“పలకరింపులు ఎందుకు …అరెస్ట్ చేయడానికేగా..వచ్చింది …హౌ అర్ యు సుగాత్రి …కాస్త రంగు తేలారు…మీ ఆల్చిప్పల కళ్ళు బావుంటాయి” …ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (06-05-2018)

                                          (7)
అరగంట నుంచి మిస్టర్ అనే దయాళ్ టీవీలో వచ్చే ఇంటర్వ్యూ చూస్తున్నాడు.ఎన్నో క్రిమినల్ ఆలోచనలతో నిండి వున్న దయాళ్ బుర్ర ఒక్కక్షణం పనిచేయడం మానేసిన ఫీలింగ్ కలిగింది.డిటెక్టివ్ సిద్దార్థ ఏంచెబుతున్నాడో అర్థం కావడం లేదు.అతను సిద్ధార్థను తక్కువగా అంచనా వేయడం లేదు.ఎందుకంటే సిద్దార్థ గురించి అతనికి బాగా తెలుసు.గతంలో సిద్దార్థ చేతిలో చావుదెబ్బ తిన్నాడు.అతడిని తక్కువగా అంచనా వేసుకున్నందుకు నలుగురు అనుచరులను కోల్పోయాడు.
మెరుపులా మెరుస్తాడు..పిడుగులా భయపెడుతాడు…ఎప్పుడే క్షణం ఎలా ఎటాక్ చేస్తాడో తెలియదు.అలాంటి సిద్దార్థ టీవీలో పానీపూరి గురించి ,సినిమాలో హీరోవేషం గురించి మాట్లాడుతుంటే నమ్మ బుద్ధి కావడం లేదు.
డిటెక్టివ్ సిద్దార్థ ఎందుకు వచ్చాడో దయాళ్ కు తెలుసు…కానీ సిద్దార్థ ఎందుకిలా చేస్తున్నాడో తెలియడంలేదు.
అందుకే సిద్ధార్థను ఏంచేయాలో డిసైడ్ అయ్యాడు.
అతని అనుచరులు టీవీ స్టూడియో ముందు మోహరించారు.
                            ***
డిటెక్టివ్ సిద్దార్థ ఆవులిస్తూ యాంకర్ వైపు చూసి “నిద్రొస్తుంది  ..ఇఫ్ యు డోంట్ మైండ్ …మీరు లాంగ్ బ్రేకిచ్చినా సరే..షార్ట్ బ్రేక్ ఇచ్చిన సరే..నేను కాస్త పడుకోవాలి”అన్నాడు 
యాంకర్ షాకైంది.ఆమె ఇలాంటి ఇంటర్వ్యూ ను ఫస్ట్  టైం చూస్తుంది..చేస్తుంది.అందులోనూ లైవ్….ప్రోగ్రామ్ ఇంచార్జ్ కు సీన్ అర్థమైంది..లైవ్ ముగించేయడమే కరెక్ట్ అనుకున్నాడు.
                                       ***
 సిద్దార్థ బయటకు రాగానే సుగాత్రి ఎలర్ట్ అయ్యింది.అప్పటికే ఆమెకు సమాచారం వచ్చింది.టీవీ స్టూడియో ముందు రెండు పోలీస్ వెహికల్స్ వచ్చి ఆగాయి.
సిద్దార్థ మీద ఎటాక్ చేయడానికి  వచ్చిన దయాళ్ మనుష్యులు పోలీసులు రావడంతో ఆగిపోయారు…పోలీసులు టీవీ స్టూడియో దగ్గరికి వస్తారని వాళ్ళు ఊహించలేదు.
సుగాత్రి సిద్దార్థ దగ్గరికి వెళ్లి “హలో “అంది
“పలకరింపులు ఎందుకు …అరెస్ట్ చేయడానికేగా..వచ్చింది …హౌ అర్ యు సుగాత్రి …కాస్త రంగు తేలారు…మీ ఆల్చిప్పల కళ్ళు బావుంటాయి” నవ్వుతూ అన్నాడు సిద్దార్థ.
నవ్వును అతి కష్టంమీద ఆపుకుంది.కోపాన్ని నటిస్తూ
“మీరు ఒక సిబిఐ ఆఫీసర్ తో మాట్లాడుతున్నారు.మైండ్ ఇట్ “అంది
“ఏ …సిబిఐ ఆఫీసర్స్ పెళ్లిళ్లు చేసుకోరా..కాపురాలు చేసుకోరా?”నవ్వుతూ అన్నాడు సిద్దార్థ 
జేమ్స్ అలానే చూస్తుండిపోయాడు.
సిద్దార్థ జేమ్స్ వైపు చూసి”వాట్ భయ్యా..నువ్విక్కడికి వచ్చావ్…కొంపదీసి నిన్ను కూడా యు అర్ అండర్ అరెస్ట్”అన్నదా? అడిగాడు.
“లేదులేదు “అయోమయంగా కంగారుగా అన్నాడు
“ఓకే జేమ్స్ మళ్ళీ కలుద్దాం.మేడం అరెస్ట్ చేసుకోవాలని ముచ్చటపడుతున్నారు…”అంటూ ముందుకు నడిచాడు.
సిద్దార్థ పక్కనే సుగాత్రి నడుస్తుంది.జేమ్స్ కు ఆ దృశ్యం సిద్ధార్థను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టు అనిపించలేదు..,పెళ్లయ్యాక భర్త పక్కనే నడుస్తున్నట్టు వుంది.
సిద్దార్థ నడుస్తూనే వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపించాడు..
“సారీ మిస్టర్ డి …ఈసారి నిన్ను డిస్సపాయింట్ చేసినట్టున్నాను…అన్నట్టు…మిస్టర్ డి  …పానీపూరి సూపర్బ్ “
మాఫియా కింగ్ దయాళ్ కు పంపించిన మెసేజ్ అది.
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY