అది ఆనందమో… ఉద్వేగమో… తెలియని స్థితి…స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (02-10-2016)

“నువ్వు వస్తావని ఎక్స్ పెక్ట్ చేశాను. నీ ప్లానింగ్ కి నా హాట్స్ ఆఫ్… కాని ఇంత తొందరగా వస్తావని అనుకోలేదు” అన్నాడు భూపతి
“విదిశ ఎక్కడ?”
“ఓ… లవ్ కదూ… మరిచిపోయాను. ప్రేమికులను విడదీస్తే వచ్చే జన్మలో ప్రేమకు దూరం అవుతారంట… ఆ పాపం నాకెందుకు… చూస్తావా విదిశను?”
అగస్త్య మౌనంగా ఉన్నాడు
మనసులో ఏదో తెలియని సంఘర్షణ.
ఎన్నో రోజుల తరువాత విదిశను చూడబోతున్నాడు
అది ఆనందమో… ఉద్వేగమో… తెలియని స్థితి
తను ఎలా ఉంది… ఎలా ఉంటుంది నా ఎదబాటులో?
నాలానే తపిస్తూ ఉంటుందా?
విదిశ చాలా సున్నిత మనస్కురాలు కాని ధైర్యం ఎక్కువ.
ఎంత బాధ ఉన్నా ఒక్క బొట్టు కన్నీటి చుక్క రాలదు…
ఎంత కష్టమైనా తనలోనే దాచుకుంటుంది
“ఏం అగస్త్యా… మౌనంగా ఉన్నావు. తనను చూడాలని లేదా?”
తను మాట్లాడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియని అమాయకుడు కాదు
తన వీక్ పాయింట్ కోసం తనను టెస్ట్ చేస్తున్నాడు భూపతి.
ఏ మాత్రం తడబడినా మొదటికే మోసం వస్తుంది
“భూపతీ… నీకు ఏమి కావాలి”
“గుడ్.. పాయింట్ కి వచ్చావు.నాకు కావలసింది నీకు తెలుసు. అయినా చెప్తాను విను. గుహ్య బాషలో ఉన్న బుక్ నా వద్ద ఉంది. దాన్ని డీకోడ్ నువ్వే చెయ్యాలి.. చెయ్యగలవు… చేస్తావు కూడా” చివరి పదం ఒత్తి పలుకుతూ అన్నాడు భూపతి
“లేకుంటే ఫ్యూచర్ చెప్తాను విను. ఇది నా ప్లస్… నేను చెప్పిందే శాసనం. మీ ఆనవాలు కూడా ఎవరికీ దొరకకుండా చేసే కెపాసిటి ఉంది. నువ్వు చాలా స్మార్ట్. అంత దూరం తెచ్చుకోవని తెలుసు” అగస్త్య సమాధానం కోసం ఆగాడు భూపతి
“నేను విదిశను చూడాలి” స్థిరంగా అన్నాడు అగస్త్య
“విదిశను చూశాక నా పని చేస్తావన్న నమ్మకం?”
“అవసరం నీదే భూపతి… ఇన్ని విషయాలు తెలుసుకున్న వాడివి. నేను ప్రాణాలను లెక్క చెయ్యను అన్న విషయం కూడా నీకు తెలిసే ఉంటుంది. నన్ను చంపేస్తే నీకు ఉన్న ఒకే దారి పెర్మనెంట్ గా మూసుకుపోతుంది”
భూపతి అర్థం కానట్టు చూశాడు.
“ఆ బుక్ నేను మాత్రమే చదవగలను. నాకు మాత్రమే అందులోని స్క్రిప్ట్ కనపడుతుంది. అదీ కూడా విదిశ సమక్షంలోనే” కూల్ గా చెప్పాడు అగస్త్య
“తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తున్నావా?”
“భూపతి… యు హావ్ నో ఛాయస్… నేను చెప్పింది నమ్మడం తప్ప నీకు మరో మాగం లేదు”
“నీ ధైర్యానికి నా జోహార్… నా ప్లేస్ లో నన్నే డామినేట్ చెయ్యడం…”
అగస్త్య చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు భూపతి కడుపుమంటను మరింత పెంచింది
అగస్త్య పాకెట్ లోని మొబైల్ చిన్నగా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేసింది
నందనవర్మగారి మెసేజ్.
తను ఉన్న ప్లేస్ తెలిసిపోయింది. ఇక అగస్త్య గాంగ్ ఆలస్యం చెయ్యరు.
“విదిశ ఎక్కడ?” భూపతి ఆలోచనల్లో పడ్డం చూసి సూటిగా అడిగాడు.
భూపతి పరిస్థితి అటూ ఇటూ గాకుండా తయారయ్యింది
అగస్త్యకు సమాధానం చెప్పకుండా ఆ రూమ్ నుండి బయటకు వచ్చాడు
భూపతి రూమ్ బయట పచార్లు చెయ్యడం స్టార్ట్ చేశాడు
అగస్త్యకి విదిశను చూపించక తప్పదు. ఒక్కసారి ఇద్దరూ కలిస్తే ఇక ఆపే శక్తి ఎవరికీ ఉండదు
ప్రేమకు ఉండే శక్తి అసామాన్యం.
ఎంతటి పిరికివాడినైనా సింహంలా మార్చే మోస్ట్ పవర్ ఫుల్ వెపెన్.
ప్రేమకు ఎదురువెళ్ళిన మహా మహులే నామరూపాల్లేకుండా పోయారు
విదిశ తన కంట్రోల్ లో ఉన్నంతవరకే తనకు గ్రిప్ ఉంటుంది
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ )
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY