నలుగురు పట్టేంత పెద్ద మంచం…ఆ మంచంమీద ఆ ఇద్దరూ…ఇద్దరి మధ్య మరో ఇద్దరు దూరేంత దూరం.వాళ్ళు కోల్పోతున్నదేమిటి?వాళ్ళు పెళ్ళిద్వారా కోరుకున్నదేమిటి ?ఆమె అతడికి అర్థమవుతుందా ?అతను ఆమెకు అర్థం చేసుకుంటాడా? దంపతుల పడగ్గదిలో వుండవలిసిన రొమాంటిక్ ఫ్లేవర్ విజయార్కె “గుడ్ నైట్ స్టోరీస్”

ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ …నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే…
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునే పాత్రలు సన్నివేశాలు సంఘటనలు అనుభవాలు అనుభూతులు మీ పరం చేసే అక్షరస్వరాల కథలు ఇవి.
                                         ***
కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి సిద్ధంగా ఉండం…కొన్ని విషయాలు మనం పట్టించుకోము.కొన్నివిషయాలు మనం చర్చుకోము.
ఎందుకంటే ఇది దంపతుల ఆంతరంగిక ప్రపంచంలో జరుగుతోన్న చుట్టుముట్టిన దావానలం ….యుద్ధం…అలజడి…
ఉదయమంతా/వారమంతా … అలిసిపోయిన దంపతులు రాత్రికాగానే మంచం మీద నడుం వాలుస్తారు.అలసట తీరిపోవడానికి విహారయాత్రలకు వెళ్లినా వీకెండ్స్ ఎంజాయ్ చేసినా పబ్స్ కు వెళ్లినా తిరిగి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చినా నిద్ర మనల్ని ఆహ్వానిస్తుంది.అలసట మనం నిద్రపోయేలా చేస్తుంది.
మరి భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని గుర్తుచేసే మధురోహలు…అవికూడా నిద్రలోకి జారుకుంటాయా?
భార్యాభర్తల బంధానికి పునాదివేసే దాంపత్యసంబంధం ఏ సంబంధం లేనట్టు నిర్లిప్తంగా ఉంటుందా?
భార్యాభర్తల మధ్య వుండే ఎమోషనల్ బాండ్,ఫిజికల్ అటాచ్మెంట్ ఏమవుతుంది?
మనల్ని ఆలోచింపజేస్తూ రాసిన రొమాంటిక్ స్టోరీస్ ..భార్యాభర్తలు ఓ వెన్నెలకురిసే రాత్రి,ప్లజెంట్ మూడ్ లో చదువుకోదగిన కథలు.
ప్రముఖరచయిత విజయార్కె ప్రముఖపత్రికల్లో (స్వాతి,ఆంధ్రజ్యోతి(నవ్య)చెలిమి,) రాసిన ఈ పుస్తకం గురించి  ఇలా అంటున్నారు.
“ఒంటరితనం మనం ఆహ్వానించకపోయినా అనుకోని అతిథిలా,ప్రియమైన శత్రువులా వచ్చినప్పుడు నేనున్నానంటూ ఓ ఆత్మీయస్పర్శ మిమ్మల్ని చుట్టేస్తే…?ఒక గొప్ప అనుభూతి మీ వెన్నంటి ఉంటుంది.
ఉదయం లేచింది మొదలు రాత్రివరకూ కెరీర్, వర్క్.టెన్షన్స్…ఉరుకులు పరుగులు స్వదేశంలో వున్నా,విదేశాల్లో వున్నా.కరెన్సీ ఏదైనా,యాంత్రికమైన జీవితమే…
మీకిష్టమైన లైఫ్ ను లీడ్ చేయడానికి,మీ కలలను నిజం చేసుకోవడానికి ,మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ..మీ జీవితంలోని సగభాగం…ఉదయం నుంచి రాత్రి వరకూ గడిపేస్తారు…
చీకటి ముసుగేసాక ధాత్రిని రాత్రి చుట్టుముట్టాక మీ ప్రపంచంలో మీరూ ,మీ జీవితభాగస్వామి….పడగ్గది మీ వ్యక్తిగత సామ్రాజ్యం.
ఆ సామ్రాజ్యంలో రాజు రాణి సైన్యమూ సర్వమూ సమస్తమూ మీరే.
ఫీలింగ్స్ ఎమోషన్స్ అనుభవాలు అనుభూతులు కలబోసిన కలర్ ఫుల్ రెయిన్ బో …
ఆ ఇంధ్రధనుసులో …
ప్రేమ ఇష్టం కోరిక స్పర్శ మాట అనుభవం అనుభూతి ..సప్తవర్ణాల ఇంధ్రధనుసులో చేరిన మరో వర్ణం రొమాంటిక్ ఫ్లేవర్ మీకు శుభరాత్రి చెబుతుంది.
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో…
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ …నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే…
మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునే పాత్రలు సన్నివేశాలు సంఘటనలు అనుభవాలు అనుభూతులు మీ పరం చేసే అక్షరస్వరాల కథలు ఇవి.
ప్రతీ రాత్రి ఈ కథలు చెప్పే కథలు వినండి.
ఈ పుస్తకంలోని చాలా కథలు స్వాతి పత్రికలో వచ్చినవే.రచయిత చేసే ప్రయోగాన్ని ఆదరించి,పాఠకులకు అందించే స్వాతి సంపాదకులకు సద కృతజ్ఞుడిని.దాదాపు యాభైకి పైగా స్వాతిలో నేను రాసిన సరసమైన కథలు ప్రచురించబడ్డాయి.అందులో కొన్ని కథలు ఇవి.
ఒక వెన్నెల రాత్రి,ఒకానొక వర్షం కురిసే రాత్రి…మీ పడగ్గదిలో అగరొత్తులు సన్నజాజులు నీలిరంగు బల్బు మధోరోహలు అన్నింటిని అనుసంధానించే స్పర్శతో పాటు గుడ్ నైట్ స్టోరీస్ కూడా ఉండాలి.మీ అనుభూతులను మీ గుండె గదుల్లో కథలుగా దాచుకోండి.
ప్రతీ అనుభవం ఒక అక్షరమై.
ప్రతీ అనుభూతి ఒక కథై..
ప్రతీ రాత్రి శుభరాత్రిగా మారాలి.
ఈ కథల ప్రపంచంలోకి మీ అనుభవాలను ఆహ్వానించండి.
ఈ పుస్తకం కినిగె ద్వారా విడుదలైంది.
గుడ్ నైట్ స్టోరీస్ కావాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి.

Free PDF Preview

http://preview.kinige.com/previews/7800/PreviewGoodnightStories36533.pdf

NO COMMENTS

LEAVE A REPLY