స్వాప్నిక మనసులో కసి మరింతపెరిగింది.దీనికంతటికీ కారణం వంశీకృష్ణే…అతడిని చంపేయాలి….వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (01-01-2017)

నూతన సంవత్సర శుభాకాంక్షలు
                                               (10)
హ్యాపీ న్యూ ఇయర్  వేడుకల్లో నగరం మునిగితేలుతోంది.తనగదిలో ఒంటరిగా కూచోని వుంది స్వాప్నిక.ఇంకా ఆమె షాక్ లో నుంచి కోలుకోలేదు.సినిమాలో తప్ప నిజజీవితంలో చూడలేదు.కళ్ళముందు మృత్యువు ఎలా ఉంటుందో కళ్ళరా చూసింది.ఒక్కక్షణం తనకు ఫోన్ రాకపోతే,మొబైల్ రింగ్ అవ్వకపోతే ఈ పాటికి తను చనిపోయి ఉండేది. 
స్వాప్నిక మనసులో కసి మరింతపెరిగింది.దీనికంతటికీ కారణం వంశీకృష్ణే…అతడిని చంపేయాలి.ఆమెలో పాతుకుపోయిన నిర్ణయం.
తన అన్నయ్యను చంపినవాడిని వదలకూడదు.ఆమెకు తన అన్నయ్య మరణం గుర్తుకువచ్చింది.తన అన్నయ్య చివరిచూపు గుర్తుకు వచ్చింది.తన అన్నయ్య ప్రాణాలుపోవడానికి కారణమైన నార్త్ అవెన్యూ గుర్తుకువచ్చింది.
గొప్పఉద్యోగం చేస్తానని ఢిల్లీ వెళ్లిన అన్నయ్య నార్త్ అవెన్యూ దగ్గర ఘోరమైన చావు చావడం గుర్తొచ్చింది.ఆ రోజు తనకు బాగా గుర్తు.హాస్పిటల్ నుంచి తాను ఇంటికి వస్తుంటే అన్నయ్య నుంచి ఫోన్…
                          ***
అక్టీవా స్టార్ట్ చేస్తుండగా ఫోన్.రింగయింది.డిస్ ప్లే మీద అన్నయ్య అన్నపేరు.వెంటనే సంతోషంతో ఓకే బటన్ ప్రెస్ చేసి “అన్నయ్య ఎక్కడున్నావ్?ఎలా వున్నావ్?సిటీ కి వచ్చావా?ప్రశ్నల వర్షం కురిపించింది.ఆమె ఆనందాన్ని ఆవిరి చేస్తూ చావుబ్రతుకుల మధ్య వున్నా అన్నయ్య గొంతు’స్వాప్నిక నువ్వు అర్జెంటు గా నార్త్ అవెన్యూ దగ్గరికి వచ్చేయ్…”అన్న మాటలు మాత్రమే ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. వెంటనే అక్టీవా ను నార్త్ అవెన్యూ వైపుకు పొనిచ్చింది.
                                                       ***
నార్త్ అవెన్యూ దగ్గరవున్న ఐరన్ ఫెన్సింగ్ దగ్గర రక్తపుమడుగులో అన్నయ్య.పరుగున వెళ్ళింది.
అన్నయ్య..తనతో …తనను ఎప్పుడూ కాలు కిందపెట్టనివ్వకుండా గుండెల మీదే పెంచిన అన్నయ్య.అమ్మెలా ఉంటుందో,నాన్నెలా ఉంటాడో తెలియదు…కానీ అన్నయ్య మాత్రం దేవుడిలా ఉంటాడని,కాదు దేవుడే తన అన్నయ్య అని అనుకునే అన్నయ్య ఆ దేవుడి దగ్గరికే వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు.
“ఏమిట్రా ఇదంతా?ఎలా జరిగింది?ఢిల్లీ వున్న నువ్వు ఇక్కడికెలా వచ్చావ్?ఏడుస్తోనే అడుగుతోంది.
“ఇప్పుడు మాట్లాడ్డానికి,నీప్రశ్నలకు చెప్పడానికి టైం లేదు స్వాప్నిక…నీ అన్నయ్య నువ్వు గర్వపడే పనే చేస్తాడు…నేను ఎక్కువసేపు బ్రతకను…నన్ను చంపినవా…”ఇంకా పూర్తి కాకుండానే తన జేబులో వున్న ఫోటో స్వాప్నిక చేతిలో పెట్టాడు..రక్తంతో  తడిసిన ఫోటో..
‘నన్ను నన్ను చంపినా వా..వా…”అంతకు మించి మాట్లాడలేకపోతున్నాడు..అతని తల పక్కకు వాలిపోయింది.
స్వాప్నిక డాక్టర్..పల్స్ చూసింది..అన్నయ్య చనిపోయాడు.అంబులెన్సు కోసం ఫోన్ చేసింది.సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదు.సిగ్నల్స్ కోసం పక్కకు వెళ్ళింది.లైన్ కలిసేసరికి పదినిమిషాలు పట్టింది.అంబులెన్సు కు ఫోన్ చేసి వచ్చేసరికి అన్నయ్య కనిపించలేదు. కానీ అక్కడ కొని ఫోటోలు కనిపించాయి.అన్ని ఫోటోల మీద రెడ్ కలర్ తో అంటూ మార్క్ పెట్టబడివుంది.చివరగా అన్నయ్య ఫోటో మీద కూడా…
మొత్తం గాలించింది అన్నయ్య శవం కనిపించలేదు.ఆమెకు ఒక్కటే అర్థమైంది.
అన్నయ్య తన చేతిలో పెట్టిన ఫోటో వంక చూసింది.అతని గురించే అన్నయ్య చెప్పాడు.అతడే తనమీద హత్యాప్రయత్నం చేసాడని అన్నయ్య చెప్పడానికి ప్రయత్నించాడు.
ఆమెకు నార్త్ అవెన్యూ గురించి,దాని మిస్టరీ గురించి తెలుసు…అన్నయ్యను చంపి,మృతదేహాన్ని కూడా మాయం చేసింది ఆ ఫొటోలోని వ్యక్తేనని భావించింది.
అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
అసలు అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు?అన్నయ్య మరణం గురించి పోలీసులకు తెలియజేయాలి..అని అనుకోలేదు.
బాధ ఆవేశం ఆమెను మరింకేమీ ఆలోచించనీయలేదు.
అన్నయ్య చనిపోయి స్థలానికి కాసింత దూరంలో రివాల్వర్ కనిపించింది.దాన్ని తీసుకుంది.అన్నయ్య  చావుకు కారణమైన వ్యక్తిని చంపాలి..అయితే ఆ వ్యక్తి విషయంలో పొరపడింది.అన్నయ్య ఇచ్చిన ఫొటోలోని వ్యక్తిని తన అన్నయ్యను చంపిన వ్యక్తిగా భావించింది.
ఆ ఫొటోలోని వ్యక్తి అనిరుద్ర.
                                                   ***
యాదృశ్చికంగా అనిరుద్ర ఆమెకు తారసపడ్డాడు. బేకరీలో నుంచి కారుదగ్గరికి వస్తోన్న అనిరుద్రను చూసింది.గుర్తుపట్టింది.ఎపుడూ హ్యాండ్ బ్యాగులో రివాల్వర్ పెట్టుకుని అన్నయ్యను చంపినవాడు దొరికితే చంపేయాలన్న ఆలోచన కోల్పోయిన ఆవేశంలో వున్న స్వాప్నిక షూట్ చేసింది.ఆమె ప్రొఫషనల్ కాదు..బులెట్ అనిరుద్ర చెవిని రాసుకుంటూ వెళ్ళింది.వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది.ఆ తర్వాత అతడిని ఫాలో అయ్యింది.అతను ఎక్కడుంటాడో తెలుసుకుంది.అతని పేరు వంశీకృష్ణ అని అతడి డ్రైవర్ ద్వారా తెలుసుకుంది.
పోలీసుల  ద్వారా అతడిని ఇరుకున పెట్టాలనుకుంది.కుదర్లేదు.హత్యాప్రయత్నం కేసు పెట్టింది.కానీ తిరగబడింది.అతడు నార్త్ అవెన్యూ ప్రాంతంలోనే ఆక్సిడెంట్ కు గురయ్యాడంటే ఖచ్చితంగా అతనికి నార్త్ అవెన్యూ మిస్టరీ కి సంబంధం వుండే ఉంటుంది.తన అన్నయ్యను చంపింది కూడా అతడే అయివుంటాడు.
ఈ రాత్రికే అతడిని చంపాలి..అనుకుంది.
అయితే స్వాప్నిక తనని చంపాలని అనుకుంటుంది,చంపేప్రయత్నం చేస్తుందని  తెలుసు..స్వాప్నిక అన్నయ చనిపోయిన విషయమూ తెలుసు..కానీ స్వాప్నికకే చాలా విషయాలు తెలియవు.
                                                  ***
ఆ రాత్రి హాస్పిటల్ లోకి సీక్రెట్ గా ప్రవేశించింది స్వాప్నిక.ఇప్పుడు డాక్టర్ గెటప్ లో వుంది.ఆమె డాక్టర్ కావడం వాళ్ళ డాక్టర్ గా నటించడం పెద్ద కష్టం కాదు.ఐసీయూలోకి వచ్చింది.బెడ్ మీద వున్నాడు అనిరుద్ర..అతడిని ఎలా చంపాలో ముందే డిసైడ్ అయ్యింది.
అతని దగ్గరికి వచింది.
సరిగా కోమాలో వున్న కోమాలో ఉన్నట్టు నటిస్తోన్న అనిరుద్ర మెల్లిగా కళ్లుతెరిచి చూసాడు.
                                              ***
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY