అంతిమ యుద్ధం మొదలైంది.వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ డెత్ సెంటెన్స్ (24-07-2016)

26
నేరాలు చేసే నేరస్థులను క్షమించే అలవాటు లేని అనిరుద్రకు ఆ క్షణం ఎర్విక్ నేరస్థురాలిలా అనిపించలేదు..కనిపించలేదు.
ఎందుకంటే ఎర్విక్ నేరం చేస్తుందని అనుకోవడం లేదు..నేరస్థులను చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని శిక్షిస్తుంది.
అందుకే ఎర్విక్ ను పట్టుకోవాలని అనుకుంటున్నాడు.
***
బ్లాక్ జీన్స్ బ్లాక్ టీ షీర్ట్ వేసుకుంది.ఆమె చేతిలో రివాల్వర్ నాగుపాములా బుసలుకొడుతున్నట్టు ఉంది.ర్వీక్ మనసులో ఎలాంటి ఆలోచన వుందో గెస్ చేయలేకపోతున్నాడు సమీర్.సముద్రం లోతును ,స్త్రీ మనసునూ అర్థం చేసుకోవడం తెలుసుకోవడం చాలా కష్టమని ఎక్కడో చదివిన విషయం జ్ఞాపకానికి వచ్చింది.
ఇప్పుడు ఎర్విక్ మనసు..నిండా….చెల్లెలి మీద ప్రేమతో,చెల్లెలిని చంపినవారి మీద పగతో నిండి ఉంది.ప్రతీకారమనే సముద్రం ఏ క్షణమైనా సునామీలా విరుచుకు పడవచ్చు.
ఇది అంతిమ యుద్ధం…మంచికీ చెడుకు…
మమతానురాగాల పాశాలతో తపించే ఒక అక్కఆ చెల్లిని చంపిన వారి కుత్తుకలు తెగనరకాలనుకునే ఒక అపర కాళిక…మొదలు పెట్టిన యుద్ధం…
“పదండి సమీర్…ఈ యుద్ధానికి మీరే రథసారథి…ఇన్నాళ్లూ నా వెంట వున్నారు..ఇప్పుడు ఈ యుద్ధం చివరి ఘట్టంలో నాతో కలిసి వస్తున్నారు…మరణమే..మన వెంట నడుస్తుంది…”అంది వచ్చే సన్నటి కన్నీటి చెమ్మను స్పృశిస్తూ…
సమీర్ ముందుకు నడిచాడు.
“ఒక క్షణం “అంది ఎర్విక్.
సమీర్ ఆగడు..ఏమిటన్నట్టు చూసాడు.
అలాగే అతని వెనగ్గా వెళ్లి గట్టిగా అతడిని హత్తుకుంది.గాలి కూడా చొరబడనంత గట్టిగా…
“మరో కాసేపటిలో అంతిమ యుద్ధం మొదలు అవుతుంది.నేనేమైపోతానో నాకే తెలియదు..ఒకవేళ ఈ యుద్జంలో నేను గెలిచి ,హంతకురాలిగా జైలుకు వెళ్లినా మీ జ్ఞాపకాలు ఇలా స్పర్శ రూపంలో నాతో పదిలంగా ఉండాలి…
ఒకవేళ నేను ఈ యుద్ధంలో చచ్చినా…మృతువుతో పాటు ఈ స్పర్శ నాతో వస్తుంది..
ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు..అతని పెదవులు ఆమె హృదయంతో మాట్లాడాయి.
***
ఒకసారి ఆ ఇంటిని తదేకంగా చూసింది ఎర్విక్.
ఇక్కడే తన చెల్లెలు తిరిగింది.చెల్లెలి జ్ఞాపకాలు ఆమెను కదిలిస్తున్నాయి.చెల్లెలి మరణం ఆమెలో ప్రతీకారేచ్ఛను రగిలిస్తుంది.ఇద్దరూ బయటకు వస్తుండగా…గుమ్మానికి అడ్డంగా చేతిలో రివాల్వర్ తో ముఖర్జీ…
ఊహించని ఈ పరిణామానికి ఒక్కక్షణం షాకై తేరుకుంటూ..రివాల్వర్ బయటకు తీయబోయింది.
“మీకా రివాల్వర్ అవసరం లేదు మిస్ ఎర్విక్..నేను మిమ్మల్ని చమ్పాడానికి రాలేదు..మీ చేతిలో చావడానికి వచ్చాను…మీ చేత్తో ఆ విక్కీని చంపించడానికి వచ్చాను…”ముఖర్జీ మాటలు విని షాకయ్యాడు సమీర్.
లోపలికి వచ్చాడు ముఖర్జీ.ఎర్విక్ ముందు ఇలబడ్డాడు.రివాల్వర్ ఎర్విక్ తన కణతకు గురి పెట్టుకున్నాడు.
“సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుంటే ఆత్మహత అవుతుంది.మీరు మీ రివాల్వర్ తో చంపితే హత్య అవుతుంది,నేను చావు మీద భయంతో ఆత్మహత్య చేసుకోవడానికి రాలేదు..నా మీద నాకే అసహ్యం వేసి చావాలని నిర్ణయించుకున్నాను.నా వల్ల పోలీస్ అనే పదానికి కళంకం రాకూడని నిర్ణయించుకున్నాను…ఎందుకంటే..
నేను విక్కీకి ఎన్నో నేరాల్లో సాయం చేసాను.నా వృత్తికి అన్యాయం చేసాను.అలాంటి నన్ను వాచ్ మేన్ అన్నాడు..అతడికీ నాకూ తేడా లేదన్నాడు..
అంత కన్నా ఘోరంగా నన్ను వీధిలో పిచ్చిపట్టిన కుక్కతో…”మాట్లాడలేకపోయాడు ముఖర్జీ….ఒక నేరస్తుడి డబ్బుకు అతను చూపించే ప్రలోభాలకు లొంగిపోతే ఒక నిఖార్సైన పోలీస్ బ్రతుకు ఎంత హీనంగా ఉంటుందో తెలిసింది…వాడికి నేను సాయం చేస్తే..చివరికి తన స్వార్థం కోసం..మిమ్మల్ని కేసులో ఇరికించడం కోసం తానే నన్ను చంపించి ,ఆ నేరాన్ని మీ మీద తోసేయాలని ప్రయత్నించాడు.అందుకే అతడికి బుద్ధి చెప్పాలి..అతడికి శిక్ష పడాలి..నా పాపాలకు పరిహారం చేసుకోవాలి…”
ముఖర్జీ చేతి చూపుడు వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది.
చావుకు వెంట్రుకవాసి దూరంలో వున్నాడు.
ఎర్విక్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు.అతని చేతిలోని రివాల్వర్ లాగేసింది.
“మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం అంటే మీ తప్పును మీరు తెలుసుకున్నారని అర్థం.మీరు వెళ్లిపోండి..కనీసం ఇప్పటి నుంచైనా మీరు మీ డ్యూటీని మాత్రమే చేయండి .అమాయకులిని మీ దగ్గరికి సాయం చేయమని వచ్చిన వారిని కాపాడకపోయినా పర్వాలేదు.కానీ విక్కీలాంటి వాళ్లకు మీ అధికారబలాన్ని తాకట్టు పెట్టకండి.”రెండు చేతులు జోడించి చెప్పింది ఎర్విక్.
అలానే చూస్తోండిపోయాడు ముఖర్జీ..
“క్షమాగుణం కూడా బాధిస్తోందా..?నాకు గుండెలో నొప్పిగా ఉంది మేడం..ఇది పశ్చాత్తాపంతో వచ్చిన పెయిన్…పోలీస్ అనే పదానికి ఎప్పుడూ తలవంపు తీసుకురాను…చెప్పండి మేడం ఈ పోలీస్ మీకు ఏ విధంగా సాయం చేయగలడు? సిన్సియర్ గా అడిగాడు ముఖర్జీ.
ఒక మనిషి మారడానికి లాజిక్ లు అవసరం లేదు.ఆ మనిషిలో మారాలనే కాంక్ష బలంగా ఉంటే చాలు.
తనకు తాను ఆలోచించుకుని మారాలనుకుంటే ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది.
***
“విక్కీ ఇప్పుడు ఎక్కడున్నాడు? సూటిగా అడిగింది ఎర్విక్.
“మరో అరగంటలో ఎయిర్ పోర్ట్ కు వెళ్తాడు.రెండు వెహికిల్స్ లో బయల్దేరుతారు.ఒక వెహికిల్ లో విక్కీతో పాటు ఒక ఇంటర్ నేషనల్ క్రైమ్ సిండికేట్ వెళ్తుంది.ఆ వెహికిలోనే డీల్ జరుగుతుంది.వెనుకనే మరో వెహికిల్.అందులో ఈ మధ్య కిడ్నప్ కు గురైన అమ్మాయిలు వున్నారు.వారిని బలవంతంగా విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడు.మళ్లకు మత్తు ఇచ్చి పేషేంట్స్ గా నమ్మిస్తాడు…తర్వాత తన డబ్బును అధికారాన్ని వెదజల్లుతాడు.నాలాంటి లోఫర్స్ అమ్ముడుపోతారు..”బాధగా చెప్పాడు ముఖర్జీ.
“ఒక అయితే మీరు నాకో పేవర్ చేయాలి..చేయగలరా?
“ఆజ్ఞాపించండి…”రుద్దమైన కంఠంతో అన్నాడు.పశ్చాత్తాపం ఇంత ఆనందాన్ని ఇస్తుందా?ఒక మంచి పనిలో ఇంత సంతృప్తి ఉంటుందా?
ఏం చేయాలో చెప్పసాగింది.అంతా విని మొదటిసారిగా గర్వంగా తన హ్యాట్ ను సరిగా పోసిషన్ లో పెట్టుకుని స్టిఫ్ గా నిలబడి
సెల్యూట్ చేసాడు…
ఆ సెల్యూట్ ధర్మాన్ని కాపాడి చట్టాన్ని రక్షించాలనుకునే ఎర్విక్ సదాశయానికి.
తనను విక్కీ కార్నర్ చేస్తున్నాడని చెప్పిన శ్యామ్యూల్ కు.మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.శ్యామ్యూల్ ద్వారా అనిరుద్రే తనను సేవ్ చేసిన విషయం ముఖర్జీకి తెలియదు.
ఇప్పుడు అతనికి తెలిసింది తన డ్యూటీని సరిగ్గా చేయడం..ఎర్విక్ చెప్పినట్టు చేయడం..ఈ రెండూ ఒక్కటే.
ముఖర్జీ వెళ్ళిపోయాడు..అతనిలోని విలన్ చచ్చిపోయాడు.అతనిలోని పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేయడానికి బయల్దేరాడు.
ముఖర్జీ వెళ్ళిపోగానే కృష్ణస్వామి వచ్చాడు.
ఎర్విక్ అతని ముందు నిలబడి రెండు చేతులు జోడించింది.
“ఈ ధర్మయుద్ధంలో నా వెంట వున్న భీష్మాచార్యులు మీరు…మీ సాయమే లేకపోతే నేను ఈ యుద్ధంలో గెలిచేదానిని కాదు… “
“నేను భీష్ముడిని…కానీ నా వెనుక,మీ వెనుక మన వెనుక శ్రీకృష్ణుడు కూడా వున్నాడమ్మా”మనసులోనే అనుకున్నాడు కృష్ణస్వామి.
అదే సమయంలో ….
(డెత్ సెంటెన్స్ ముగింపు వచ్చేవారం )

పాఠకాదరణ స్వంతం చేసుకున్న డెత్ సెంటెన్స్ కినిగె ద్వారా ఆన్ లైన్ లో విడుదలైంది.ఈ నవలను రెంట్ కు తీసుకోవాలనుకున్నా,డౌన్ లోడ్ చేసుకోవాలనుకున్న ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

http://kinige.com/book/Death+Sentence

NO COMMENTS

LEAVE A REPLY