ఒకప్పటి ఆ …మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.నేనూ మా తమ్ముడూ ఆడుకున్న రోజులు….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (30-07-2017)

ఫీడ్ బ్యాక్
ఒకప్పటి ఆ …మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.నేనూ మా తమ్ముడూ ఆడుకున్న రోజులు.థాంక్యూ సురేంద్ర గారూ..మంచి జ్ఞాపకాలను సీరియల్ గా అందిస్తున్నందుకు..ప్రచురిస్తోన్న మేన్ రోబో కు ధన్యవాదాలు.,,,పి.ప్రభావతి (చెన్నై)
(గత సంచిక తరువాయి)
మంగళ హారతి కూడా అయ్యింది. అందరికి ఆ హారతిని కన్నుల కద్దుకోమని చూపుతూ ప్రతి ఒక్కరి వద్దకు వచ్చారు.
నేను చూద్దామనుకున్న సాయిబాబా మాత్రం నా కంటికి కనపడలేదు. ఇంతలో లంచ్ అరేంజ్ చేసినట్టు మా ఆంటీ వచ్చి చెప్పింది. అప్పటికే ఆకలి నకనకలాడుతూ ఉండడంతో ఇక ఏ మాత్రం ఆలోచించకుండా లేచాను. అప్పటికే మా జూనియర్స్ భజన ముగించుకుని వచ్చారు. ఇక అందరూ వెళ్లి తిండిపై పడ్డాం.
భోజనం బఫే కావడంతో తలో ప్లేట్ తీసుకుని లైన్ లో నిలబడ్డాం. ఇంతలో మా ఆంటీ వచ్చారు.
అప్పుడే ఫుడ్ ఏంటీ మీకు చాలా పని ఉంది అంటూ మా ప్లేట్స్ ను లాక్కున్నారు. ఒకపక్క ఆకలి నకనకలాడుతూ ఉంటే మరో ప్రక్క పని చెయ్యడం ఏమిటో అర్థం కాలేదు.
ముందుగా పెద్దవారికి వడ్డించాలి, అది మీరే చెయ్యాలి అంటూ ఆంటీ మమ్మల్ని ముందుకు నెట్టారు.
ఇక తప్పదు అనుకుంటూ మేం సర్వింగ్ స్టార్ట్ చేశాం. వయసైన వాళ్ళు చైర్స్ లో కూర్చొని తింటున్నారు. ప్రోగ్రాంకి పెద్దగా ఉన్న అతను పర్యవేక్షిస్తున్నాడు.
మా ఆంటీ కూడా అక్కడ కమిటీ మెంబెర్ లా కనిపించింది. నేను సర్వ్ చేస్తూ సాయిబాబా కోసం వేసిన చైర్ వైపు చూస్తున్నాను. ఆ చైర్ ముందు పెట్టిన ప్రసాదం, పళ్ళు పలహారాలు సాయిబాబా వచ్చి తింటాడేమో… ఇక సాయిబాబా రాడని తెలిసినా ఏదో ఒక వింత జరుగుతుందేమో అన్న ఇంట్రెస్ట్…
మా సర్వ్ పూర్తి అయ్యింది. పెద్దవారు అందరూ తినడం ముగిసింది. మా అంటీ కోసం చూశాను. ఆంటీ తినకుండా మా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక చివరి రౌండ్ లో ఆకలికి మిగిలినవి ఏదీ వదలకుండా ఖాళీ చేసేశాం. అప్పటికే టైం సాయంత్రం నాలుగు అయ్యింది.
ఆంటీకి చెప్పి ఇంటికి బయలుదేరాం. ఆదివారం హాయిగా క్రికెట్ ఆడుకుంటూ గడపాల్సిన సమయం పొద్దున్న నుండి సాయంత్రం వరకు స్కూల్ లో భజనలో గడపడం ఎందుకో నచ్చలేదు. ఇల్లు చేరగానే మా బ్రదర్ వాళ్ళ ఫ్రండ్స్ తో క్రికెట్ ఆడి ఇల్లు చేరాడు. వాడిని చూడగానే నా కడుపు మండిపోయింది…
వాడిని ఏమీ అనలేక అప్పటికే దూరదర్సన్ లో తెలుగు సినిమా స్టార్ట్ అవ్వడంతో టీవీ చూడ్డంలో బిజీ అయిపోయాను…

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY