సమస్తసృష్టికి ప్రణామం…ప్రకృతిని ప్రకృతిలోని ప్రాణులను ప్రేమించండి.వాటి ఉనికిని కాపాడండి….డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్

దేవుడు సృష్టించిన సృస్డ్త్రిలో మనం ..మనుష్యులం మాత్రమే మాట్లాడగలం..ఆలోచించగలం..మన ఎమోషన్స్ ను ప్రదర్శించసాగాం. పక్షులు చెట్లుచేమలూ నదులు పర్వతాలు సమస్త జంతుజాలం ఈ సృష్టిలో ఒక భాగం..ప్రకృతి అందాలకు ప్రత్యక్షసాక్ష్యం.కనువిందు చేసే పర్వతశ్రేణులు జలపాతాలు …ఉదయాన్నే కువకువల కూజితాలు వినిపించే కోయిలలు …హరిణిలు నెమళ్ళు కుందేళ్లు
సీతాకోక చిలుకలు రివ్వున ఎగిరిపక్షులు
మృగరాజులు పులులు క్రూరమృగాలు సింహగర్జనలు …
ఇవ్వన్నీ సృష్టిలో ఒక భాగం..ప్రకృతి అందాలకు అద్దిన దేవుడిసృష్టిలోని దేవరహస్యం
మనం మన గురించే పట్టించుకోక డబ్బు కోసం కెరీర్ కోసం బిజీ లైఫ్ లతో గజిబిజిగా బ్రతికేస్తున్నాం.
ప్రకృతిని విస్మరిస్తున్నాం.కృతిమ అందాలతో బ్రతికేస్తున్నాం.ఒక ప్లాస్టిక్ పువ్వు కన్నా పెరట్లోని సన్నజాజి పరిమళం ఎంత బావుంటుంది.
పచ్చని పంటచేలు
జలపాతాలు పశుపక్ష్యాదులు మనకళ్ళ ముందు వున్నా మనం వాటిని పట్టించుకోవడం లేదు.
వాయుకాలుష్యం, వాతావరణ కాలుష్యం,శబ్దకాలుష్యం..చివరికి మనమే కాలుష్యమైన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం.
ఎక్కడో జంతుప్రేమికులు
ఎక్కడో ప్రకృతి ఆరాధకులు
మనం ఏం చేస్తున్నాం…వాతావరణ కాలుష్యంతో అరుదైన జంతువులు హరించిపోతాయి.
అడవుల నరికివేతతో వర్షాభావం ఉష్టతాపం …
ఒక్కక్షణం ఆలోచిద్దాం.నోరులేని పక్షులతో స్నేహం చేద్దాం .
కంటికి కనువిందు చేసే ప్రకృతితో చేయి కలుపుదాం
మనల్ని మనం కాపాడుకుందాం
భవిష్యత్తుకు అందమైన ప్రకృతిని వారసత్వ సంపదగా అందిద్దాం.
మొక్కలను పెంచుకుందాం..చల్లటి సహజమైన గాలిని ప్రాణవాయువుగా స్వీకరిద్దాం.
అరుదైన ప్రకృతి ప్రాణులను కాపాడుకుందాం.
ప్రకృతి కూడా ఒక ప్రాణే అని..ప్రకృతి మన నేస్తం అని మైత్రీభావాన్ని చాటుదాం.
ప్రకృతిని ప్రకృతిలోని ప్రాణులను ప్రేమిస్తూ కాపాడుతూ ముందుతరాలకు ఈ ఆలోచనను అందించే ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు .

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY