“అదికాదు…మీరు బతికే ఉన్నారా?”ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగింది శ్రీలక్మి …వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (11-06-2017)

శ్రీలక్ష్మి ని చూసి కంగారుగా చందన వెనక్కి వచ్చాడు
”ఏమిటండి …ఆ అమ్మాయిని చూసి అలా భయపడతారు”అడిగింది అమాయకంగా చందన
“పాకిస్థాన్ మ్యాప్ లా చీరని ఉతికానని, అనుమానపు మొగుడు గన్ పట్టుకుని చెప్పాడే … ఆవిడే” అన్నాడు.
అప్పటికే శ్రీలక్మి చరణ్ ని చూసి కెవ్వుమంది,
“అమ్మా …తల్లి నువ్వలా’కెవ్వుమని’అరిస్తే జనం అపార్థం చేసుకుని నన్ను కైమా చేస్తారు”చెప్పాడు చరణ్.
“అదికాదు…మీరు బతికే ఉన్నారా?”ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగింది శ్రీలక్మి .
“నీకెందుకు డౌట్ వచ్చింది .తల్లీ” అడిగాడు చరణ్
“మిమ్మల్ని పిట్టను కాల్చినట్టు కాల్చానని చెప్పాడు మా ఆయన” అంది
“నిక్షేపంలా వున్నాను. అవును ఇంతకీ మీరిక్కడికి ఎందుకొచ్చారు?”
“మా  ఆయనకు విడాకులిద్దామని”
“విడాకులా…”చరణ్ ఆశ్యర్యంగా అడిగాడు.
“అవును…ఆయన అనుమానము రోజు రోజుకు ఎక్కువ అవుతుంది .వస్తాను”అంటూ ముందుకెళ్లి ఆగి వెనక్కి తిరిగి అడిగంది చరణ్ ను
తళ తళ సబ్బుల కంపెనీలో పని చేస్తున్నారా?”
“చేస్తున్నా…కానీ మీ ఇంటికి మాత్రం రానులెండి”అన్నాడు లోపలి నడుస్తూ.
“బలే కస్టమర్”అంది చందాన నవ్వుతు.
లాయర్ పరాంకుశం సరదాగా లోపలి ఆహ్వానించాడు.ఆ రోజు మొత్తం అక్కడే గడిపారు.
వచ్చేటప్పుడు చందన పుట్టింటికి వెళ్ళింది.యశోద చంటి గాడికి పాలు తాగిస్తుంది .
పళ్ళు స్వీట్స్ చంటి గాడికి ఇచ్చింది.భావిక, భవేష్ అక్కా అక్కా అంటూ దగ్గరికి వచ్చారు.వాళ్ళతో మాట్లాడకుండా తండ్రి గది వైపు వెళ్ళింది.”
“చందనా నీ పద్ధతేమీ బాగా లేదోయ్ ..చరణ్ మొహమ్మీదే అన్నాడు…
“మీకేం తెలియదు?అంటూ “ఇది నా సవతి తల్లి ఆడే నాటకం”అంది
పిల్లలు చిన్న బుచ్చుకున్నారు.యశోద తన బాధను పైకి కనబడనీయ లేదు.కన్నీళ్లను తనలోనే దిగమింగుకుంది.ఆవేశంలో వున్నవారికి,ద్వేషాన్ని ప్రేమించేవారికి ఎదుటి మనిషిలో ప్రేమ అంత తొందరగా కనిపించదు.
***
ప్రసాద్ కు వేరే కంపెనీ లో జాబ్ వచ్చింది.ట్రైనింగ్ కొరకు ఆరునెలలు విజయవాడ వెళ్లాల్సి వచ్చింది.ఆ రోజే చరణ్ దగ్గరికి వచ్చారు ప్రసాద్ దంపతులు.
“ట్రైనింగ్ కోసం విజయవాడ వెళ్తున్నానని “చెప్పాడు ప్రసాద్.స్టేషన్ వరకు వెళ్లి సెండాఫ్ ఇచ్చారు
***
తళతళ కంపెనీకి నష్టాలూ ఎక్కువయ్యాయి.నటేశన్ కు మెంటల్ గా,ఫైనాన్సియల్ గా టెన్సన్స్ ఎక్కువయ్యాయి.స్టాఫ్ ను చాలా అరకు తగ్గించాడు.పోటీగా మరో నాలుగైదు కంపెనీలు మొదలయ్యాయి.స్టాఫ్ లో సిన్సియారిటీ లేదు.ఈ మధ్యకాలంలో చరణ్ సిన్సియారిటీ వల్ల సేల్స్ ఇంప్రూవ్ అయినా అది పెద్దగా కంపెనీకి ఉపయోగపడలేదు.
చరణ్ కు ఇంచార్జి గా ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచాడు.
***
ఈ మధ్యకాలంలో నటేశన్ కు బాగా దగ్గరయ్యాడు చరణ్.తన తండ్రి స్థాపించిన కంపెనీ అనే అభిమానంతో,నటేశన్ కంపెనీ నడిపిస్తున్నది చరణ్ కు అర్థమైంది.అంతేకాక కంపెనీ మూసేస్తే చాలా కుటుంబాలు వీధిన పడుతాయని ఫీలింగ్ కూడా వుంది నటేశన్ కు.
ఎలాగైనా నటేశన్ కంపనీ మూతపడకుండా చూడాలనే ఆలోచనలో వున్నాడు చరణ్.
మిగితా వచ్చేవారం

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY