ఇది పరీక్షాకాలం…సానుకూల దృక్పథమే మీ విజయం .. డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్(04-03-2020)

పరీక్షల హడావుడి,తల్లిదండ్రుల ఆదుర్ధా,పాఠశాలల్లో, ళాశాలల్లో వేగం…వెరసి పరీక్షలను ఒక యుద్ధంలా చూపించే ప్రయత్నం.
పరీక్షలంటే శిక్షలు కాదు..మనం చదువులో నేర్చుకున్న పాఠాలకు ఒక నివేదిక.
మన జ్ఞాపకశక్తికి చదువుపట్ల వున్న మన శ్రద్ధకు ప్రోగ్రెస్ రిపోర్ట్.మన భవిష్యత్తుకు ఒక మెట్టు..
పరిక్షల భయంతో కృంగిపోవడం వద్దు.పరీక్షలను తలుచుకుని ఆత్మహత్యాప్రయత్నాలు చేయవద్దు
పరీక్షలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి.అడ్వాన్స్డ్ పరీక్షలు ఉంటాయి.
కానీ జీవితం ఒక్కటే…మీ జీవితం మీద …ఒక కుటుంబం ఎన్నో బంధాలు అనుబంధాలు ఉంటాయి.
అందుకే …
డియర్ స్టూడెంట్స్…భయం వదిలిపెట్టండి.మీరు చదువుకున్న పాఠాల్లోనే ప్రశ్నలే వస్తాయి.ఆ పాఠాలు మీకు గుణపాఠాలు.భవిష్యత్తుకు వెలుగుదీపాలు.
ఎటువంటి ఒత్తిడి లేకుండా చదవండి.టెన్షన్ తో పరీక్షహాలులోకి అడుగుపెట్టకండి.ముందుగా మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.తెలియనివాటి గురించి తరువాత ఆలోచించండి
నిన్నటి పరీక్ష గురించి ఆలోచన వదిలి నేటి పరీక్ష మీదే దృష్టి పెట్టండి.
పరీక్షలని తెల్లవార్లూ మేలుకుని బట్టీపట్టే పద్దతికి స్వస్తి చెప్పి ప్రశాంతంగా చదువుకోండి.
ఈసారి జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా చూసుకోండి.విజయం మీదే.
డియర్ పేరెంట్స్..
పరీక్షలని తెల్లవార్లూ మీ పిల్లలతో చదివించకండి
ప్రతిక్షణం ” ఇది నీ భవిష్యత్తు” అంటూ వారిని ఎమోషనల్ గా భయపెట్టకండి.
వారికి ధైర్యం చెప్పండి.వారు చదువుకునేప్పుడు పక్కనే వుండండి.
పరీక్షలు రాసివచ్చాక ” ఎలా రాసావు..ఏం రాశావని ? అడగకుండా మరుసటిరోజు పరీక్షకు సిద్ధం చేయండి.
మీరు చెప్పే ధైర్యమే వారికీ కొండంత అండ..అన్న విషయం మర్చిపోకండి.
డియర్ టీచర్స్..
మీ స్టూడెంత్స్ కు మీరే ధైర్యం.వారిని ర్యాంకుల పేరుతో ఒత్తడి చేయకండి.
విద్యార్థుల్లోని స్ట్రెస్ ( ఒత్తిడినిని ) ఎప్పటికప్పుడు గమనించండి.
వారికి సులభంగా అర్ధమయ్యే రీతిలో చెప్పండి.
తల్లిదండ్రుల తరువాత అంత గొప్పస్థానం మీదే.మీ పిల్లల ( విద్యార్థుల) టెన్షన్ తగ్గించి వారిని సానుకూల దృక్పథం వైపు నడిపించండి.
కంబైన్డ్ స్టడీ..ప్రోత్సహించండి.ఒకరికొకరు చెప్పుకునేలా చుడండి.ర్థంకాని పాఠాలను మరోసరి అర్థమయ్యేవరకు చెప్పండి.
విద్యార్థులకు మీరు ఉపాధ్యాయులే కాదు..వారికీ దిశానిర్ధేశం చేసే గైడ్స్ కూడా మీరే అన్న విషయం మర్చిపోకండి.
అల్ ది బెస్ట్

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY