నాకు ఉద్యోగం అయినా రావాలి,లేదా నువ్వు జీవితాంతం నన్ను పోషిస్తానని బాండ్ పేపర్ మీద రాసి అయినా ఇవ్వాలి…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ&శ్రీమతి (30-04 -2017)

(3)

చరణ్ కు మాత్రం టెన్షన్ గా వుంది .మధ్యాహ్నం ఒంటి గంట దాటింది .ఎవ్వరూ కొన్న పాపాన పోలేదు. ప్రసాద్ ఓ ఐడియా ఇచ్చాడు.
వాళ్లకు డిమాన్స్ట్రేట్ చేసి చూపించు.అంతే పడిపోయి డజన్ల కొద్దీ సబ్బు బిళ్ళలు కొనేస్తారని చెప్పాడు .
ఇంతకీ మీరెవరు?అంది ఓవైపు భయంగా గుమ్మం వైపు చూస్తూ.
మీరేం కంగారు పడొద్దు.నేను సేల్స్ బాయ్ ని .మా తళతళ సబ్బు వాడితే మీ బట్టలు తళ తళ లాడుతాయి
“ఏది ఒక్క సారి బాత్ రూమ్ కి పదండి “.
కోపంగా చూసిందామె
“ప్రతి దానికి ఆ సీరియస్ ఎక్స్ ప్రెషన్ ఎందుకు చెప్పండి. మీరు బట్టలన్నీ ఇచ్చేయండి. అరగంటలో తళ తళ లాడిపోతాయి,”అంటూ చొరవగా లోపలి అడుగు పెట్టాడు
“మీరు ఆయన వచ్చాక రండి” ,అందావిడ భయంతో.
ఆయన వచ్చాక మీ బట్టల తళ తళ చూసి షాక్ అవుతారు. అంటూనే ”ఓసారి మీవారి లుంగీ ఇస్తారా?ఏమనుకోవద్దు …మీద బట్టలు ఉతికేతే అసహ్యంగా ఉంటుంది .
ఆమె ఎదో చెప్పబోఇంది.
”ఓహో ఇక్కడుందా బుజ్జిముండ…ఎంత బావుందో ?ఎక్కడ కొన్నారండి ఈ లుంగీని? అడిగాడు లుంగీ తీసుకుంటూ .
ఐదు నిమిషాల్లో లుంగీలోకి మారిపోయాడు.
ఆమెకు లోపల భయం భయంగా వుంది.అసలే తన మొగుడు అనుమానం మనిషి …ఏం చేయాలి?ఆలోచిస్తుంది ఈ లోగా ఆమె చీర,లంగా,జాకెట్టు బాత్రూం లోకి తీసికెళ్ళి బకెట్టు లో పెట్టి నీళ్లు పోసాడు .
” ఏమండి…నా మాట వినండి …ఆయనొస్తే బావుండదు” దైర్యం చేసి అంది తిక్కేశ్వర్ రావు భార్య శ్రీ లక్ష్మి.
సరిగ్గా అప్పుడే తుప్పుపట్టిన గన్ ని తీసుకొని అనుమానంగా లోపలి అడుగు పెట్టాడు. తిక్కేశ్వర్ రావు.
”ఏమండీ…నా మాట వినండి .ఆయనొస్తే బావుండదు” అన్న మాటలు వినిపించాయి.
కోపం లో గన్ ని గట్టిగా పట్టుకున్నాడు.
బాత్రూం దగ్గరికి వచ్చాడు .భార్య ఏదో మాట్లాడుతుంది..అతనేదో నవ్వుతూ చెబుతున్నారు .
లుంగీ పాకిస్థాన్ మ్యాపు లా చిరిగి పోయింది.
అది చూసి కెవ్వున కేకేసింది శ్రీలక్మి. ఉలిక్కిపడి గన్ ని కిందపడేశాడు తిక్కేశ్వర్ రావు.
”ఏంటే…ఆ లెవల్లో ”సౌండిచ్చి అరిచావ్ …అయినా నేను కెవ్వుమని అరవాలి?
అయినా…ఎవడే…ఎవడే వాడు ?చంపేస్తా …చెప్పవే …ఎవడే వాడు”అంటూ కిందబడ్డ గన్ ని తీసుకున్నాడు .
”సేల్స్ మెన్” చెప్పింది భయపడుతూనే శ్రీలక్మి .
”అంటే నేను క్యాబేజి చెవిలో పెట్టుకోకుండానే నువ్వు చెప్పింది నమ్మాలి”అంటూ చరణ్ వైపు ఎగాదిగా చూశాడు.
అతని దృష్టి చరణ్ కట్టుకున్న లుంగీ మీద పడింది.
”కెవ్వు మని కేక వేయడం ఈ సారి తిక్కేశ్వర్ రావు వంతైంది.ఉలిక్కి పడి చేతిలోని బక్కెట్టును జారవిడిచారు చరణ్.పెద్ద శబ్దం తో బక్కెట్టు కిందపడింది .
”మీరలా అరవడం ఏమి బాగాలేదు ,నేను హడలి చస్తున్నాను ”కోపంగా అన్నాడు చరణ్ .
”చావడం కాదురా…చంపేస్తాను ,పట్టపగలే నాఇంటికొచ్చి నాలుంగీ కట్టుకొని బాత్రూమ్ లో నా భార్య చీర ఉతుకుతూ…
ఓరేయి…నిన్నుతుప్పు పట్టిన గన్ తో చంపేస్తా…”అంటూ గన్ గురి పెట్టాడు.
బిత్తర పోయాడు చరణ్ .
”పారిపోండి…లేకపోతే అయన మిమ్మల్ని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు”అరిచింది భయంగా శ్రీలక్మి.
”ఏంటి…ఏంటి తల్లీ…నన్ను ‘పిట్ట’ని కాల్చినట్టు కాల్చేస్తాడా?”
”నీకేమైనా డౌటా?చూసుకో అంటూ ట్రిగ్గర్ నొక్కాడు,.
అంతే చరణ్ లుంగీ మీదే బయటికి పరుగెత్తాడు.వెనుకే తిక్కేశ్వర్రావ్
***
పగలబడి నవ్వసాగింది చందన
”ఎందుకు నవ్వుతావు?నా ప్యాంటు,షర్ట్ అక్కడే ఉండిపోయాయి.మధ్యాహ్నం నుండి ఈ లుంగీతోనే తిరుగుతున్నాను .నీకు నవ్వులాటలా ఉందా? ఏదోనువ్వు ఎదురు చూస్తుంటావని వచ్చాను.నవ్వుతున్న చందన వైపు చూస్తూ ఉక్రోషంగా అన్నాడు.
”అది కాదు బుద్దూ…
”బుద్దా… అదేం పేరు?”
”మొద్దబ్బాయికి ముద్దు పేరు బుద్దూ…”
”బుద్దూ లేదు గాడిద గుడ్డు లేదు…హాయిగా నాపేరుతోనే పిలువు…అన్నాడు మరింత ఉక్రోషంగా .
”సరేలే…ఇవ్వాళ అప్సర థియేటర్లో అప్సరలాంటి అమ్మాయి నటించిన సినిమా వుంది వెళుదామా?
”ఇలా…సినిమాకి రావాలా…బ్లాక్ లో టికెట్టు అమ్మే వాడినని ,బొక్కలో తోస్తారు అయినా సినిమాకు వద్దు…సరదాగా నడుచు కుంటూ ఇంటికి వెళదాం… బస్సులో ఐతే డబ్బులు దండగ” అన్నాడు.
ఇద్దరు నడుచుకుంటూ ఇంటి వైపు అడుగులు వేస్తున్నారు.
ఆ జంటను అందరు వింతగా చూస్తున్నారు .
చరణ్ లుంగీ మీద వున్నాడు .
”చరణ్ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం?” అడిగంది చందాన .
” నాకు ఉద్యోగం అయినా రావాలి,లేదా నువ్వు జీవితాంతం నన్ను పోషిస్తానని బాండ్ పేపర్ మీద రాసి అయినా ఇవ్వాలి” అన్నాడు.
”అలాగే… రేపే ముహూర్తం పెట్టించమని మానాన్నతో చెప్పనా?
”ఆమ్మో…మీరంత సూపర్ ఫాస్టా?ముందు నా మీసాలకు సంపెంగ నూనె గురించీ ట్రయ్ చెయ్యని…ఆ తర్వాత మింగ మెతుకు కోసం ట్రయ్ చేస్తాను”నాటకీయంగా అన్నాడు.
”మాఇల్లు వచ్చేసింది” చందన అంది .
” …గుడ్ నైట్… రేపు సాయంత్రం కలుద్దాం .
ఈ రాత్రికే నా ప్యాంటూ, షర్ట్ తెచ్చుకోవాలి. తెల్లారితే ‘ఆ తళ తళ కు వెళ్లి వాడి సబ్బులు వాడి మొహాన కొట్టాలి…”అన్నాడు
”రైట్…గుడ్ నైట్” అంది నవ్వుతు
చరణ్ ముందుకు కదిలాడు.
చందన గుమ్మం దగ్గరికి వచ్చింది. గుమ్మం దగ్గర పిన్ని వుంది.
”ఏంటి…వయసులో వున్న పిల్లవు…ఎవడే వాడు?అని అడగాలనుకుంటున్నావేమో…జాగ్రత్త…
అతడు నాక్కాబోయే మొగుడు…నీలా పెళ్ళాం చచ్చినాయన్ని చేసుకోనులే అంది లోపలి వెళ్ళుతూ.
అలాగే నిలబడి పోయింది యశోద.
***
“ఏరా… చరణ్…ఖాళీగా చేతులూపుకుంటూ వస్తున్నావు ,బాగా బిజినెస్ అయ్యిందా?
అయ్యే ఉంటుంది .ఐడియా మనదే కదా ?దాబా లో చికెన్ బిర్యాని లాగిచేద్దామా?చరణ్ లోపలి అడుగు పెట్టగానే ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రసాద్ .
ప్రసాద్ వైపు సీరియస్ గా చూసి ”ఒక్క నిమిషం” తలుపు వేసి వస్తాను” అని తలుపు వేసి వచ్చాడు .
”ఛా…ఎంత బిజినెస్ అయ్యేలా ప్లాన్ చెబితే మాత్రం కాళ్ళు మొక్కి కృతజ్ఞతలు చెప్పాలా?మొహమాట పడిపోతూ అన్నాడు ప్రసాద్ .
చరణ్ పళ్ళు నూరుతూ హాంగర్ కు వున్న బెల్టు తీసాడు.
ప్రసాద్ అనుమానంగా చూసి బెల్టు ఎందుకురా?అన్నాడు మళ్ళీ పరీక్షగా చరణ్ వైపు చూసి .
“అరే లుంగీ బాగుంది ఎప్పుడు కొన్నావురా?అడిగాడు కాస్త అనుమానంగానే.
బెల్టు పైకెత్తి ”ఏరా…నాకిలాంటి చెత్త ఐడియాలు ఇస్తావా? అంటూ జరిగిందంతా చెప్పి ,ఈ బెల్టు తో నిన్ను చితక బాధి ,కుక్కల వ్యాన్ లో మున్సిపాల్టికీ పార్శిల్ చేస్తా” అన్నాడు కోపంగా.
ఓర్నాయనోయి …దీనికింత ప్లాష్ బ్యాక్ ఉందని తెలియదు. సారీరా…నీ ప్యాంటూ షర్ట్ వచ్చే మార్గం చెబుతా…అపార్ధం చూసుకోకుండా చెప్పింది విను…”అంటూ చెప్పటం మొదలెట్టాడు
***
(ఏమిటా మార్గం …వచ్చే వారం )

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY