్న ప్రదేశంలో రాజసం ఉట్టిపడుతూ గంభీరంగా నిలుచున్నట్టు ఉన్న రాజమహల్. చుట్టూ పెద్ద చెట్లు.. మంచి ఎండలో కూడా చల్లని గాలి ఆహ్లాదంగా వీస్తోంది.
రాజమహల్ కి కాస్త దూరంలో రాణిమహల్. కాస్త శిధిలమైనా చక్కగా ఉంది.
రాణి విహారం చేసే ప్రదేశం. రాజు రాణి మందిరం, రాజు మంత్రాంగం చేసే ప్రదేశం అన్నీ చూపించారు.
ఒక్కప్పటి భాగానికి సజీవ సాక్షాలుగా అక్కడ దొరికిన కత్తులు, ఫిరంగులతో పురావస్తు శాఖ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
అలనాటి రాజులు వాడిన వస్తువులు, దుస్తులు, ఆయుధాలు అన్నీ చక్కగా గ్లాస్ ఛాంబర్ లో పెట్టి ఉన్నాయి.
అవన్నీ చూస్తుంటే ఏదో లోకంలో విహరిస్తున్నట్టు ఉంది. రాజమహల్ మూడు అంతస్తులతో ఈస్ట్ ఫేసింగ్ తో అద్భుతంగా ఉంది.
ఎదురుగా కోనేరు… తామరలతో కనువిందుగా ఉంది..
వేసవి కాలంలో కూడా కోనేటిలో నీరు ఎండిపోకుండా ఎలా ఉందో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు
ఎదురుగా పెద్ద కొండ.. ఎండ ఆ కొండపై పడి కొండ మెరిసిపోతోంది.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY